విమాన బాత్రూమ్లో భారీగా ఐఫోన్లు, బంగారం...
హైదరాబాద్ : దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూంలో ఆగంతకుడు బ్యాగు వదిలి వెళ్లాడు. ఆ విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కస్టమ్స్ అధికారులు బ్యాగు తెరచి చూడగా... అందులో 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్‌లు, 700 ఆర్‌ఎండీ గుట్కాప్యాకెట్లు, 8 ఐఫోన్ బ్యాటరీలు, 4 ఐప్యాడ్‌లు, 5 కిలోల సఫ్రాన్ ఇరానియం పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. సదరు వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.