పతీ ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. అధిక రక్తపోటు లేదా హై బీపీను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది వచ్చిన సంగతి కూడా వ్యక్తులు కనిపెట్టలేకపోవచ్చు. ఈ నేపథ్యంలో హైబీపీ లక్షణాలు, నివారణ మార్గాలను ఒకసారి పరిశీలిద్దాం.
వరల్డ్ హైపర్‌టెన్షన్ డేను 85 జాతీయ రక్తపోటు సంఘాలు లీగ్‌లతో కూడిన వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ దీన్ని ప్రారంభించింది. హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
హైపర్ టెన్షన్ లక్షణాలు
సాధారణంగా హైబీపీ కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అయితే రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారు స్ట్రోక్, గుండె జబ్బులు , మూత్రపిండాల రుగ్మతలు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటారు. అధిక ఒత్తిడి రక్తపోటుకు దారితీయవచ్చు.
తీవ్రమైన తలనొప్పి, ఛాతి నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం
తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
వికారం, వాంతులు
అస్పష్టమైన దృష్టి లేదా ఇతర దృష్టి మార్పులు
ఆందోళన, గందరగోళం
చెవుల్లో శబ్దాలు, ముక్కు రక్తస్రావం
హైపర్ టెన్షన్ చికిత్స
ఆహారంలో ఉప్పును బాగా తగ్గించడం
శారీరకంగా చురుగా ఉండటం
ధూమపానం, మద్యపానాన్ని మానేయడం
బరువు ఎక్కువగా ఉంటే తగ్గడంజాగ్రత్తలు
కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడం
గంటల తరబడి కూర్చోకుండా ఉండటం
నడక, పరుగు, ఈత, డ్యాన్స్ లేదా బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు
వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ, లేదా వారానికి 75 నిమిషాల నడక ఉండాలి. ప్రతి వారం 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు వ్యాయామాలు చేయండి. తద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఆరోగ్య నిపుణులు సూచించిన మందులను తీసుకోవాలి.
నోట్ : ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తపోటును ముందుగానే గుర్తిస్తే నియంత్రణ సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment