Operation Smile
-
Operation Muskaan: చిట్టిచేతులు వెట్టివెతలు!
సాక్షి, హైదరాబాద్: పలక, బలపం పట్టి అక్షరాలు నేర్వాల్సిన చిట్టిచేతులు ఇటుకపెళ్లలు పడుతున్నాయి. వసివాడని బాల్యం నుసిలో కొట్టుమిట్టాడుతోంది. వెట్టిచాకిరిలోనే బతుకు తెల్లారుతోంది. తల్లిఒడిలో సురక్షితంగా ఉండాల్సిన బాల్యం ఇటుకబట్టీల్లో బందీ అవుతోంది. పేదపిల్లలు, అనాథల బాల్యం అంధకారంలో మగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ విభాగాలు ఆపరేషన్ ముస్కాన్; ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రెస్క్యూ చేసి బాలలను కాపాడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులు, వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన మైనర్లను, వీధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒక్కసారి లెక్కలు చూస్తే... ►2020లో జరిగిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 3,274 మంది చిన్నారులను రెస్క్యూ చేయగా, వీరిలో 1,982 మందిని కుటుంబాలకు చేర్చగా, 1,292 చిన్నారులను వారి వారి రాష్ట్రాలకు పంపించి వేశారు. ►2021 జరిపిన ఆపరేషన్ స్మైల్ ఏడో దఫాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వెట్టిచాకిరి నుంచి 3,969 మంది చిన్నారులకు పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా విముక్తి కలిగించాయి. ఇందులో 2,662 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 1,307 ప్రభుత్వ బాలసదనాలకు అప్పగించారు. ►ఇకపోతే 2022 జనవరిలో నెలలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 600 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. వీరిలో రాష్ట్రానికి చెందిన 433 మంది ఉండగా, 157 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ స్పష్టం చేసింది. రెస్క్యూ చేసినవారిలో 456 మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, 144 మందిని ప్రభుత్వ బాలసదనాలకు తరలించారు. ►ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో 3,406 మందిని రెస్క్యూ చేసినట్టు మహిళా, చిన్నారుల భద్రతావిభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన 1,025 చిన్నారులున్నట్టు తెలిపారు. బాలకార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రాంతాలను, సంబంధిత పరిశ్రమల ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తూ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులకు తెలిసే... ఆపరేషన్ ముస్కాన్గానీ, స్మైల్ కార్యక్రమాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 80 శాతం కేసుల్లో తల్లిదండ్రులకు పిల్లలు పనిచేస్తున్న విషయం తెలుసని పోలీస్ శాఖ ఓ అంచనాకు వచ్చింది. కుటుంబ పరిస్థితులును దృష్టిలో పెట్టు కొని పిల్లలను పరిశ్రమల్లో పనికి పెడుతున్నట్టు దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను టార్గెట్‌గా చేసుకొని వెట్టిచాకిరి మాఫియా చిన్నారులను పనుల్లో పెట్టి కమిషన్ల పేరిట దండుకుంటున్నట్టు వెలుగులోకి వచ్చిందని తెలిసింది. ఇప్పటివరకు ఆపరేషన్ స్మై ల్, ముస్కాన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కేసులకుపైగా నమోదు చేసినట్టు పోలీస్‌వర్గాలు తెలిపా యి. ఈ నేపథ్యంలో ఇటుకబట్టీల్లో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వచ్చేఏడాదిలో ఇతరత్రా పరిశ్రమలపై దృష్టి పెట్టి మిగిలిన బాలకార్మికులను సైతం రెస్క్యూ చేయాలని పోలీస్ శాఖ, ఇతర విభాగాలు భావిస్తున్నాయి. -
తప్పిపోయిన చిన్నారులను గుర్తించేలా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం
సాక్షి హైదరాబాద్: చిన్నారుల మోములో చిరునవ్వులు వికసించాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. తప్పిపోయి నిరాదరణకు గురై ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల అక్కున చేరుతుండగా, వెట్టిచాకిరీలో మగ్గుతున్న బడీడు బాలకార్మికులు చదువుబాట పడుతున్నారు. బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ నెల 1 నుంచి 31 వరకు తప్పిపోయిన బాలలను గుర్తించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణతో పాటు భిక్షాటన చేసే చిన్నారులు, వీధిబాలలు, అనాథలు, బడిమానేసిన చిన్నారులు, ఇతరత్రా అంశాల్లో వారిని గుర్తించి విముక్తి కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రంగంలోకి బృందాలు గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ స్మైల్– 8 స్పెషల్ డ్రైవ్ కోసం పోలీసు డిపార్ట్మెంట్ , లేబర్ డిపార్ట్మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కూడిన సుమారు 24 బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇళ్లు, గాజుల పరిశ్రమలు, భిక్షాటన, దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఈ బృందాలు కృషి చేస్తాయి. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన అదృశ్యం కేసుల్లోనూ చిన్నారుల వివరాలను సేకరించి.. వాటిని సీసీటీఎన్‌ఎస్‌లోని డాటాబేస్‌తో పోల్చిచూస్తున్నారు. ఇందుకోసం పోలీసులు దర్పణ్ అనే సరికొత్త టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు. దీనిద్వారా తప్పిపోయిన చిన్నారులు.. వివిధ ప్రభుత్వ హోంలు, అనాథాశ్రమాలు, ఎన్జీఓల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఫొటోలను పోల్చిచూస్తూ వారి వివరాలు కనిపెట్టడంలో సఫలీకృతమవుతున్నారు. సదుపాయాలు ఏవి? ఆపరేషన్ స్మైల్‌లో చిన్నారుల గుర్తింపు, కుటుంబాల వద్దకు చేర్చడం, లేదా వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పించడం సమస్యగా తయారైంది. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య తప్పడంలేదు. పతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామన్న మహిళా శిశు సంక్షేమ శాఖ హామీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల బాలల వివరాలు, కనుక్కోవడం క్లిష్టతరంగా మారుతోంది. ఎనిమిదేళ్లుగా... వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో ఆపరేషన్ స్మైల్ 2015లోశ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లలో సుమారు 3 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 1600 మందికిపైగా చిన్నారులను తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 14వందల మందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌కు బీజం పడింది. పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆదర్శంగా తీసుకొని కార్యక్రమ రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నారు. -
16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్ల కింద తప్పిపోయిన ఓ బాలిక రాష్ట్ర పోలీసుల సాయంతో తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో 16 ఏళ్ల కింద ఓ బాలిక తప్పిపోయింది. అప్పట్లో ఆ బాలికను కొందరు చేరదీసి మియాపూర్ అనాథాశ్రమానికి పంపారు. ఆపరేషన్ స్మైల్–7లో భాగంగా అనాథాశ్రమంలోని చిన్నారుల వివరాలపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం పోలీసులు ఆరా తీశారు. హుస్సేనీ ఆలంలో మిస్సైన బాలికను గుర్తించారు. గతంలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారు ప్రస్తుతం ఎక్కడున్నారో గాలించారు. కర్నూలులో ఉన్న బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గురువారం అనాథాశ్రమానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలిక వారి కూతురేనని నిర్ధారించారు. 16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఆపరేషన్ స్మైల్’ నవ్వులు పూయిస్తుందా?
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరున దేశవ్యాప్తంగా బాల కార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న చిన్నా రుల సంరక్షణ జరుగు తుంది. పోలీసు డిపార్ట్ మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపట్టే ఈ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాలలో పోలీసు శాఖ తరఫున సీఐడీ డిపార్ట్మెంట్ గణనీయమైన పాత్ర పోషిస్తున్నది. ఈ ఆపరేషన్ స్మైల్గానీ, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలకు బీజం పడటానికి కారణం 2009లో సుప్రీంకోర్టు తప్పిపోయిన పిల్లల ఆచూ కీపై విచారణ చేపడుతూ తప్పిపోయిన పిల్లల జాడ కనుగొనాలని అప్పటి ఘజియాబాద్ జిల్లా పోలీసు అధికారిని ఆదేశించడంతో, ఆ పోలీసు అధికారి బాల కార్మికులు, వీధి బాలలను పరి రక్షించే చర్యలు చేపట్టడంతో మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ ఎస్పీ పనితీరు సత్ఫలితాలు ఇవ్వ డంతో దేశంలోని 631 జిల్లాల్లో ఘజియాబాద్ జిల్లా పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆద ర్శంగా తీసుకొని ఆ రకంగా కార్యక్రమ రూప కల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడ టంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టాలని తీర్మానించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా ఈ రెండు కార్య క్రమాలు విధిగా చేపడుతూ బాలకార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న వారిని సంరక్షిస్తూ వస్తు న్నాయి. అలాగే ఆరోగ్యకరంగా ఉండి, ఎలాంటి వైకల్యం లేని ఆరు సంవత్సరాలు వచ్చిన బాల, బాలికలు బడి బయట విద్యాబుద్ధులకు దూరంగా ఉంటే వారిని సైతం బాల కార్మికులుగానే గుర్తిస్తూ వారిని పాఠశాలల్లో చేర్చే దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. వీటికి అనుసం ధానంగా దర్పణ్ కార్యక్రమం ద్వారా తప్పిపో యిన పిల్లలు ఏదైనా ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంఘాల ఆశ్రమాల్లో నివసిస్తున్నారా అని తెలుసు కోవడానికి మరింత తోడ్పాటు అందిస్తున్నది. ఈ దర్పణ్ సహితం మంచి ఫలితాలనే ఇస్తుందనడా నికి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తప్పిపోయిన పిల్లలు ఇద్దరిని తెలంగాణలో ఒకరు, ఆంధ్రప్రదే శ్లో ఒకరిని కనుగొనడం సాధ్యమైంది. కానీ, పిల్లల రక్షణ మాత్రమే సరిపోతుందా? బాలకార్మికులను రక్షించామని సంఖ్యలు, అంకెలు చెబుతూ ఆనందిస్తున్నాము. కానీ, పరిరక్షణ విష యానికి వస్తే పూర్తి విఫలం చెందుతున్నాము. జనవరిలో రక్షించిన పిల్లలనే కొందరిని మళ్లీ జూలైలో రక్షిస్తున్నామంటే అన్ని శాఖల శ్రమ ఎంత నిష్ఫలమవుతుందో నిలుస్తున్నది. ఈ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ రక్షించిన పిల్లల్ని వారి గుర్తింపు పూర్తయ్యేవరకు వారిని ఉంచేందుకు వసతులు లేక షాదీఖానాలలో లేదా టెంట్లలో ఉంచిన సంద ర్భాలు ప్రతి ఏటా పునరావృతమౌతున్నాయి. ప్రతి ఏటా ఈ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టి అంతటితో మా పని అయి పోయిందని సంతోషించక కేంద్ర ప్రభుత్వానికీ, అధికారులకూ నిజాయితీగా బాల కార్మిక వ్యవస్థ వీధి బాలల వ్యవస్థను రూపుమాపాలనుకుంటే సందుల్లో, గొందుల్లో బాల కార్మికుల కోసం వెత కడం కన్నా, కేంద్ర ప్రభుత్వం తరఫున టీవీల్లో, పత్రికల్లో ఓ ప్రకటన చేసి తేదీ నిర్ణయించి కర్మాగారాల్లో, ఇళ్లల్లో, గనుల్లో, పనిలో, మాఫియా ముఠాల కనుసన్నల్లో బతుకీడుస్తున్న బాల కార్మికు లను ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పమనీ అనం తరం బాల కార్మికులు ఎవరి వద్దనైనా కనిపిస్తే కఠిన శిక్షతో జైల్లో నెడతామని నిజాయితీగా ప్రక టన చేస్తే దేశం మొత్తంపైన ఉన్న బాల కార్మికులు ప్రభుత్వం చెంతకు చేరడం ఖాయం. అటు పిమ్మట తల్లిదండ్రుల వద్దకి చేర్చి పాఠశాలలకు పంపాలని నిర్దేశిస్తే నిజంగా బాల కార్మికులు లేని భారతదేశంగా ప్రపంచ దేశాలముందు సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్న కిటుకు కేంద్ర ప్రభు త్వానికి తెలియంది కాదు. కానీ, బాల కార్మికుల నందరినీ ఒకేసారి రక్షిస్తే ప్రజల ముందు చెప్పు కోవడానికి ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వచ్చే అవకాశం కోల్పోతారు. పిల్లల వద్దనైనా రాజ కీయాలు పక్కన పెడితే వారి జీవితాల్లో నవ్వుల పువ్వులు పూయించవచ్చు. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
కనిపిస్తే చెప్పండి..!
ఆపరేషన్ స్మైల్–6లో భాగంగా అనాథలు, వీధిబాలలు, రెస్టారెంట్లు, హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికుల సమాచారాన్ని తమకు అందజేయాలని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతిలక్రా విజ్ఞప్తి చేశారు. అలాంటి చిన్నారులు ఎక్కడ కనిపించినా.. డయల్ 100, ఫేస్బుక్, హాక్ఐ, వాట్సాప్, 1098లకు సమాచారం అందించాలని కోరడంతోపాటుగా సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీనిచ్చారు. వివిధ కారణాల వల్ల ఏటా వందలాది మంది చిన్నారులు వెట్టిచాకిరీలో బందీలుగా మారుతున్నారని, ఈ తరహా బాధిత చిన్నారులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు జరగనున్న ఆపరేష న్ స్మైల్‌లో ప్రత్యేక బృందాలు రద్దీ ప్రాంతాల్లో చిన్నారులను కాపా డేందుకు రంగంలోకి దిగాయి. ఇప్పటి దాకా దాదాపు 900 మందికిపైగా చిన్నారులను కాపాడారు. వారిలో ముగ్గురిని దర్పణ్ యాప్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్ : వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో 2015లో చేపట్టిన ఆపరేషన్ స్మైల్– ముస్కాన్‌లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు దాదాపు 32 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 15 వేలమందిని తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 16 వేలమందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో చేప డుతున్న కార్యక్రమం రెండు నెలలపాటే జరుగుతుంది. ఏడాది మొత్తం సాధ్యమేనా? బాలకార్మికులు, వీధిబాలల రక్షణకు ఈ స్పెషల్ డ్రైవ్ ఏడాది మొత్తం చేపట్టాలని పోలీసుశాఖకు శిశు సంక్షేమ, లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి పలువురు నిపుణులు సూచనలు చేశారు. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనవరి, జూలై రాగానే..పనులు చేయించుకునేవారంతా ఆ పిల్లలు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. అందుకే, ఏడాదిమొత్తం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే, మానవ వనరుల కొరత, ఇతర కారణాల వల్ల సాధ్యం కాకపోయినా..ఈసారి ఏడాది మొత్తం వెట్టిచాకిరీ, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని పోలీసులకు డీజీపీ సూచించారు. ఈ నేపథ్యంలో పిల్లలను తరలించే స్మగ్లర్లు, ఏజెంట్లు, యజమానులపై ఈసారి పీడీ యాక్టులు పెట్టాలన్న ఒత్తిడి సర్వత్రా వ్యక్తమవుతోంది. వేధిస్తోన్న సదుపాయాల లేమి..! స్మైల్ సందర్భంగా చేపట్టే ఆపరేషన్‌లో పోలీసులు వేలాదిమంది చిన్నారులను కాపాడుతుంటారు. వారందరికీ వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య ఎదురవుతోంది. ఈసారి ప్రతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ హామీనిచ్చింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడం వల్ల బిహార్, గుజరాత్, ఒడిశా, అస్సాం నుంచి వస్తోన్న బాలల వివరాలు, చిరునామా కనుక్కోవడం చాలా క్లిష్టంగా మారుతోంది. పదేపదే పోలీసులకు దొరుకుతున్న బాలల్లో మార్పుకోసం సైకాలజిస్టును నియమించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈసారి భాష అనువాదానికి దుబాసీ, పిల్లల మానసికస్థితిని అంచనా వేసేందుకు సైకాలజిస్టుల నియామకం జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఏటేటా పట్టుబడుతున్న పిల్లల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. -
రేపటి నుంచి ఆపరేషన్ స్మైల్
సాక్షి, హైదరాబాద్: వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిట్టి చేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చేపడుతున్న దాడులు వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగిస్తున్నాయి. ఈసారి దాడుల్లో గుర్తించిన పిల్లల్లో దళిత, గిరిజనులు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టనున్నారు. 2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు. చిన్నారుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు.. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో ఆల్బమ్‌ను రూపొందిస్తారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. దీనికిగాను ప్రతీ సబ్ డివిజన్లో ఒక ఎస్ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు. -
బాల కార్మికుల బాగోగులు చూడాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: బాలలను రకక్షించడం వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బాలకార్మికులను కాపాడటమే కాకుండా పదేళ్లపాటు వాళ్ల బాగోగులను చూసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఆయన డీజీపీ కార్యాలయంలో ‘ఆపరేషన్ స్మైల్’పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, పోలీసు ఉన్నతాధికారులు జితేందర్, స్వాతి లక్ర, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, పలు శాఖల అధికారులు, అన్ని జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులు విధి లేని పరిస్థితుల్లో బాలకార్మికులుగా మారుతున్నారన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది సామాజిక సేవగా అభివర్ణించారు. వృత్తిలో భాగంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆపదలో ఉన్న బాలలను కాపాడంలో ఉండే ఆనందమే వేరన్నారు. బాల కార్మిక వ్యవస్థ, అక్రమ రవాణా చేసే వాళ్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. పిల్లలను అక్రమ రవాణా చేసేవాళ్లు జనవరి, జూన్ మాసాల్లో అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ రెండు నెలల్లో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఉంటుందని వారు ముందే జాగ్రత్తపడతారని తెలిపారు. పోలీస్ శాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకొని అందరూ ఒకే లక్క్ష్యంతో ముందుకెళితే ఆశయం నెరవేరుతుందని వివరించారు. కేవలం రెండు నెలలు కాకుండా ఏడాది మొత్తం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
'ముస్కాన్'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్ సిటీలో మొత్తం 17 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా హైదరాబాద్‌లో మొత్తం 445 మంది వీధి బాలలు, బాల కార్మికులను అధికారులు కాపాడారు. వీరిలో 407 మంది బాలురు ఉండగా, 38మంది బాలికలు ఉన్నారు. పట్టుబడిన బాల కార్మికుల్లో 381 మంది చిన్నారులను గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తమ తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా వారికి చదువుకోవడానికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారు, మరో 64 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్ కు తరలించామని అధికారులు వివరించారు. పలువురు బాలురను సైదాబాద్ రెస్క్యూ హోమ్ కు, బాలికలను నింబోలిఅడ్డ రెస్క్యూ హోమ్ కు తరలించామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. కార్మిక శాఖ అధికారులు చట్టవ్యతిరేకంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 7 కేసులు నమోదు చేసి 18 లక్షలకు పైగా జరిమానా వేశారు. కాగా జనవరిలో నిర్వహించిన ఆపకేషన్ స్మైల్‌లో భాగంగా 429మంది చిన్నారులను, ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 874 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. -
బాలకార్మికులకు బంధవిముక్తి
సాక్షి, (కరీంనగర్) : బాలకార్మికులను వ్యవస్థను నిర్మూలించేందుకు బడి బయట వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఆపరేషన్ ముస్కాన్. ఐదేళ్లుగా ప్రభుత్వం ఏటా జూలైలో ఈ కార్యక్రమం చేపట్టి బాలకార్మికులను బంధ విముక్తులను చేస్తోంది. చిన్నారుల మోములో చిరునవ్వు పూయిస్తోంది. సోమవారం నుంచి జూలై 30 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ పోలీస్‌శాఖ, ఐసీడీసీఎస్ శాఖ ప్రణాళిక రూపొందించింది. రెండు శాఖలు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న లేదా బడికి వెళ్లని బాల కార్మికులను, ఇతర ప్రాంతాల నుంచి తప్పిపోయి వచ్చి కార్మికులుగా మారిన బాలలను, భిక్షాటన చేసే వారిని, అనాథలుగా ఉన్న వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తారు. తిరిగి బడిబాట పట్టెలా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్.. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాలకార్మికులను, బిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న వారిని గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను ఆనాథశ్రయాలకు పంపించడం, వారికి మెరుగైన విద్య అందించేందదుకు చర్యలు తీసుకునేందుకు ఈ రెండు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా జనవరి 1 నుంచి 30 రోజులు పాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో మళ్లీ జులై 1 నుంచి 30 రోజులు ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికుల వ్యవస్థ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2015 నుంచి స్మైల్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించగా, ముస్కాన్ ఇప్పటి వరకు నాలుగుసార్లు నిర్వహించారు. ఐదో విడత సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఐదుసార్లు నిర్వహించిన స్మైల్, నాలుగుసార్లు నిర్వహించిన ముస్కాన్ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 2,700 మంది బాలబాలికలను గుర్తించారు. వారిని బాల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపరిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. పలు శాఖల సమన్వయం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో పలు శాఖలను భాగస్వాములు చేస్తున్నారు. పోలీస్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, స్వచ్ఛంద సంస్థలు, కార్మికశాఖ, విద్య, వైద్యశాఖలు, రెవెన్యూ, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చెందిన సిబ్బందితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలను కూడా భాగస్వాముల చేస్తూ బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బడి బయటే బాల్యం బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇది మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పలు కుటుం బాలు ఆర్థిక స్థోమత, ఇళ్లలో ఉం టున్న ఇబ్బందులు మూలంగా పిల్లలను తిరిగి పనికి పంపుతున్నారు. వారిని పట్టుకుని ఇంటికి పంపిస్తున్నా వారు మళ్లీ్ల పనికి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనితో బాలకార్మికులు అలాగే ఉండిపోతున్నారు. బాలలు కార్మికులుగా మారడానికి కారణాలు తెలుసుకుని వాటిని నిర్మూలించినప్పుడే బాలకార్మికులు మళ్లీ కార్మికులు మారకుండా బడికి వెళ్లడానికి సిద్ధపడతారు. కొందరు అనాథగా ఉన్న వారు సంరక్షణ కేంద్రాల్లో కొంతకాలం ఉంటున్నారు. వివిధ పరిస్థితుల ప్రభావంతో మళ్లీ అక్కడి నుంచి బయటపడి కార్మికులుగా మారుతున్నారు. మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అయా శాఖల సమన్వయంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పలు శాఖల భాగస్వామ్యం ఉన్నా కూడా పోలీస్, ఐసీడీసీఎస్ శాఖలు మాత్రమే బాధ్యతాయుతంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు స్పందించి 30 రోజులు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌లో భాగస్వాములై బాల కార్మికులు లేకుండా చేసేందుకు ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు. -
చిన్నారులు.. చిరునగవులు
సాక్షి, హైదరాబాద్: వీధి బాలలు, అనాథలు, తప్పిపోయిన చిన్నారులను చేరదీసి వారికి రక్షణ కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు ఫలించి ఎందరో చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం రావడం... ఫలితంగా బాలకార్మికులు, వీధిబాలలు, భిక్షాటన చేయించడం తగ్గుముఖం పడుతున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది. ప్రతీ ఏటా జనవరిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, లేబర్, జీహెచ్ఎంసీ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ ఆపరేషన్ స్మైల్ లో ఈ సంవత్సరం 2,425 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. అందులో 2,168 చిన్నారులను సేకరించిన వివరాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 66 మంది పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారికి అప్పగించగా...మరో 191 మంది చిన్నారులను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. ప్రతీ ఏటా జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. ఐదేళ్లలో 23 వేల చిన్నారులకు రక్షణ హైదరాబాద్‌లోని పలు దుకాణాల యజమానులు చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారని పలు ఫిర్యాదులు రావడంతో 2014–15 సంవత్సరంలో పోలీస్ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్‌లోని బ్యాంగిల్ ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి 356 మంది చిన్నారులను గుర్తించారు. వారిని పనిలో నుంచి తొలగించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందర్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించారు. స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు 23,476 మంది చిన్నారులను అధికారులు గుర్తించి చేరదీశారు. వీరిలో కుటుంబ సభ్యుల వివరాలు చెప్పిన వారికి ఇంటికి పంపించారు. అనాథపిల్లలను కస్తూర్భా గాంధీ పాఠశాలలు, వసతిగృహాల్లో చేర్పించారు. పరిస్థితి మారుతోంది రాష్ట్రంలో బాలకార్మికులు, వీధిబాలలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా దొరుకుతున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలిపిన వారిని ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నాం. చట్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై ప్రచారం చేయడం, క్షేత్రస్థాయి నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో చాలాచోట్ల పరిస్థితి మారింది. గణాంకాల్లోనూ పిల్లల సంఖ్య తగ్గుతూ రావడం శుభపరిణామం. –కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -
2,775 మంది చిన్నారుల ముఖాల్లో ‘స్మైల్’
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలల సంరక్షణ లో భాగంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తం గా 2,775 మంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపిం ది. మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల సహకారం తో జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షెల్టర్లు తదితర ప్రాంతాల్లో ‘స్మైల్’ బృందాలు పర్యటించాయి. తప్పిపోయిన, ఒంటరిగా కనిపించిన 2,775 మంది చిన్నారులను చేరదీశాయి. వీరిలో 2,169 మంది బాలురు, 606 మంది బాలికలు న్నారు. బాలల నుంచి వివరాలను ఆరా తీసిన అధికారులు.. రాష్ట్రానికి చెందిన 2,671 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళ నాడు రాష్ట్రాలకు చెందిన మరో 104 మందిని సైతం సొంతవూర్లకు పంపేందుకు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యు లకు అప్పగించిన వారు మినహా మిగతా చిన్నారులకు స్టేట్ హోం లలో వసతి కల్పించారు. యాదాద్రిలో అత్యధికంగా.. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా గుర్తించిన చిన్నారుల్లో అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందినవారు ఉన్నారు. యాదాద్రిలో 398 మంది, తర్వాత హైదరాబాద్ జిల్లాలో 344 మంది చిన్నారులను గుర్తించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిలా ్లల్లోనూ ఎక్కువ సంఖ్యలో చిన్నారులను అధికారులు గుర్తించారు. మూడేళ్లుగా చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఇప్పటివరకు 13,018 మంది చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆపరేషన్ స్మైల్‌లో 35మంది పిల్లలకు విముక్తి
-
‘ఆపరేషన్ స్మైల్’ను పటిష్టంగా చేపట్టాలి
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన జనగామ అర్బన్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్‌ను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో బాలల సంరక్షణ కొరకు నిర్వహించనున్న ఆపరేషన్ స్మైల్–3 కార్యక్రమంపై శుక్రవారం ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ స్మైల్–3 స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. తప్పిపోయిన, భిక్షాటన చేసే పిల్లలను వారి తల్లిదండ్రులకు చేర్చేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను అదేశించారు. సమీక్షలో జనగామ ఏసీపీ పద్మనాభరెడ్డి, లేబర్ ఆఫీసర్ శంకర్, డీడబ్ల్యూఓ పద్మజారమణ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన విధానం మారాలి.. దేశ పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానం మారాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలోని వైన్స్, బార్ షాపు యజ మానులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాల్లో తప్పకుండా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. అమ్మకందారుడు మారితే వినియోగదారులు కూడా మారుతారన్నారు. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ యాప్‌లను వాడుకోవాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు కోసమే నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. శామీర్‌పేటలో గ్రామ సందర్శన జనగామ : మండలంలోని శామీర్‌పేటలో శుక్రవారం గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవసేన, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రసాద్‌రావుతోపాటు పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శామీర్‌పేట గ్రామాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆదర్శ గ్రామం గా నిలపాలని ఆక్షాంక్షించారు. క్యాష్‌లెస్ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు. విద్యార్థులు నగదు రహి త చెల్లింపులపై అవగాహన ఏర్పరచుకుని వారి కుటుంబసభ్యులకు కూడా తెలియజేయాలన్నారు. గ్రామంలో ఇంకా బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డులు తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలన్నారు. -
టార్గెట్..సేఫ్ సిటీ
► ఎనిమిది శాతం మేర తగ్గిన నేరాలు ► తీవ్రమైన వాటిపై ప్రత్యేక దృష్టి ► ఆపరేషన్ స్మైల్‌లో దేశంలోనే అగ్రస్థానం ► యూబ్ఖాన్పై చట్ట ప్రకారం చర్యలు ► వార్షిక సమావేశంలో నగర కొత్వాల్ వెల్లడి సిటీబ్యూరో: ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసుల సమష్టి కృషి ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో 8 శాతం నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో 2016కు సంబంధించి వార్షిక నివేదిక విడుదల చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. సేఫ్ సిటీ స్థాపన లక్ష్యంతో... ‘తెలంగాణ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ఆదేశాల మేరకు నగరంలో వ్యవస్థీకృత నేరాలకు తావు లేకుండా, దేశంలోనే ఉత్తమ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడానికి సిటీ పోలీసు వింగ్ అహర్నిశలు పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన బోనాలు, గణేష్ ఉత్సవాలు సహా అన్ని కీలక ఘట్టాలనూ చిన్న ఉదంతం కూడా లేకుండా పూర్తి చేయగలిగాం. ఒకప్పుడు నగరంలో మహిళలు ఆభరణాలు ధరించి బయటకు రావడానికి భయపడేవారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పని చేయడంతో స్నాచింగ్స్ కేసుల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. తీవ్రమైన నేరాలు 31 శాతం, ప్రాపర్టీ అఫెన్సులు 16 శాతం, వేధింపులు 18 శాతం, మహిళలపై జరిగే నేరాలు 12 శాతం తగ్గుదల నమోదుచేసుకున్నాయి. షీ–టీమ్స్ పని తీరు కారణంగా వేధింపుల కేసులు 1175 (2015) నుంచి 969కు (2016) వచ్చాయి. నేరగాళ్ళకు శిక్షలు పడేలా చర్యలు... కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండెన్సీ తగ్గించడం, నేరగాళ్ళపై కేసులు రుజువు చేయడానికి అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు చేపట్టాం. ఫలితంగా 50 శాతం పెండెన్సీ తగ్గింది. కరుడుగట్టిన, పదేపదే నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నాం. మరోపక్క న్యాయవ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకుని వారు జైల్లో ఉండగానే కేసు విచారణ పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాం. ఫలితంగా నేరం నిరూపితమయ్యే కేసుల శాతం 36కు పెరగడంతో పాటు 23 మందికి జీవితఖైదు పడింది. సేఫ్ సిటీగా పిలిచే చెన్నైలో ప్రతి ఏడాది 2500 మంది నేరగాళ్ళపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ సిటీలో ఈ ఏడాది 283 మందిపై ప్రయోగించాం. దీంతో ఇప్పటి వరకు మొత్తం 547 మందిపై ఇది ప్రయోగించినట్లైంది. ప్రజల కోసం, వారి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వీటి ఆధారంగా 244 కేసుల్లో ఆధారాలు లభించగా... 210 మందిని గుర్తించి అరెస్టు చేశాం. బాలబాలికల కోసం ‘స్మైల్’... ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్న, బాల్యాన్ని కార్ఖానాలకు అంకితం చేస్తున్న బాలబాలికల విముక్తి కోసం ఆపరేషన్ స్మైల్ చేపట్టి వారిని రెస్క్యూ చేస్తున్నాం. 800 మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. సుప్రీం కోర్టు గతంలో ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఎ)ను తొలగించింది. దీనిస్థానంలో రావాల్సిన మరో సెక్షన్ అమలులోకి రాలేదు. దీంతో ఈ సెక్షన్ కింద నమోదు చేసే కేసులు తగ్గడంతో సైబర్ క్రైమ్స్‌లో 24 శాతం తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఉత్తమంగా ఉంది. అయినప్పటికీ సంతృప్తి పడకుండా ఇంకా మెరుగుదలకు కృషి చేస్తున్నాం. వివిధ రకాల క్రమశిక్షణా చర్యల కింద ఈ ఏడాది దాదాపు 25 మంది పోలీసుల్ని డిస్మిస్ చేశాం. పోలీసు ట్విన్ టవర్స్ పనులు ప్రారంభమయ్యాయి. 21 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లోపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. పదేపదే ‘నిర్లక్ష్యాలపై’ చర్యలు... నగరంలోని కొన్ని ఆస్పత్రులు, స్కూళ్ళల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఓకే హాస్పటల్, స్కూల్లో పదేపదే ఉదంతాలు జరిగితే వాటి లైసెన్సులు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించాం.’ అని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అయూబ్‌ఖాన్ కేసులపై ప్రత్యేక దృష్టి... సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేసిన అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. అతడు సాక్షుల్ని బెదిరించే, ప్రభావితం చేసే ఆస్కారం లేకుండా జైల్లో ఉన్నప్పుడే కేసుల విచారణ పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. ఇతడి బోగస్ పాస్‌పోర్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి శిక్షపడక ముందే దీన్ని పొందాడని తెలుస్తోంది. ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు తేలినా బాధ్యులైన సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. నగరంలో సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా దీనికి ఆకర్షితులైన వారిని గుర్తించి కుటుంబీకులు, సంబంధీకులతో కలిపి డీ–రాడికలైజేషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. హద్దులు దాటిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. మరోపక్క మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు నిరోధించే చర్యలు తీసుకుంటున్నాం. 2015లో 16,633 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా... 2940 మంది జైలుకు వెళ్ళారు. నవంబర్ 30 వరకు 16,602 కేసులు నమోదుకాగా.. జైలుకు వెళ్ళిన వారి సంఖ్య 7017గా ఉంది. ‘నిషా’చరుల నుంచి రూ.2,92,40,700 జరిమానా వసూలైంది. -
ఆపరేషన్ స్మైల్..!
నల్లగొండ : ఆపరేషన్ స్మైల్ మొదటి విడతను 2015 జనవరి 1న ప్రారంభిం చారు. ఆ తర్వాత ప్రతి ఏడు నెలలకో సారి స్మైల్ రెండు సార్లు, ముస్కాన్ పేరుతో రెండు సార్లు నిర్వహించారు. రెండేళ్లలో ఇప్పటి వరకు నాలుగు విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్మైల్, ముస్కాన్ పేర్లతో నిర్వహించిన తనిఖీల్లో 1259 మంది బాలబాలికలను గుర్తించారు. దీంట్లో 1194 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు అప్పగించారు. మిగిలిన 65 మంది బాల, బాలికలను ప్రభుత్వ, ప్రభుత్యేతర సంస్థల్లో ఆశ్రయం కల్పించారు. బాల కార్మిక చట్టం ప్రకారం కార్మి క శాఖ ద్వారా 19 మంది యజమానుల నుంచి రూ.1.40 లక్షలు జరిమాన విధించి వసూలు చేశారు. నెల రోజుల ఆపరేషన్.. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగులతో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొ ందించింది. దీనికోసం ఒక్కో డివిజన్‌కు ఒక్కో బృందం చొప్పున నల్లగొండ జిల్లాలో నల్ల గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, యాదాద్రి జిల్లాలో చౌటుప్పుల్, భువనగిరి డివిజన్లకు ప్రత్యేక టీమ్‌లను నియమిస్తున్నారు. ఒక్కో టీమ్‌లో ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, దాంట్లో మహిళా కానిస్టేబుల్ ఒకరు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ఒక ఉద్యోగి, కార్మిక శాఖ నుంచి మరొకరు ఉంటారు. ఈ ఐదు టీమ్‌లు నెల రోజుల పాటు ఆయా డివిజన్ల పరిధిలోని పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, కర్మాగారాల్లో విస్తృత తనిఖీలు చేస్తారు. ఎక్కడైనా అనాథలు, తప్పి పోయిన చిన్నారులు, బాల కార్మికులు కనిపిస్తే వారిని తమ అదుపులోకి తీసుకుని రక్షణ కల్పిస్తారు. అన్ని చోట్ల తనిఖీలు.. ప్రభుత్వ అనుమతి పొందిన అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర వసతి గృ హాల్లో కూడా స్మైల్ బృందాలు తనిఖీ చేస్తాయి. వివిధ కారణాలతో ఇక్కడ ఆశ్రయం పొం దుతున్న వారిని కూడా గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి తప్పిపోయి వచ్చిన వారిని, పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్న బాల, బాలి కలను గుర్తించి తమ సొంత ఇళ్లకు పంపిస్తారు. బాల కార్మికులే అధికం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద గతంలో పట్టుబడిన వారిలో అధికంగా బాలకార్మికులే ఉ న్నారు. అనేక మంది చిన్నారులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద భిక్షాటన చేయడం, మరికొంత మంది చిన్నారులు ఇంటినుంచి పారిపోయి రావడం, చిన్నా చితకా ఫ్యాక్టరీలు, కిరాణ దుకాణాలు, దాబాలు, హోటళ్లలో వెట్టిచాకిరీ చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ రక్షించి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయిలో సీఐడీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ఈ కార్యక్ర మాన్ని జిల్లా స్థాయిలో పోలీస్ శాఖకు అప్పగించారు. దీంట్లో మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ లో ఆపరేషన్ స్మైల్-2
హైదరాబాద్ లో పలు చోట్లు అధికారులు ఆపరేషన్ స్మైల్ -2 తనిఖీలు చేపట్టారు. వివిధ చోట్ల పనిచేస్తున్న 90 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రెస్క్యూచేసిన బాలలు పాట్నాకు చెందిన వారు కావడంతో.. వారిని సికింద్రాబాద్ నుంచి సొంత రాష్ట్రాలకు పంపించినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. హైదరాబాద్, బాల కార్మికులు, ఆపరేషన్ స్మైల్ -
బాలల బంధువు
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్’ ఇప్పటికి 752 మంది పిల్లలకు విముక్తి పనిలో పెట్టుకున్న యజమానులకు జరిమానా {పత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా దాడులు ఇంకా పనుల్లో మగ్గుతున్న బాలలెందరో.. ఆపరేషన్ స్మైల్ కింద 2015 జనవరి 1 నుంచి 31 వ రకు 283 మంది బాలలను, జూలై 1 నుంచి 31 వరకు 160 మందిని చేరదీశారు. అదేవిధంగా 2016 జనవరి 1 నుంచి 31 వరకు 309 మంది పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించారు.పిల్లలను పనిలోపెట్టుకున్న యజమానులకు 2015 జనవరి 1 నుంచి 31 వరకు రూ.5.58 లక్షలు, జూలై 1 నుంచి 31 వరకు రూ.4 లక్షలు జరిమానా విధించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆప్యాయంగా పలకరిస్తున్న ఈ చిత్రంలోని పిల్లలు బాలకార్మికులు. నగర శివారులోని ఏనుమాముల, పైడిపల్లి ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో కొందరు బాలకార్మికులు పనిచేస్తున్నారని పోలీస్ కమిషనర్‌కు జనవరి 29న సమాచారం అందింది. ఈ మేరకు ‘ఆపరేషన్ స్మైల్’లో భాగంగా ఆయన వెంటనే హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసు బృందాన్ని అలర్ట్ చేశారు. దీంతో వారు పైడిపల్లి, ఏనుమాములలోని ఇటుక బట్టీల వద్ద ఏకకాలంలో దాడులు నిర్వహించగా 48 మంది చిన్నారులు పని చేస్తూ కనిపించారు. ఆ బాలలను వరంగల్‌లోని చైల్డ్‌హోంకు తరలించారు. అన ంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో ఇటుక బట్టి యజమానికి నోటీసులు జారీ చేశారు. ఈ బాలలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారిని స్వస్థలాలకు పంపించారు. -
12 మంది బాలకార్మికులకు విముక్తి
వివిధ పనులు చేస్తున్న బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ స్మైల్ల్లో భాగంగా ఎస్ఐ ఖలీల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పలు దుకాణాలతో పాటు పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.హోటల్‌తో పాటు అక్కడక్కడ చెత్త సేకరిస్తున్న బాలికాలను కూడా గుర్తించారు. మొత్తం 12 మంది బాలకార్మికులను గుర్తించి వారిని తాండూరు ఎమ్మార్సీ కార్యాలయంలో ఏంఈఓ శివకుమార్‌కు అప్పగించారు. వీరిలో 8 మంది బాలురు, 4గురు బాలికలు ఉన్నారని చెప్పారు. పట్టుబడిన బాలల్లో సగం మంది మధ్యలో బడి మానేసిన వారేన ని గుర్తించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు ఏంఈఓ శివకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామి ఇచ్చారు. -
ఇక 'ఆపరేషన్ స్మైల్'
బెంగళూరులో ప్రయోగాత్మకంగా చేపట్టిన పోలీసులు భిక్షాటన నుంచి చిన్నారులను దూరం చేసే దిశగా ఒకే రోజు '164' మంది చిన్నారులకు విముక్తి మెట్రోనగరి బెంగళూరులో ట్రాఫిక్ జంజాటం, కాలుష్యం ఇవన్నీ ఎంత సర్వసాధారణమో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన కూడా అంతే సాధారణం. ముఖ్యంగా చిన్నారులను తీసుకుని భిక్షాటన సాగించే మహిళలు, చిన్నతనంలోనే భిక్షాటన దిశగా మళ్లిన చిన్నారుల సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కడో అనాధలుగా దొరికిన పిల్లలను బలవంతంగా భిక్షాటన రొంపిలోకి దింపే వారు, ఇంకా చేతిలో బిడ్డతో భిక్షాటననే ఓ వ్యాపారంగా మార్చేసుకున్న వారు ఇలా ఒక్కొక్కరి వెనక ఒక్కో కథ, ఈ కథలన్నింటి వెనక మౌనంగా తమ బాల్యాన్ని కోల్పోతోంది మాత్రం చిన్నారులే. ఇలాంటి చిన్నారుల జీవితాల్లో తిరిగి నవ్వుల వసంతాన్ని తీసుకు వచ్చేందుకు పోలీసు శాఖ ప్రయోగాత్మకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం పేరే 'ఆపరేషన్ స్మైల్' నగర పోలీస్ కమీషనర్ మేఘరిక్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ అదనపు పోలీస్ కమిషనర్ పి.హరిశేఖరన్ ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సాక్షి, బెంగళూరు : రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం సాయంత్రం నుంచి ఆపరేషన్ స్మైల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం మొత్తం నాలుగు టీమ్‌లను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో మొదటిదైన సర్వేలైన్స్ టీమ్‌లో నగరంలో చిన్నారుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లోని కార్యకర్తలు, ఇతర వలంటీర్లు ఉంటారు. ఇక రెండోదైన రెస్క్యూటీమ్లో మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులతో పాటు (మహిళా పోలీసులతో కలిపి) స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుంటారు. ఇక మూడోదైన ఇంటరాగేషన్, ఇన్ఫర్మేషన్ టీమ్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారి, సీపీఓ, సోషల్ వర్కర్, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అధికారితో పాటు మహిళా పోలీసు ఉంటారు. ఇక చివరిదైన రిహాబిలిటేషన్ టీమ్‌లో సీడబ్యూసీ అధికారితో పాటు వైద్యాధికారి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భిక్షాటన నుంచి బయటకు తీసుకు వచ్చిన పిల్లలు, మహిళలకు ఆశ్రయం ఇచ్చే సంస్థ ప్రతనిధులు భాగస్వాములై ఉంటారు. గురువారం సాయంత్రం నుంచే ఈ బృందాలన్నీ తమ పనిని ప్రారంభించాయి. గురువారం సాయంత్రం నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్-ఈస్ట్, నార్త్-ఈస్ట్, సెంట్రల్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో 'ఆపరేషన్ స్మైల్'ను పోలీసులు చేపట్టారు. మొత్తం 237 మహిళా భిక్షుకులను ఈ రొంపి నుంచి బయటకు లాగారు. ఇందులో '164' మంది చిన్నారులుండడం గమనార్హం. ఉపాధి మార్గాల కల్పన దిశగా..... ఇక 'ఆపరేషన్ స్మైల్' ద్వారా రక్షించిన చిన్నారులు, మహిళలకు నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పించేందు కు ముందుకొచ్చాయి. ఇక వీరితో చిన్నారు లు, మహిళల రక్షణ విషయాలపై పర్యవేక్షణకు గాను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్ ఈ పర్యవేక్షణ బా ధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఇప్పటి వర కు భిక్షాటనలో గడిపిన మహిళలకు ఇతర ఉపాధి మార్గాలను చూపడంతో పాటు చిన్నారులకు విద్యాభ్యాసాన్ని అందించే దిశగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి. -
50 మంది బాలకార్మికులకు విముక్తి
-
ఆపరేషన్ స్మైల్ లో 50 మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి వరకూ కొనసాగిన ఆపరేషన్ స్మైల్ లో పలువురు బాల కార్మికులకు విముక్తి లభించింది. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాతబస్తీలో పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరిట రైడ్ నిర్వహించారు. ఫలక్ నుమా, ముస్తఫానగర్‌లో బ్యాగ్‌ల తయారీ కేంద్రంపై సౌత్ జోన్ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే బిహార్, కోల్‌కతాకు చెందిన 50 మంది బాలకార్మికులను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ మీడియాకు తెలిపారు. -
అమ్మల చెంతకు 44 మంది చిన్నారులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీసులు పలువురు తప్పిపోయిన చిన్నారులకు ఉపశమనం కలిగించారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల్లో తప్పిపోయినవారిలో 44 మందిని గుర్తించారు. ఆపరేషన్ స్మైల్ పేరిట తప్పి పోయిన చిన్నారులను శ్రమకూర్చి గుర్తించారు. వీరిలో ఇప్పటికే 31 మంది చిన్నారులను తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఉత్తరాఖండ్‌లో పలువురు చిన్నారులు తప్పిపోగా ఈ అంశం ఆందోళన కరంగామారింది. దీంతో రాష్ట్ర పోలీసులు పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా ఆపరేషన్ స్మైల్ పేరిట గాలింపు చర్యలు చేపట్టారు. 44 మందిని గుర్తించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులు హరిద్వార్‌లో దొరికారు. -
వృద్ధులకూ ‘ఆపరేషన్ స్మైల్’
తెలంగాణ రాష్ట్రంలో వీధిబాలల అభ్యున్నతి కోసం, తెలంగాణ పోలీసు యంత్రాంగం ఆపరేషన్ స్మైల్ పథకం పెట్టి, రోడ్లపై, వీధుల వెంట తిరుగుతూ బాలల జీవితాలకు బతుకుపై భరోసా కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, కేన్సర్ బారినపడ్డ 12 ఏళ్ల బాలు డి కోరికను తెలుసుకొని స్వయంగా తానే నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రప్పించుకొని తన సీటుపై కూర్చుండ బెట్టిన వైనం అభినందించదగినది. సమాజం పట్ల పోలీసుల దృక్ప థంలో కూడా మార్పువస్తోంది. ఆపరేషన్ స్మైల్ పథ కాన్ని బాలలకే కాక, కన్న కొడుకులు, కూతుళ్లు తల్లిదం డ్రులను ఇంట్లోంచి వెళ్లగొట్టే వృద్ధులకు కూడా వర్తిం పజేసి వారిని వారసుల దగ్గరకి పంపించే ప్రయత్నాలు చెయ్యాలి. ఈ దిశగా తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ పోలీస్ యంత్రాం గాన్ని సిద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియో జకవర్గంలో మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి విడిపోతున్న భార్యాభర్తల గొడవలను ఈ పీఎస్‌ల ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తూ జంటలను ఏకం చేయాలి. ఆపరేషన్ స్మైల్‌ను బాలలకే కాక అన్ని వర్గాల వారి ముఖంలో చిరునవ్వులు నెలకొల్పేలా చేసేలా తెలంగాణ పోలీసు శాఖ పూనుకోవాలని అభ్యర్ధిస్తున్నాం. కోలిపాక శ్రీను పద్మశాలి వీధి, బెల్లంపల్లి -
‘ఆపరేషన్ స్మైల్’ సక్సెస్
326 మంది పిల్లలను రక్షించిన పోలీసులు ఘజియాబాద్: తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల ఒడికి చేర్చడానికి జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్’ విజయవంతమైంది. ఇందులో భాగంగా రెండో దశలో జనవరి 31 నాటికి మరో 326 మందిని రక్షించారు. వారిలో 302 మంది పిల్లలను తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మెల్’ మొదటి దశలో 227 మంది పిల్లలను రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ నోడల్ అధికారి డిప్యూటీ ఎస్పీ విజయ్‌సింగ్ మాట్లాడుతూ రెండో దశలో రక్షించిన 326 మందిలో 302 మంది పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. మరో 21 మందికి సంబంధించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామన్నారు. అయితే ముగ్గురి తల్లిదండ్రులను గుర్తించలేకపోయామని, వారి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 100 మందితో కూడిన పోలీసు బృందాలు పాల్గొన్నాయన్నారు. ఆగ్రా, ఢిల్లీ, జైపూర్, హరిద్వార్ నగరాల్లో తనిఖీలు చేపట్టి వీరిని రక్షించామన్నారు. వీరిలో ఎక్కువ మంది రెస్టారెంట్లలో పనిచేస్తూ, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద బిచ్చమెత్తుతూ, చెత్త ఏరుకుంటూ రోడ్ల పక్కన జీవిస్తున్నారని చెప్పారు. పిల్లలు ఇళ్ల నుంచి ఎందుకు పారిపోయారనే అంశంపై క్షుణ్ణంగా పరిశోధిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసులు చేపట్టిన రెండు దశలు కూడా విజయవంతం కావడంతో ఈ విధానాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అవలంబించాలని హోం మంత్రిత్వ శాఖ కోరింది. -
చిన్నారుల ఆచూకీ కోసం ’అపరేషన్ స్మైల్’
-
‘ఆపరేషన్ స్మైల్’కు టాస్క్‌ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: చైతన్యపురిలో గతేడాది జూన్ 4న మూడేళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతుండగా సరూర్‌నగర్ పోలీసులు చేరదీసి నాంపల్లిలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌కు తరలించారు. అయితే ఆ పాప తల్లిదండ్రులెవరు? ఎక్కడుంటారు అనే వివరాలు ఇప్పటి వరకూ తెలియలేదు. ఆ వివరాలు తెలుసుకొనే ప్రయత్నాలూ జరగలేదు. నిజానికి ఈ పాప తల్లిదండ్రులు దేశంలోని ఏదో ఒక పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసే ఉంటారు. అయితే ఆ పాప సరూర్‌నగర్ పోలీసులకు దొరికిన విషయం అక్కడి పోలీసులకు తెలియకపోవడంతో మిస్సింగ్ కేసు, ఇక్కడి ఠాణాలో పాప లభ్యం కేసు నమోదై ఉంది. పాప మాత్రం అనాథగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించే హోమ్‌లో ఉంటోంది. ఇకపై తప్పిపోయిన ఏ చిన్నారి ఇలా అనాథ కాకూడదని... ఆ చిన్నారి ఇంట్లో తిరిగి చిరు నవ్వులు పూయించాలనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ల వారీగా ... చిన్నారుల మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించేందుకు 55 మందితో సైబరాబాద్‌లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు నోడల్ అధికారిగా మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నియమించారు. కమిషనరేట్ పరిధిలోని 11 డివిజన్లలో ఒక్కో టాస్క్‌ఫోర్స్ బృందం ఉంటుంది. ఈ బృందంలో ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన చిన్నారుల మిస్సింగ్ కేసులపై దృష్టి పెడతారు. బాధితులు, వారి స్నేహితులు, బంధువుల సహకారంతో మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదిస్తారు. మిస్సింగ్ అయిన చిన్నారుల వివరాలు, వారి ఫొటో, ఎఫ్ఐఆర్లను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి వెబ్సైట్లో ‘నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్’లో అప్లోడ్ చేస్తారు. అలాగే ఇక్కడ దొరికిన తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను సైతం అదే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఠాణాకు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. వెబ్సైట్లో డేటా బేస్‌ను ప్రతి ఒక్కరు చూసుకునే అవకాశం ఉంది. అనుసంధానంగా వెబ్సైట్... వెబ్సైట్లో పొందుపర్చిన చిన్నారుల ఫొటోలు, వివరాలను ప్రజలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు వెబ్సైట్లో అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు సైదాబాద్‌లో మిస్సింగ్ అయిన చిన్నారి ఫొటో అప్లోడ్ చేశారనుకోండి...ఇదే చిన్నారి గుజరాత్లో వారం తర్వాత అక్కడి పోలీసులకు దొరికితే వారు కూడా చిన్నారి ఫొటోను అదే వెబ్‌సైడ్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ ఫొటోను సైదాబాద్ పోలీసులు క్లిక్ చేస్తే చాలు గుజరాత్ పోలీసులకు చిన్నారి మిస్సింగ్ వివరాలన్నీ ఈ-మెయిల్ ద్వారా క్షణాల్లో వెళ్తాయి. ఇలా చేయడం ద్వారా దేశంలోని అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలు చిన్నారుల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుం ది. దీని ద్వారా వెబ్సైట్ ఇటు మిస్పింగ్ కేసు, అటు ట్రేసింగ్ కేసు ముడి విప్పేందుకు అనుసంధానంగా పని చేస్తుంది. ఎవరెవరు భాగస్వాములు... రాష్ట్రంలో తప్పిపోతున్న చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే ఈ కార్యక్రమంలో పోలీసులకు సహాయంగా రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, ఎన్జీవో సంస్థలు చేర్చారు. వీధి బాలలు, తప్పిపోతున్న పిల్లల కారణంగా సమాజంలో ఎదురవుతున్న సమస్యలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఈ బాధ్యతలను సీఐడీకి అప్పగించారు. ఆపరేషన్ స్మైల్ పథకం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలు చేయడంతో దానిని మాడల్‌గా తీసుకుని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. మిస్టరీ వీడిన 76 శాతం కేసులు... గతనెల డిసెంబర్లో సైబరాబాద్‌లో 953 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 238 బాలురు, 488 మంది బాలికలు ఉన్నారు. పోలీసుల చొరవతో వీరిలో 60 మంది బాలురు, 167 మంది బాలికల ఆచూకీని కనిపెట్టారు. తప్పిపోయిన 726 మంది చిన్నారుల్లో 227 మంది ఆచూకీ లభ్యం కావడంతో 76 శాతం కేసులు కొలిక్కి వచ్చినట్లైంది. ఆకస్మిక దాడులు చేస్తాం... తప్పిపోయిన చిన్నారులను భిక్షగాళ్లుగా, బాల కార్మికులుగా చేస్తున్న వారిపై దృష్టి సారించాం. బస్సు, రైల్వేస్టేషన్లు, దాబాలు, హోటళ్లు, భవన నిర్మాణ రంగంతో పాటు చిన్నారులకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెడుతున్నాం. కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలలో దాడులు చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందించాం. ఇలాంటి చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నాం. మొదటి ఫేజ్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చిన్నారులు లభ్యమైన వెళ్లి తీసుకువస్తున్నాం. రెండోఫేజ్‌లో ఇతర రాష్ట్రాలకు కూడా టాస్క్‌ఫోర్స్ బృందాలు వెళ్తాయి. ఈనెల 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. - డీసీపీ రమారాజేశ్వరి రౌడీషీటర్ చెరనుంచి బాలుడికి విముక్తి గచ్చిబౌలి: తప్పిపోయిన బాలుడ్ని రౌడీషీటర్ నిర్బంధించి, అతనితో గుడుంబా అమ్మిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన ‘ఆపరేషన్ స్మైల్’ టీమ్ రౌడీషీటర్ కబంధ హస్తాల నుంచి బాలుడిని రక్షించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. రౌడీషీటర్‌ను కటకటాల్లోకి నెట్టారు. ఎస్ఐ రాజేష్ కథనం ప్రకారం... వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం తాళ్లపూసలపల్లి గ్రామానికి చెందిన వల్లపు అరవింద్(13) ఐదు నెలల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నాడు. రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్న అరవింద్‌కు రాయదుర్గానికి చెందిన రౌడీషీటర్ జాడుకట్టల అశోక్ (35) మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. పోలీసులకు బాలుడి విషయం చెప్పకుండా తన వద్ద అక్రమంగా నిర్బంధించి అతనితో స్థానికంగా గుడుంబా ప్యాకెట్లు అమ్మిస్తున్నాడు. చిన్నారుల మిస్సింగ్ కేసులు ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్’ టీమ్ బృందం దృష్టి గుడుంబా విక్రయిస్తున్న అరవింద్‌పై పడింది. అతడి వివరాలు రాబట్టి రౌడీషీటర్ నిర్బంధం నుంచి విముక్తి కలిగించి చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించారు. రౌడీషీటర్ జాడుకట్టల అశోక్‌ను అరెస్టు చేశారు.