UTS
-
Train General Tickets: లైన్లో ఎందుకు.. ఆన్లైన్ ఉండగా!
సాక్షి, హైదరాబాద్: టికెట్ కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పని లేదు. లైన్లో నించోవలసిన అవసరం లేదు. ప్రయాణానికి కనీసం 15 నిమిషాల ముందు టిక్కెట్ కొనుక్కోవచ్చు. ఆ మాటకొస్తే రైలెక్కే ముందే టిక్కెట్ తీసుకోవచ్చు. పైగా టిక్కెట్ కోసం ఎక్కడికీ పరుగెత్తవలసిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్‌లలో యూటీఎస్ మొబైల్ యాప్ అప్రతిహతంగా దూసుకుళ్తుంది. అన్ని ప్రధాన రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ లలో సాధారణ టిక్కెట్ ల కోసం ప్రయాణికులు యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌ను ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ అనంతరం యూటీఎస్‌కు అనూహ్యమైన ఆదరణ పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 7.5 లక్షల మంది ప్రయాణికులు యూటీఎస్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోగా దసరా సందర్భంగా ఈ ఐదు రోజుల్లోనే సుమారు 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్‌లో టిక్కెట్లు తీసుకొని సొంత ఊళ్లకు బయలుదేరారు. నో ‘క్యూ’... జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.వీరిలో కనీసం 1.5 లక్షల మంది సాధారణ ప్రయాణికులే.ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలు,ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేవారే. రైల్వేస్టేషన్లలో జనరల్ టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కేంద్రాల వద్ద రద్దీ తీవ్రంగా ఉంటుంది.దసరా వంటి పర్వదినాల్లో టిక్కెట్ల కోసం తొక్కిసలాటలు, పోలీసుల లాఠీ చార్జీ వంటి ఉద్రిక్తతలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రద్దీ నియంత్రణకు దక్షిణమధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. కోవిడ్‌కు ముందుకు కొంత మేర ఆదరణ కనిపించినా కోవిడ్ కాలంలో జనరల్ టిక్కెట్లకు కూడా గుర్తింపు తప్పనిసరి చేయడంతో యూటీఎస్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇటీవల యూటీఎస్‌కు విస్తృత ప్రచారం కల్పించడంతో లక్షలాది మంది ఈ యాప్‌ను వినియోగించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో 6 వేల చొప్పున యూటీఎస్ బుకింగ్‌లవుతుండగా, పండుగలు, సెలవు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకుంటున్నారు. ఈజీగా బుకింగ్... ►మొబైల్ ఫోన్లో యూటీఎస్ యాప్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా జనరల్ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ఇంటి నుంచి రైల్వేస్టేషన్‌కు బయలుదేరే క్రమంలోనే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ►రైల్వేస్టేషన్లో రైలు బయలుదేరడానికి ముందుకు కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. ►యూటీఎస్ టిక్కెట్ల పైన దక్షిణమధ్య రైల్వే రాయితీ సదుపాయం కూడా అందజేస్తోంది. -
బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల వద్దనున్న టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల(టిమ్స్) స్థానంలో ఈ–పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ప్రయాణికులు నగదు చెల్లించనవసరం లేకుండా డెబిట్/క్రెడిట్ కార్డులు, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందొచ్చు. ఫలితంగా బస్సుల్లో చిల్లర సమస్య ఉండదు. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంత సర్వీసుల్లో ఈ–పోస్ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్ కం కండక్టర్లు మూడు వారాలుగా ఈ శిక్షణ పొందుతున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్ యంత్రాలు ప్రవేశపెడతారు. దశలవారీగా అన్ని డిపోల్లోనూ, నిర్దేశిత బస్టాండ్లు, బస్టాపుల్లో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్ బుకింగ్ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్ యంత్రాలను సమకూర్చనున్నారు. ఇక్సిగో–అభిబస్‌తో ఒప్పందం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) సాంకేతికతతో కూడిన ఈ–పోస్ యంత్రాల సరఫరాకు ఇక్సిగో–అభిబస్ సంస్థతో ఆర్టీసీకి ఒప్పందం కుదిరింది. ఈ యంత్రాల ద్వారా సాధారణ టికెట్లతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, జర్నలిస్టులు తదితరులు కూడా రాయితీ టికెట్లు పొందొచ్చు. -
ఆన్లైన్లో రైల్వే స్మార్ట్ కార్డుల రీచార్జ్ సదుపాయం
సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌కార్డు ద్వారా రైల్వే ప్రయాణం చేసేవారు ఇక నుంచి ఆన్లైన్లోనే రీచార్జ్ చేసుకోవచ్చు. వెబ్‌పోర్టల్‌లో యూటీఎస్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. డిజిటలైజేషన్లో భాగంగా రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నించోవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లను (ఏటీవీఎం) అందుబాటులోకి తెచ్చా రు. తాజాగా స్మార్ట్‌కార్డు రీచార్జ్ సదుపాయం కల్పించారు. సాధారణంగా ప్రయాణికులు తమ స్మార్ట్ కా ర్డులను రైల్వే బుకింగ్ కౌంటర్లలో మాత్రమే రీచార్జ్ చేసుకోవలసి రావడం వల్ల ప్రతిసారి రైల్వే బుకింగ్ కౌంటర్లకు రావలసి వస్తోంది. తాజాగా ఆన్లైన్ రీచార్జ్ సదుపాయం కల్పించడం వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లయింది. ప్రస్తుత కోవిడ్ సమయంలో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది. సేవలు ఇలా.... ►ప్రయాణికులు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లో మొదట నమోదు చేసుకోవాలి. ►మెనూలో ‘స్మార్ట్ కార్డు రీచార్జీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ►డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ విధానాల ద్వారా చెల్లించవచ్చు. ►అనంతరం ప్రయాణికులు ఏటీవీఎమ్ రీడర్ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘రీచార్జి స్మార్ట్ కార్డు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఏటీవీఎమ్‌లో ఆన్లైన్ రీచార్జీ వివరాలు వస్తాయి. ఈ మేరకు స్మార్టు కార్డులో రీచార్జ్ అవుతుంది. ►ప్రయాణికులు అన్రిజర్వ్డ్ టికెట్లను, ప్లాట్ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం ఉండదు. ►మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామ రుజువు, ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. ►ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీచార్జి చేసుకోవాలి. -
కేంద్రం అలర్ట్: కరోనా కట్టడికి ‘ట్రిపుల్ టీ’లు
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వైరస్ కట్టడి చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి ముఖ్యంగా మూడు ‘టీ’లు ప్రతిపాదించింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్ అంటే పరీక్షలు చేయడం.. పాజిటివ్ తేలితే వారు ఎవరెవరినీ కలిశారో ట్రేస్ చేయడం.. అనంతరం చికిత్స అందించడం అని అర్థం. కరోనా పరీక్షలు పెంచండి.. జాగ్రత్తలు పాటించండి అని ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70 శాతం పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఆ జోన్లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచాలి. నిర్లక్క్ష్యం చేసే వారిపై జరిమానా విధించాలి. వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు. అంతరాష్ట్ర రాకపోకలపై నిషేధం విధించలేదు. ప్రజలతో పాటు సరుకు రవాణాకు రాష్రా్టల మధ్య అనుమతులు అవసరం లేదు. విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాలి. వీలైనంత ఎక్కువగా ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరం చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాల్లో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. చదవండి: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ -
రెండో విడత జీఎస్టీ పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా రెండవ దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడదుల చేసింది. మరో 6 వేల కోట్ల రూపాయలనుకేంద్రం రాష్ట్రాలకు విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 4.42 శాతం వడ్డీ రేటుతో అరువు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హరియానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్‌లకు ఈ మొత్తాన్ని పంపించినట్లు ఆర్థిక శాఖ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. (లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు) ప్రత్యేక విండో కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ కేటాయించిన 12,000 కోట్ల రూపాయల రుణాల్లో భాగంగా తాజా చెల్లింపులు చేయనుంది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు 6000 కోట్ల రూపాయలను రెండవ సారి విడుదల చేయనుంది. మరోవైపు రూ.1.05 లక్షల కోట్ల వద్ద అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిని తాకాయి.చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు.ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. Ministry of Finance, under its, “Special Window to States for meeting the GST Compensation Cess shortfall,” will be releasing an amount of ₹6000 cr as second tranche to 16 States and 3 Union Territories today. (1/4) Read more ➡️ https://t.co/IkTkXLiYO3@nsitharamanoffc — Ministry of Finance (@FinMinIndia) November 2, 2020 -
చిటికెలో రైలు టికెట్
జనరల్ బోగీలో వెళ్లే ప్రయాణికులకు నిత్యం రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద ఎదురౌతున్న పెద్ద సమస్య. ఈ సమస్యకు ఇక ఓ ప్రత్యేక యాప్‌తో చెక్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పటివరకూ రైల్వేలో ఆన్లైన్ టికెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్రమే పరిమితమయ్యింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని ఇకపై జనరల్ టికెట్‌కు విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం, సీజన్, టికెట్లను పొందే వెసులుబాటును రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ వినియోగం టికెట్ పొందే విధానంలో కొన్ని నిబంధనలు/షరతులను మాత్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంది. – మెరకముడిదాం (చీపురుపల్లి) క్షణాల్లో జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర రైళ్లలో క్షణాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్ లేని పక్షంలో బుకింగ్ ఐడీ నంబరు, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద పేపర్ టికెట్ పొందే అవకాశం ఉంది. యాప్ డౌన్లోడింగ్ ఇలా ► ఈయాప్‌ను ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ► గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► మొబైల్ నంబర్‌ను, ఓ పాస్వర్డును వ్యక్తిగత వివరాలలో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్ పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులు, కార్డుకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. యాప్ ద్వారా సౌకర్యాలు ► ఆర్–వాలెట్, పేటీఎం, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ► రైల్వేకు సంబంధించిన ఆర్–వాలెట్ ద్వారా టికెట్ బుక్ చేసుకొంటే 5 శాతం రాయితీ లభిస్తుంది. ► అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోనూ బుకింగ్ కార్యాలయంలో రూ.100 నుంచి రూ.10,000 వరకూ ఈవాలెట్ రీచార్జి చేసుకొనే సౌకర్యం ఉంది. ► తరచూ ప్రయాణించే వారు క్విక్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకొని టికెట్లను తొందరగా పొందవచ్చు. ప్రత్యేకతలు ► రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం ఇక లేకుండా ఇంటినుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరేలోపే స్మార్ట్‌ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్‌ను పొందవచ్చు. ► ఈ యాప్ ద్వారా దక్షణ మధ్య రైల్వే పరిధిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్ ప్లాట్‌ఫాం, జనరల్ టెకెట్లను తీసుకోవచ్చు. ► ఒకేసారి నాలుగు టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు. ► షో టికెట్ ఆప్షన్ ద్వారా టీటీఈకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. నిబంధనలు ► ప్రయాణం టికెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటలు ముందుగా బుక్ చేసుకోవాలి.. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్ పనిచేయదు. ► రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ► స్టేషన్లో కాలుమోపాక, రైల్ ప్లాట్‌ఫాం, ట్రాక్‌ల వద్ద నుంచి టికెట్ల బుకింగ్ సాధ్యం కాదు. ► ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల లోపున్న వారు అర్హులు. ► సీజన్ టెకెట్‌ను అయితే గడువు తేదీకి 10 రోజుల ముందే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ► పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చెప్పి పొందవచ్చు. ► రైలులో ప్రయాణించేటప్పుడు నెట్ సదుపాయం లేకున్నా, చేతిలో ప్రింటెడ్ టికెట్ లేకున్నా, చెకింగ్‌కు వచ్చే టీసీకి క్యూఆర్ కోడ్, కాల్ చెక్ ఆప్షన్‌లోకి వెళ్లి బుకింగ్ వివరాలను చూపవచ్చు. ► ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
అంగన్వాడీల దీక్ష
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. బుధవారం నాటి దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దీక్షలకు వైసీపీ దెందులూరు నియోజకవర్గ నాయకులు చలమోలు అశోక్‌గౌడ్, యూటీఎప్ నాయకుడు పీవీ నరసింహారావు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి సమైకాంధ్ర హీరో అనిపించుకోవాలని చూస్తున్నారే తప్ప అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడం లేదని నరసింహారావు వివర్శించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి.భారతి, సీఐటీయూ నాయకులు ఎ.శ్యామలారాణి , ఎస్.భగత్ తదితరులు నాయకత్వం వహించారు. మద్దతుగా ఐద్వా నాయకుల దీక్ష అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా ఐద్వా నాయకులు ఒక్కరోజు రిలేనిరాహార దీక్షను కలెక్టరేట్ వద్ద బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి జి.విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. విజయలక్ష్మితోపాటు జి.విమల, కె.నాగమణి, ఎస్కే సఫేరా బేగం, ఎ.రమణ, జి.మరియమ్మ, సీహెచ్ రాజ్యలక్ష్మి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.