
ఆపరేషన్ స్మైల్ లో 50 మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి వరకూ కొనసాగిన ఆపరేషన్ స్మైల్ లో పలువురు బాల కార్మికులకు విముక్తి లభించింది. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాతబస్తీలో పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరిట రైడ్ నిర్వహించారు.
ఫలక్ నుమా, ముస్తఫానగర్లో బ్యాగ్ల తయారీ కేంద్రంపై సౌత్ జోన్ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే బిహార్, కోల్కతాకు చెందిన 50 మంది బాలకార్మికులను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ మీడియాకు తెలిపారు.