మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్‌లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!.
చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం.
ఆ రోజు ఎందుకంటే..
ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్‌ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం.
ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది.
ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు.
ఈ ఏడాది థీమ్
"మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం.
ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే..
- ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ
- మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి
- మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం
- మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం
- జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి
(చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment