శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపిచడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్యాస్ రెగ్యులేటర్ పైపులో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని గుర్తించారు. 350 గ్రాములు ఉన్న బంగారం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.