ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్. చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా, మహిళలు, పురుషులు అనేక రకాల కేనర్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అమెరికా, భారత్ సహా అధిక జనాభా ఉన్న దేశాల్లో ఈ కేన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. వీటిల్లో ప్రధానమైంది నోటి కేన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఆరో అత్యంత సాధారణ క్యాన్సర్. పొగాకు, సుపారీ లేదా పాన్ మసాలా నమలడం లాంటి చెడు అలవాట్ల కారణంగా మహిళల కంటే పురుషులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రతి ఆరుగురిలో ఒకరు కేన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే ప్రారంభ దశలో గుర్తించినప్పుడే దీనికి చికిత్స సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి క్యాన్సర్ రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది. నోటి కేన్సర్ కూడా ప్రమాదకారి అనే చెప్పవచ్చు. పొగాకు నమలడం, మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లు ఉన్నవారిలో ఇది సర్వసాధారణం అని అందరికీ తెలుసు. కానీ ఇవేవీ లేని వ్యక్తికి నోటి కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోటి లోపల, పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గల లోపలిభాగం, అంగిలి, ఇలా నోటిలోని ఏ భాగంలోనైనా ఇది సోకవచ్చు.
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
నోటి కేన్సర్ లక్షణాలు
సాధారణంగా దీన్ని ప్రారంభ దశలో గుర్తించడం అసాధ్యం. దంతాలు, చిగుళ్ళ వాపు, నోటి లోపల తెల్లటి మచ్చలు, దంతాలు వదులుగా మారడం మొదలవుతుంది. నోటి లోపల గడ్డలు లేదా గడ్డలు కనిపిస్తాయి. ఇది కాస్త ముదిరితే చెవుల్లో నొప్పి కూడా మొదలవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే వ్యాధి ముదిరి ఆహారం తీసుకోవడం చాలా కష్టమవుతుంది.
ప్రధానంగా దంతాలు , చిగుళ్ల చుట్టూ నిర్వచించబడని ఇన్ఫెక్షన్ లేదా విపరీతమైన నొప్పి, స్వరపేటిక, వాయిస్‌లో మార్పులు అంటే బొంగురు పోవడం, లేదా ముక్కు, నాసోఫారింజియల్, నొప్పి తొలి సూచిక కావచ్చు.
నోటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన (హాలిటోసిస్) ఉన్నా, మింగడంలో ఇబ్బంది (డిస్ఫాగియా) ,నోట్లోగడ్డలు కూడా తొలి సంకేతం. సిగరెట్, బీడీ, సిగార్, పొగాకు. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారికి కూడా నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
వాయిస్‌లో మార్పు వచ్చినా, నోరు, నాలిక మీద తెల్లటి మచ్చలు పుండ్లు త్వరగా మానక పోయినా, నోటిని తరచూ శుభ్రం చేసుకుంటున్నా దుర్వాసన వస్తున్నా, మింగడం కష్టం మారినా, ఉన్నట్టుండి దంతాలు వదులుగా మారి, నొప్పి పుడుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
నోట్: ఈ లక్షణాలు ఉన్న వారందరికి కేన్సర్ సోకినట్టు కాదు అనేది గుర్తించాలి. కానీ, కొన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. దీన్ని తొలి దశలో గుర్తించడమే చికిత్సలో కీలకం, అందుకే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment