
నిద్రలో మెడపట్టేయడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. అలాగే ప్రయాణాల్లో మెడను అసహజ భంగిమలో ఉంచి వాహనాల్లో నిద్రపోయేవారిలో కూడా ఇది కనిపిస్తుంది. మెడ పట్టేయడాన్ని ఇంగ్లిష్‌లో రై నెక్ అంటారు. మెడపట్టేసినప్పుడు ఆ పరిస్థితి త్వరగా నార్మల్ అయ్యేందుకు పాటించాల్సిన సూచనలివి.. నిద్రలో చాలా పలచటి తలగడను వాడుతూ దాన్ని మెడ భాగంలోనే కాకుండా.. భుజాల వరకు సపోర్ట్‌గా ఉంచాలి.
తలగడకు బదులుగా మెత్తటి టర్కీ టవల్‌నూ గుండ్రంగా చుట్టి (రోల్ చేసి) మెడ కింద సపోర్ట్‌గా ఉంచవచ్చు. ఊ మెడ మీద భారం పడేలా ఎక్కువ బరువున్న వాటిని అకస్మాత్తుగా ఎత్తకూడదు. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా పెరుగుతుంది. కొందరు సెలూన్స్‌లో మెడను రెండువైపులా విరిచేసినట్లుగా టక్కున తిరిగేలా చేస్తుంటారు. ఇలా ఎంతమాత్రమూ చేయకూడదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. కానీ నొప్పినివారణ మందును రెండు రోజుల పాటు వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించాలి.
(చదవండి: ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?)