ప్రతీకాత్మక చిత్రం
Cyber Crime Prevention Tips: ఇ–మెయిల్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్, ఫైల్ షేరింగ్, ఇ–కామర్స్.. ఇలా ప్రతిదానికి రకరకాల పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటాం. వాటిలో సురక్షితమైన పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడం, నిర్వహించడం కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఈ రోజుల్లో సేఫ్టీ పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్‌ను సరిగ్గా నిర్వహించకపోతే చిక్కులు తప్పవు.
డిజిటల్ చెల్లింపులు పెరిగిన ఈ రోజుల్లో పాస్‌వర్డ్ నిర్వహణ లోపిస్తే అధికమొత్తంలో నగదును నష్టపోవాల్సి రావచ్చు. వీరిలో గృహిణులు, వయోజనుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు నివేదికలు కూడా ఉన్నాయి. తమ పాస్‌వర్డ్‌ను ఇతరులకు చెప్పడం ఎంత నష్టమో, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అకౌంట్స్‌ను నిర్వహించడం కూడా అంతే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆన్‌లైన్ సేవలు పొందేవారు ఇష్టానుసారంగా కాకుండా తప్పనిసరి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి.
పటిష్టం చేసే విధానం...
పాస్‌వర్డ్‌లో కనీసం 8 అక్షరాలు ఉండాలి. లాగిన్ చేసిన ప్రతి సైట్‌కి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి బేస్, పిన్ విధానాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. ఉదాహరణకి.. primevideo.com ని లాగిన్ చేస్తున్నారనుకుంటే దానికి బేస్ 'rime@', పిన్ ’'home@321' సెట్ చేసుకోవచ్చు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి పాస్‌వర్డ్ జనరేటర్ సాధనాన్ని ఉపయోగించవచ్చు. వీటిలో చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లు డిఫాల్ట్‌గా అందిస్తాయి.
పాస్‌వర్డ్ మేనేజర్
అప్లికేషన్‌లు, ఆన్‌లైన్ సేవల కోసం, పాస్‌వర్డ్‌లను నిల్వ చేయడానికి, రూపొందించడానికి, నిర్వహించడానికి వినియోగదారులను అనుమతించే ప్రోగ్రామ్ పాస్‌వర్డ్ మేనేజర్. పాస్‌వర్డ్‌లను రూపొందించడంలో, తిరిగి పొందడంలో, వాటిని ఎన్‌క్రిప్టెడ్ డేటాబేస్‌లో నిల్వ చేయడం, డిమాండ్‌పై ఉపయోగించడంలో ఇది సహాయం చేస్తుంది. అత్యున్నత స్థాయి భద్రతను అందించే చాలా సేవలు ఆర్మీ గ్రేడ్ ఎఇఎస్256–ఎన్‌క్రిప్షన్‌ని కలిగి ఉంటాయి.
మూడు రకాల పాస్‌వర్డ్ మేనేజర్లు...
1. ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్.
2. ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఏదైనా కంప్యూటర్ లేదా పరికరం నుండి యాక్సెస్ చేయవచ్చు. మీ ఆధారాలను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది.
3. మీ ఆధారాలను నిల్వచేయడానికి హార్డ్‌వేర్ పరికరంలో ఇన్‌స్టాల్ అయి ఉంటుంది.
పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించడం వల్ల...
👉🏾మీ అన్ని ఆధారాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
👉🏾నకిలీ లాగిన్ సందర్భంలో మీకు సమాచారం తెలియజేస్తుంది.
👉🏾మీ ఆధారాలను సులభంగా మార్చుకోవచ్చు.
👉🏾ఇతర గ్యాడ్జెట్స్‌లోనూ ఒకే పాస్‌వర్డ్‌ను నిర్వహించవచ్చు.
కొన్ని ప్రముఖ పాస్‌వర్డ్ మేనేజర్లు
(a)lastpass.com
(b) keepass.info
(c) keepersecurity.com
(d) pwsafe.org
(e) dashlane.com
రెండు కారకాల ప్రమాణీకరణ
👉🏾రెండు దశలు లేదా ద్వంద్వ కారకాల ప్రమాణీకరణగా కూడా సూచిస్తుంది. ఇది భద్రతా ప్రక్రియ. దీనిలో వినియోగదారులు యాక్సెస్‌ని «ధ్రువీకరించడానికి రెండు వేర్వేరు ప్రమాణీకరణ కారకాలను అందిస్తారు.
👉🏾2ఎఫ్‌ఎ ఫిషింగ్ వ్యూహాలను ఉపయోగించి పరికరాలు లేదా ఆన్‌లైన్ ఖాతాల వివరాలను సేకరించి, దాడి చేసేవారికి కష్టంగా ఉండేలా ప్రామాణీకరణ ప్రక్రియకు అదనపు భద్రతను జోడిస్తుంది.
👉🏾ప్రతి 30 సెకన్లకు కొత్త సంఖ్యా కోడ్‌ను అందించే హార్ద్‌వేర్ సాధనాలను హార్డ్‌వేర్ టోకెన్ అంటారు.
👉🏾ఎసెమ్మెస్ టెక్ట్స్ మెసేజ్, వాయిస్ ఆధారిత సందేశం ద్వారా వినియోగదారునకు ఓటీపీ పంపుతుంది.
👉🏾సాఫ్ట్‌వేర్ టైమ్ ఆధారంగా జనరేట్ అయ్యే టివోటీపి పాస్‌కోడ్ కూడా పంపుతుంది. ∙పోర్టల్స్, అప్లికేషన్లు వినియోగదారునకు ఒక ఫుష్ నోటిఫికేషన్‌ను ప్రామాణీకరణగా పంపుతాయి. ఇక్కడ వినియోగదారుడు ఒకే టచ్‌తో యాక్సెస్‌ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
రెండు దశల ధ్రువీకరణ
👉🏾వినియోగదారుడి గ్యాడ్జెట్‌కు పంపిన పాస్‌వర్డ్, ఓటీపీ రెండింటినీ నమోదు చేయాలి. రెండు కారకాల ప్రామాణీకరణలో ఉపయోగించిన పద్ధతులలో ఫేసియల్ స్కాన్ టెక్నాలజీతో ఉంటాయి. అలాగే, వీటిని వేలిముద్ర స్కాన్‌తో యాక్సెస్ చేయవచ్చు.
పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచుకోవడానికి...
మీ లాగిన్ ఆధారాలను నోట్‌బుక్‌లో రాసుకొని, ట్రాక్ చేసుకోవచ్చు. ∙మీ పాస్‌వర్డ్‌లు దొంగిలించబడ్డాయో లేదో ఈ కింది వెబ్‌సైట్‌లలో తనిఖీ చేసుకోవచ్చు.
(a) passwords.google.com
(b) haveibeenpwned.com
(c) snusbase.com
(d) avast.com/hackcheck
👉🏾మీ పాస్‌వర్డ్‌లో సాధారణ పదాలు, అక్షరాల కలయికలు లేకుండా చూడాలి. అంటే– పాస్‌వర్డ్, వెల్‌కమ్, సిటీ నేమ్, పెట్ నేమ్, ఇంటిపేరు... మొదలైనవి.
👉🏾పాస్‌వర్డ్ పొడవు 8 అక్షరాల్లో ఉండాలి.
👉🏾ప్రత్యేక అక్షరాలు, సంఖ్యలు, పెద్ద అక్షరాలను ఉపయోగించాలి.
👉🏾ప్రతి మూడు నెలలకోసారి మీ పాస్‌వర్డ్‌ని మార్చుకుని, రీ సెట్ చేసే అలవాటును పెంచుకోవాలి.
👉🏾మీ పాస్‌వర్డ్‌లను రీ సైకిల్ చేయవద్దు. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించమని అడిగిన ప్రతిసారి కొత్త సిరీస్‌ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి.
👉🏾ఎసెమ్మెస్ ధృవీకరణతో రెండు కారకాల ప్రమాణీకరణ (2ఎఫ్‌ఎ) ఉపయోగించాలి.
👉🏾పెయిడ్ పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించడం మేలు.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment