అవగాహనతోనే ప్రమాదాల నివారణ | Rapport road accidents Prevention | Sakshi
Sakshi News home page

అవగాహనతోనే ప్రమాదాల నివారణ

Published Sat, Dec 28 2013 4:31 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Rapport road accidents Prevention

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:ట్రాఫిక్ నియమావళిపై వాహన చోదకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్ర మాదాలు తగ్గించవచ్చునని ఇన్‌చార్జి కలెక్టర్ యు.సి.జి. నాగేశ్వరరావు అన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వే గం, ఓవర్‌టేకింగ్ వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. డ్రైవర్లకు అవ గాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు ని ర్వహించనున్నట్లు తెలిపారు. అంతకముందు రవాణా, ట్రాఫిక్, ఆర్‌అండ్‌బీ అధికారులతో పాటూ మహారాజా ఇంజినీరింగ్ విభాగం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎంవీజీఆర్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి మార్కండేయరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement