Diabetes day
-
ఆయన పుట్టినరోజు నాడు.. వరల్డ్ డయాబెటిస్ డే
మధుమేహం (డయాబెటిస్) బాధితులు దాదాపు ప్రతి కుటుంబంలో ఉంటున్నారు. ఇంతగా వ్యాప్తి చెందుతున్నా ప్రజలు దీని నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మన దేశంలో మధుమేహం చాప కింద నీరులా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధుమేహం వ్యాప్తి విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నాయి. గతంలో ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్ల వయసుగల వారిలో గుర్తించిన మధుమేహం, ఇప్పుడు 30 నుంచి 40 సంవత్సరాల్లోపే గుర్తించడం కనిపిస్తోంది. ఇది భారతీయులకు ఆందోళన కలిగించే విషయమే.మధుమేహ సమస్య గ్లోబల్ సమస్య. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్సులిన్ ఆవిష్కర్తలలో ఒకరైన సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ జన్మదినమైన నవంబర్ 14వ తేదీన ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’ (వరల్డ్ డయాబెటిస్ డే)గా ప్రకటించింది. అధిక శాతం ప్రజల్లో శారీరక శ్రమ తగ్గి పోయింది. చాలామందిలో మానసిక ఒత్తిడి తప్ప, శారీరక కదలికలు లేవు. వీటికి తోడు పర్యావరణ మార్పులు, వంశపారంపర్యత్వం, జీవన సరళిలో వచ్చిన అసంగత మార్పులు... మధుమేహం రావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. తల్లిదండ్రులలో ఇద్దరికీ మధుమేహం ఉన్నా, వారి పిల్లలలో కేవలం 7% మందిలో మాత్రమే జీవిత కాలంలో మధుమేహం బారిన పడ్డట్టు పరిశోధనలు చెప్పడం ఇందుకు నిదర్శనం.మన తాత ముత్తాతలు దంచిన లేదా తక్కువ పాలిష్ పట్టిన బియ్యం, చిరుధాన్యాలు తినేవారు. వాటిలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుతున్నాం. చిరుధాన్యాలు తినడం మానేశాం. దీనికి తోడు ప్యాక్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాలినడక తగ్గిపోయింది. వాహనాల వినియోగం పెరిగిపోయింది. చాలామందిలో కుటుంబ, వృత్తి, సామాజిక పర సమస్యలు పెరిగి పోయి మానసిక ఒత్తిడి, ఆందోళనలు అధిక మయ్యాయి. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణాలే. ఊబకాయం తెలుసుకునేందుకు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పెరిగే కొద్దీ శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుందని అర్థం. బీఎంఐ ఎక్కువగా కలవారే ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?చేసే పనికి తగ్గ పోషకాహారం, వ్యాయామం తప్పనిసరి. ఊబకాయస్థుల శరీరం బరువు 7 శాతం తగ్గితే మధుమేహం వచ్చే అవకాశాలు 60 శాతం తగ్గిపోతాయని వైద్య పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమి షాలైనా నడక, అవకాశం ఉన్నవారు ఈదటం, పరుగెత్తడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా మధ్య మధ్య లేచి నాలుగు అడుగులు వేయడం మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!దీనివల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల నుండి లభించే శాకాహారం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రజారోగ్యం పైన, ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపే మధుమేహం నిరోధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాధ్యతగా వ్యహరించాలి.– డాక్టర్ టి. సేవకుమార్ ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ వ్యవస్థాపకులు(నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డే) -
మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!
మధుమేహం అని భయపడొద్దు. చక్కటి చిట్కాలతో మదుమేహన్ని అదుపులో పెట్టుకోవడమే గాదు రాకుండా చూసుకోవచ్చు. అదికూడా మీకు అందుబాటులో దొరికేవి, మనం నిత్యం చూసే వాటితోనే సులభంగా డయాబెటిస్‌కి చెక్పెట్టోచ్చు. ముఖ్యంగా మనం వంటలో నిత్యం ఉపయోగించే సుగంధద్రవ్యాలు, ఫైబర్‌తో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే.. మదుమేహాన్ని నియంత్రించే సుగంధ ద్రవ్యాలు.. పసుపు భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించేది పసుపు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడమే కాకుండా ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇది డయాబెటిక్‌కి సంబంధించిన అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క దీన్ని మనం కొన్ని రకాల రెసిపీల్లో ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఇది టైప్2 డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్‌ను, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. వెల్లులి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రక్తపోటు, కొలస్ట్రాయల్ స్థాయిలను తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు చక్కటి ఔషధం. లవంగాలు ఇవి క్రిమి నాశక, క్రిమి సంహారక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అంటు వ్యాధులను నివారించడం తోపాటు గాయాలను త్వరితగతిన నయం చేస్తాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఫైబర్‌తో కూడిన ఆహారపదార్థాలంటే.. బీన్స్, బఠానీలు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు బీన్స్, బఠానీళ్లలో సుమారు 15 గ్రాముల ప్రోటీన్, 15గ్రాముల ఫైబర్ ఉంటుంది. నట్స్, గుమ్మడి లేదా పుచ్చకాయ విత్తనాలు వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సలాడ్లు, వోట్మీల్, పెరుగు వంటి వాటిలో కూడా చేర్చుకుని తినొచ్చు. వీటిలో సుమారు 5 నుంచి 10 గ్రాములు ప్రోటీన్, మూడు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. సోయా లేదా గోధుమ ఆధారిత ఉత్పత్తులు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. వీటిలో 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్, రెండు నుంచి 5 గ్రాముల ఫైబర్‌ను అందిస్తాయి. క్వినోవా, వోట్స్, బార్లీ మరియు ఇతర తృణధాన్యాలు ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వీటిలో ప్రోటీన్, ఫైబర్ల తోపాటు వివిధ ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు వండిన క్వినోవా, ఓట్స్, బార్లీ లేదా ఇతర తృణధాన్యాల్లో సుమారు 6 నుంచి 10 గ్రాముల ప్రోటీన్, 4 నుంచి 8 గ్రాముల ఫైబర్లు ఉంటాయి. ఇలాంటి ప్రోటీన్లు, ఫైబర్లతో కూడిన పదార్థాలు, సుగంధ ద్రవ్యాలను డయాబెటిస్ రోగుల తమ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు అందడమే గాక జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ సమృద్ధిగా పెరిగి ఎటువంటి రుగ్మతలు దరిదాపుల్లోకి రావు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: మదుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ లెవెల్స్ పెరగకూడదంటే..
మధుమేహం వల్ల ఎన్నో రకాల రుగ్మతల బారిన పడతాం. పైగా ఒక్కోసారి గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోవడం లేదా డౌన్ అయిపోయి ప్రాణాల మీదకు వచ్చే ఉదంతాలు కోకొల్లలు. అందువల్ల సాధ్యమైనంత వరకు పేషెంట్లు తగు జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రించుకునేలా జాగ్రత్తలు పాటించాల్సిందే. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అందువల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మదుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలంటే..! గ్లూకోజ్ అనేది శరీరానికి మంచి తక్షణ శక్తి వనరు. ఇది ఉంటేనే మన శరీరం రోజు వారి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలదు. ఇది సమస్థాయిలో ఉండాలంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు సక్రమైన రీతీలో ఉండాలి. ఈ ఒక్క దీర్ఘకాలిక మదుమేహ వ్యాధి.. గుండె, మూత్రపిండాలు, చర్మ సంబంధిత రుగ్మతలరే దారితీస్తుంది. అందువల్ల ముందుగానే మనం దీన్ని అదుపులో ఉంచుకోవాలి. వివిధ రుగ్మతలు బారినపడకుండా మంచి ఆహారపు శైలిని అలవరుచుకోవాలి. ముఖ్యంగా శారీరక శ్రమ, ఒత్తిడి తదితరాలు గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసే కీలక అంశాలు. అందువల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం అనేది అత్యం ప్రధానంజ ఆరోగ్యకరంగా గ్లూకోజ్ లెవల్స్ ఉండాలంటే.. క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల బరువు పెరగకుండా ఉండటమే కాకుండా మీలో ఉన్న శక్తి మంచిగా బర్న్ అవుతుంది. అలాగే రక్తపోటు, కొలస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరిచేలా వారంలో ఒక్కరోజు అయినా సైక్లింగ్ లేదా ఈత వంటి వాటికి కనీసం 150 నిమిషాలు కేటాయించాలి. కండరాలు బలాన్ని పెంచడానికి బరువులు ఎత్తడం, వ్యాయామ నిపుణల పర్యవేక్షణలో అందుకు తగ్గ శిక్షణ తీసుకోవడం చేయాలి ఈ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేయడానికి ముందు తదుపరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. ఎలాంటి కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యం పండ్లు, కూరగాయాలు, చిక్కుళ్లు, వంటి ఫైబర్ అధికంగే ఉండే ఆహారపదార్థాలు గ్లూకోజ్ లెవల్స్‌ని సమస్థాయిలో ఉంచుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఉండే ఆహారపదార్థాలు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. తొందరగా ఆకలి వేయదు. ఎక్కువ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలు తీసుకోండి. ఇవి గ్లైసమిక్ ప్రభావాన్ని తగ్గించి గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలకంగా ఉంటాయి. అలాగే కండర ద్రవ్యరాశిని పెంచడానికి ప్రోటీన్లు సహాయపడతాయి. వీటి తోపాటు, ఆలివ్ నూనె, అవకాడో, చేపలు, గింజలు, వంటివి ఆహరంలో చేర్చితే ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. నీటిని పుష్కలంగా తాగండి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పలుచన చేసి మూత్రం ద్వారా గ్లూకోజ్‌ని బయటకు పంపి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించి కేలరీలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కనీసం రోజూకి సుమారు ఎనిమిది గ్లాసుల వరకు నీటిని తీసుకోండి. చక్కెర, కెఫిన్, ఆల్కహాల్ కృత్రిమ స్వీటెనర్లు కలిగిన పానీయాలకు(కూల్‌డ్రింక్‌లు) దూరంగా ఉండండి ఒత్తిడిని తగ్గించుకోండి. ఎందుకంటే? ఇది అడ్రినల్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. నిజానికి ఈ ఒత్తిడి అనేది కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన మూలం అని గుర్తించుకోండి. దీన్ని జయించాలంటే యోగా, మెడిటేషన్ వంటి వాటిని తప్పనసరిగా చేయాలి. తగినంతగా నిద్రపోండి. ఇవన్నీ రోజూ వారిగా అందరికీ ఉండే సమస్యలే అని కొట్టిపారేసి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ ఆహారం లేదా జీవనశైలిలో మార్పులు చేయాలనుకుంటే మంచి డైటీషియన్ లేదా వైద్య నిపుణుడి సలహా తీసుకోండి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా మెరుగైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. (చదవండి: భారత్ డయాబెటిస్‌కి క్యాపిటల్‌గా మారుతోందా? 101 మిలియన్ల మందికిపైగా..!) -
డయాబెటిస్‌కి నిలయంగా భారత్?!
దీర్థకాలిక వ్యాధి అయిన డయాబెటిస్(మధుమేహం.. షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అది కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారినపడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నట్లుగానే వ్యాధుల పరంగానూ తగ్గేదేలే! అన్నట్లు తొందరగా ఈ వ్యాధి బారినపడిపోతున్నారు. ఎందువల్ల?.. ఇంతలా అన్ని వనరులు అందుబాటులో ఉండి, ముఖ్యంగా చదువుకున్నవాళ్లే ఈ అనారోగ్యం బారినపడటానకి కారణం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోలేమా? లేదా రాకుండా చూసుకోలేమా తదితరాల గురించే ఈ కథనం!. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) నిర్వహించిన అధ్యయనంలో భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది(10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దేశ జనాభాలో సుమారు 11.4%. అంతేగాదు గతేడాది 2019 నుంచి 2021 మధ్యలోనే సుమారు 31 మిలియన్ల(మూడు కోట్ల) మధుమేహ కేసులు నమోదయ్యాయి. కానీ, ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 మిలియన్లదాక(ఎనిమిది కోట్ల) కేసులు నమోదు అయినట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొంది. ఆ సంఖ్య కాస్తా 2045 నాటికి 135(పదమూడున్నర కోట్లకు) మిలియన్లకుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డయాబెటిస్ కేసుల పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారత్ డయాబెటిస్‌కి నిలయంగా మారుతుందా అనేంతగా కేసులు వేగవంతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లోనే ఎందుకు అధికం.. ప్రపంచ జనాభాలో భారతీయులు మధుమేహ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువ. పలు అధ్యయనాలు ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. వారి ప్రత్యేకమైన శరరీ కూర్పు కూడా ఇందుకు కారణమని పరిశోధనలు తెలిపాయి. పొత్తికడుపు పెద్దగా ఉండి కొవ్వు పేరుకుపోవడం, తక్కువ కండర ద్రవ్యరాశి తదితరాలు మధుమేహ సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నట్ల పేర్కొన్నాయి అధ్యయనాలు. దీనికి తోడు భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి వంటివి శారీరక శ్రమ స్థాయిల్లో మార్పులకు దారితీసింది. అంతేగాక మనవాళ్లు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సంతృప్త కొవ్వులు ఎక్కువుగా తీసుకుంటారు. ఇవి రక్తంలో గ్లూకోజ్, కొలస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. పట్టణీకరణ నేపథ్యంలో భారతీయుల చేసే ఉద్యోగాలన్నీ నిశ్చలంగా ఒకే చోట కూర్చొని చేసేవే అయ్యిపోయాయి. మరోవైపు పచ్చని ప్రదేశాలు కూడా కనుమరగయ్యాయి. వీటన్నిట్లకి తగ్గట్టుగానే ఇంకోవైపు నుంచి పర్యావరణ కాలుష్యం, వాయు, జల కాలుష్యాలు భారత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉందో తెలిసిందే. ఇవన్ని భారతీయ ప్రజల్లో రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమేగాక ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే అవయమైన ప్యాంక్రియాస్ పనితీరును దారుణంగా దెబ్బతీస్తోంది. అందువల్లే ఈ మదుమేహ వ్యాధి భారత్‌లోనే అధికంగా ఉంటోంది. ప్రజలు కూడా సరైన జీవనశైలిని పాటించకపోవడంతో చాలా ఈజీగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ సందర్భంగా పై ప్రత్యేక కథనం (చదవండి: డయాబెటిస్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? నియంత్రించాలంటే..?) -
ఆ రోజే ఎందుకు డయాబెటిస్ డే జరుపుకుంటున్నాం?
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి కుటుంబంలో ఓ డయాబెటిస్ పేషెంట్ తప్పకుండా ఉంటున్నారు. రోజుకి రోజుకి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి సైలంట్ కిల్లర్‌లా మొత్తం అవయవాలన్నింటిపై ప్రభావం చూపించి మనిషి ఆయఃప్రమాణాని తగ్గించేస్తోంది. ఈ మధుమేహం కారణంగా చాలామంది గుండె, మూత్రపిండాల, కంటి ఇన్ఫెక్షన్లా బారిన పడినవాళ్లు కోకొల్లలు. ఇది ఓ మహమ్మారిలా మనుషులను చుట్టుముట్టి జీవితాన్ని హారతి కర్పూరంలా తెలియకుండానే హరించేస్తుంది. నిజం చెప్పాలంటే ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలిక వ్యాధిలా ఉండిపోతుంది. కేవలం శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రక్షించుకోవడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. అలాంటి మధుమేహ వ్యాధి కోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుతున్నారు. అసలు ఈ మధుమేహాన్ని ఎలా నియంత్రించుకోవాలి తదితరాల గురించే ఈ కథనం!. చాలామంది దీనికి తీసుకోవల్సిన తగు జాగ్రత్తలు, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ వ్యాధి కారణంగా తలెత్తే రుగ్మతలు బారినపడి ప్రాణాలు కోల్పోతున్నా వాళ్ల సంఖ్య ఎక్కువ. దీంతో ప్రజలందరికి ఈ వ్యాధిపై అవగాహన వచ్చేలా ఒక రోజుని ఏర్పాటు చేసుకుని..ప్రతి ఏటా అందుకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తే కనీసం ఈ వ్యాధి కారణంగా చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించగలగడమే కాక మధుమేహ రోగుల సంఖ్యను కూడా నియంత్రించగలిగుతామని నిపుణులు భావించారు. అదీగాక ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడితే అదుపులో పెట్టుకుని దీర్ఘకాలం జీవించేలా చేయగలుగుతాం. ఆ రోజు ఎందుకంటే.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 1991లో ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 2006 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. ఇక 1922లో సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ తన సహచర శాస్త్రవేత్తతో కలిసి ఇన్సులిన్ని కనిపెట్టిన సంగతి విధితమే. అయితే సర్ ఫ్రెడరిక్ ఈ వ్యాధిని నియంత్రిచడానికి రోగులను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. పైగా ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని రోగుల్లో ధైర్యాన్ని నింపేవాడు. ఆయన విశేష కృషికి గానూ ఏటా సర్ ఫ్రెడరిక్ పుట్టిన రోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిస్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఒక్కో థీమ్‌తో ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన ఏర్పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక రకమైన జన్యుపరమైన రుగ్మత, ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ మీ జీవనశైలి, చెడు అలవాట్ల కారణంగా వస్తుంది. ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్(ఐడీఎఫ్) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 537 మిలియన్ల(సుమారు 53 కోట్ల మందికి) మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2045 నాటిక సుమారు 700 మిలియన్ల(70 కోట్లకు)కు పైగా పెరుగుతుందని అంచనా. దాదాపు 90%నికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు టైప్2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు. దీన్ని క్రమతప్పక వ్యాయామం, ధూమపానానికి దూరంగా ఉండటం తోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో అదుపులో పెట్టుకోవచ్చు లేదా నివారించొచ్చు. ఈ ఏడాది థీమ్ "మధుమేహ సంరక్షణకు ప్రాముఖ్యత". ఈ ప్రచార క్యాంపెయిన్‌తో మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం. అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన, వారికి కావల్సిన మద్దతును అందిచడం, సమస్య తీవ్రతను నివారించేలా దృష్టి సారించడం వంటి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేగాదు 2030 నాటికి మధుమేహాన్ని నియంత్రించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా అన్ని రకాల వనరులను వినియోగించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిస్తోంది ఈ ప్రచార కార్యక్రమం. ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనాలంటే.. ముందుగా మీకు టైప్ 2 మధుమేహం వచ్చిందో లేదో చెకప్ చేయించుకోవాలిజ మధుమేహం గురించి తెలుసుకోవడం, నివారణకు ఏం చేయాలి తదితరాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి మధుమేహగ్రస్తులకు మద్దుతు ఇవ్వడం మీ సమీప ప్రాంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంల లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జెనీవాలోని ఐక్యరాజ్యసమితికి మీ జాతీయ ఆరోగ్య మంత్రి లేదా శాశ్వత మిషన్‌కు లేఖ పంపడం లేదా మధేమేహ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం వంటివి చేయాలి (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు)