‘ఆపరేషన్‌ స్మైల్‌’ నవ్వులు పూయిస్తుందా? | Achyutha Rao Article On Operation Smile | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ స్మైల్‌’ నవ్వులు పూయిస్తుందా?

Published Fri, Jan 17 2020 12:23 AM | Last Updated on Fri, Jan 17 2020 12:23 AM

Achyutha Rao Article On Operation Smile - Sakshi

ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జనవరి నెలలో ఆపరేషన్‌ స్మైల్, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరున దేశవ్యాప్తంగా బాల కార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న చిన్నా రుల సంరక్షణ జరుగు తుంది. పోలీసు డిపార్ట్‌ మెంట్, లేబర్‌ డిపార్ట్‌మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్‌ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపట్టే ఈ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాలలో పోలీసు శాఖ తరఫున సీఐడీ డిపార్ట్‌మెంట్‌ గణనీయమైన పాత్ర పోషిస్తున్నది. ఈ ఆపరేషన్‌ స్మైల్‌గానీ, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలకు బీజం పడటానికి కారణం 2009లో సుప్రీంకోర్టు తప్పిపోయిన పిల్లల ఆచూ కీపై విచారణ చేపడుతూ తప్పిపోయిన పిల్లల జాడ కనుగొనాలని అప్పటి ఘజియాబాద్‌ జిల్లా పోలీసు అధికారిని ఆదేశించడంతో, ఆ పోలీసు అధికారి బాల కార్మికులు, వీధి బాలలను పరి రక్షించే చర్యలు చేపట్టడంతో మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ ఎస్పీ పనితీరు సత్ఫలితాలు ఇవ్వ డంతో దేశంలోని 631 జిల్లాల్లో ఘజియాబాద్‌ జిల్లా పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆద ర్శంగా తీసుకొని ఆ రకంగా కార్యక్రమ రూప కల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడ టంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్, జూలై 1 నుండి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపట్టాలని తీర్మానించింది.

అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా ఈ రెండు కార్య క్రమాలు విధిగా చేపడుతూ బాలకార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న వారిని సంరక్షిస్తూ వస్తు న్నాయి. అలాగే ఆరోగ్యకరంగా ఉండి, ఎలాంటి వైకల్యం లేని ఆరు సంవత్సరాలు వచ్చిన బాల, బాలికలు బడి బయట విద్యాబుద్ధులకు దూరంగా ఉంటే వారిని సైతం బాల కార్మికులుగానే గుర్తిస్తూ వారిని పాఠశాలల్లో చేర్చే దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. వీటికి అనుసం ధానంగా దర్పణ్‌ కార్యక్రమం ద్వారా తప్పిపో యిన పిల్లలు ఏదైనా ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంఘాల ఆశ్రమాల్లో నివసిస్తున్నారా అని తెలుసు కోవడానికి మరింత తోడ్పాటు అందిస్తున్నది. ఈ దర్పణ్‌ సహితం మంచి ఫలితాలనే ఇస్తుందనడా నికి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో తప్పిపోయిన పిల్లలు ఇద్దరిని తెలంగాణలో ఒకరు, ఆంధ్రప్రదే శ్‌లో ఒకరిని కనుగొనడం సాధ్యమైంది.
 కానీ, పిల్లల రక్షణ మాత్రమే సరిపోతుందా? బాలకార్మికులను రక్షించామని సంఖ్యలు, అంకెలు చెబుతూ ఆనందిస్తున్నాము. కానీ, పరిరక్షణ విష యానికి వస్తే పూర్తి విఫలం చెందుతున్నాము. జనవరిలో రక్షించిన పిల్లలనే కొందరిని మళ్లీ జూలైలో రక్షిస్తున్నామంటే అన్ని శాఖల శ్రమ ఎంత నిష్ఫలమవుతుందో నిలుస్తున్నది.

ఈ ఆపరేషన్‌ ముస్కాన్, స్మైల్‌ రక్షించిన పిల్లల్ని వారి గుర్తింపు పూర్తయ్యేవరకు వారిని ఉంచేందుకు వసతులు లేక షాదీఖానాలలో లేదా టెంట్లలో ఉంచిన సంద ర్భాలు ప్రతి ఏటా పునరావృతమౌతున్నాయి. ప్రతి ఏటా ఈ ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం చేపట్టి అంతటితో మా పని అయి పోయిందని సంతోషించక కేంద్ర ప్రభుత్వానికీ, అధికారులకూ నిజాయితీగా బాల కార్మిక వ్యవస్థ వీధి బాలల వ్యవస్థను రూపుమాపాలనుకుంటే సందుల్లో, గొందుల్లో బాల కార్మికుల కోసం వెత కడం కన్నా, కేంద్ర ప్రభుత్వం తరఫున టీవీల్లో, పత్రికల్లో ఓ ప్రకటన చేసి తేదీ నిర్ణయించి కర్మాగారాల్లో, ఇళ్లల్లో, గనుల్లో, పనిలో, మాఫియా ముఠాల కనుసన్నల్లో బతుకీడుస్తున్న బాల కార్మికు లను ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పమనీ అనం తరం బాల కార్మికులు ఎవరి వద్దనైనా కనిపిస్తే కఠిన శిక్షతో జైల్లో నెడతామని నిజాయితీగా ప్రక టన చేస్తే దేశం మొత్తంపైన ఉన్న బాల కార్మికులు ప్రభుత్వం చెంతకు చేరడం ఖాయం. అటు పిమ్మట తల్లిదండ్రుల వద్దకి చేర్చి పాఠశాలలకు పంపాలని నిర్దేశిస్తే నిజంగా బాల కార్మికులు లేని భారతదేశంగా ప్రపంచ దేశాలముందు సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్న కిటుకు కేంద్ర ప్రభు త్వానికి తెలియంది కాదు. కానీ, బాల కార్మికుల నందరినీ ఒకేసారి రక్షిస్తే ప్రజల ముందు చెప్పు కోవడానికి ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వచ్చే అవకాశం కోల్పోతారు. పిల్లల వద్దనైనా రాజ కీయాలు పక్కన పెడితే వారి జీవితాల్లో నవ్వుల పువ్వులు పూయించవచ్చు.

అచ్యుతరావు
వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్‌ : 93910 24242

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement