చలికాలం.. చర్మం దురదపెడుతోందా?!
బ్యూటిప్స్
గాల్లో తేమ త గ్గిపోయి ఆ ప్రభావం శరీరనిర్మాణంపై చూపుతుంది. చర్మంపై సహజనూనెలస్రావం తగ్గడం, ఉన్న నూనెలు ఆవిరైపోవడం, సబ్బులు, పెర్‌ఫ్యూమ్‌ల వాడకం.. ఇలా రకరకాల కారణాల వల్ల చలికాలం చర్మం దురదపెడుతుంటుంది. ఈ సమస్య నివారణకు...రెండు కప్పుల ఓట్స్‌ను వేడినీటిలో నానబెట్టాలి. ఈ మిశ్రమం వెచ్చగా ఉన్నప్పుడు శరీరానికి పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
లవంగ, తులసి, ఆవ, ఆలివ్, నువ్వులు, కొబ్బరి.. మొదలైన నూనెలలో ఏదైనా ఒకటి తీసుకొని దేహానికంతా పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీటితో స్నానం చేయాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. రోజూ ఇలా చేస్తే సమస్య ఉండదు.రాత్రి పడుకునే ముందు మడమలు, చేతులు, మోచేతులకు నూనె లేదా మాయిశ్చరైజర్ రాసి ఆ భాగం కవర్ అయ్యేలా సాక్స్ లేదా దుస్తులు ధరిస్తే చర్మం దురద సమస్య రాదు. నిమ్మరసం రాస్తే ఇంకా పొడిబారుతుందని అనుకుంటారు.
కానీ, చర్మం దురద తగ్గడానికి బకెట్ నీటిలో టీ స్పూన్ నిమ్మరసం కలిపి స్నానం చేయాలి. రాత్రి పడుకునేముందు కొబ్బరి పాలు రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గదు కానీ నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మకాంతి పెరుగుతుంది. చర్మం పొడిబారి, దురద పెట్టిన చోట దూది ఉండను యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి రాస్తే ఉపశమనం లభిస్తుంది.