
స్వైన్‌ఫ్లూ మందుల పంపిణీ
దవలతవిశాఖ లీగల్: నగరంలో స్వైన్‌ఫ్లూ సోకకుండా ముందుజాగ్రత్తగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి సోమవారం మందులు పంపిణీ చేశారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ప్రాంగణంలో సిబ్బంది, కక్షిదారులు, న్యాయవాదులకు హోమియో మందులు వేశారు. జగద్గురు పీఠం వైద్యులు డాక్టర్ హైమావతి, ఇతర వైద్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 75వేల మందికి ఈ మందుల పంపిణీ కార్యక్రమం జరుగతుందని జిల్లా జడ్జి చెప్పా రు. గతంలో గుంటూరు, హైదరాబాద్‌లలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.
వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్త చర్య నగర ప్రజలందరూ స్వైన్‌ఫ్లూ నివారణ మందులు తీసుకోవాలన్నారు. జి ల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాల యంలో ఈ మందులు అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.వి.నాగసుందర్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షురాలు పైడా విజయలక్ష్మి, న్యాయఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేటీఎన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.