ఎమర్జెన్సీ లైటులో 1.8 కిలోల బంగారం
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు
శంషాబాద్: ఓ ప్రయాణికుడు దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 1.8 కిలో ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్రవర్తనను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎమర్జెన్సీ లైటులో పన్నెండు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
మహిళలు వాడే హెయిర్ బ్యాండ్‌లో మరో నాలుగు బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 1.8 కేజీల 16 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కర్ణాటకవాసిగా గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.