న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వైరస్ కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి ముఖ్యంగా మూడు ‘టీ’లు ప్రతిపాదించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్ అంటే పరీక్షలు చేయడం.. పాజిటివ్ తేలితే వారు ఎవరెవరినీ కలిశారో ట్రేస్ చేయడం.. అనంతరం చికిత్స అందించడం అని అర్థం. కరోనా పరీక్షలు పెంచండి.. జాగ్రత్తలు పాటించండి అని ఆదేశాలు జారీ చేసింది.
- ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి.
- కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్‌లుగా ప్రకటించాలి. ఆ జోన్‌లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి.
- రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచాలి. నిర్లక్క్ష్యం చేసే వారిపై జరిమానా విధించాలి.
- వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు.
- అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించలేదు. ప్రజలతో పాటు సరుకు రవాణాకు రాష్రా‍్టల మధ్య అనుమతులు అవసరం లేదు.
- విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి.
- వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి. వీలైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది.
- ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి.
చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
Comments
Please login to add a commentAdd a comment