హైదరాబాద్ : పని చేస్తున్న షాప్లోనే చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సేల్స్మేన్స్ను సౌత్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 సెల్ ఫోన్లుతోపాటు రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.