Rapport
-
దేహంలో ఒక పార్శ్వం కదలకపోతే... పక్షవాతం
అవగాహన పక్షవాతం దాడి చేసినప్పుడు ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే రోగి కోలుకోవడం కూడా అంతే వేగంగా జరుగుతుంది. చిక్కంతా ‘పక్షవాతం లక్షణాలు ఇలా ఉంటాయి’ అని తెలియకపోవడంతోనే వస్తుంటుంది. బలహీనత, దేహంలో ఒక వైపు కదలికలు మందగించడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిరి ఉన్నట్లుండి కంటి చూపు మసకబారడం (ముఖ్యంగా ఒక కన్ను). మాట తడబాటు, మాట పట్టేయడం, మాట స్పష్టంగా అర్థం కాకపోవడం మింగలేకపోవడం (ఘన పదార్థాలే కాక ద్రవాలు మింగడం కూడా) తల తిరిగినట్లు ఉండడం, మెదడుకు, దేహ కదలికలకు మధ్య సమన్వయం లోపించడం (ఉదాహరణకు చెయ్యి పెకైత్తబోయినప్పుడు అనుకున్నట్లు కదిలించలేకపోవడం, వేళ్లకు పట్టు దొరకకపోవడం, నుదుటిని తాకాలని ప్రయత్నిస్తే చేయి ముక్కు దగ్గరే ఆగిపోవడం వంటివి), కదలికలు మద్యం సేవించిన వారిలా ఉండడం నిలబడినప్పుడు రెండు కాళ్ల మీద ఒకే విధంగా బరువును మోపలేకపోవడం రెండు చేతులను ఒకే రకంగా కదిలించలేకపోవడం, చేతులను పెకైత్తినప్పుడు ఒక చెయ్యి కిందకు పడిపోతుండడం భరించలేనంత తలనొప్పి, ఏకాగ్రత కుదరకపోవడం లాంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొన్ని కనిపించినా, వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:ట్రాఫిక్ నియమావళిపై వాహన చోదకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా రోడ్డు ప్ర మాదాలు తగ్గించవచ్చునని ఇన్చార్జి కలెక్టర్ యు.సి.జి. నాగేశ్వరరావు అన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వే గం, ఓవర్‌టేకింగ్ వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. డ్రైవర్లకు అవ గాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు ని ర్వహించనున్నట్లు తెలిపారు. అంతకముందు రవాణా, ట్రాఫిక్, ఆర్అండ్బీ అధికారులతో పాటూ మహారాజా ఇంజినీరింగ్ విభాగం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎంవీజీఆర్ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి మార్కండేయరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుడ్లు... గోధుమగడ్డికి కాస్తాయట..!
అతి సామాన్య విషయాల గురించి అవగాహన లేకపోవడానికి పరాకాష్ఠ ఇది. మనం రోజూ తినే, వాడే అంశాల గురించి యూత్‌లో ఏ మాత్రం అవగాహన ఉందో పరీక్షించదలచారు లీఫ్ (లింకింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫార్మింగ్) అనే ఒక స్వచ్ఛంద సంస్థవారు. ప్రపంచవ్యాప్తంగా యువతలో పర్యావరణ విషయాల గురించి అవగాహన పెంపొందించే పనిలో భాగంగా వీరు చేపట్టిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని 16 - 23 యేళ్ల మధ్య వయసున్న యువతీయువకులతో చేసిన ఈ సర్వే ప్రకారం వారిలో కొందరికి అత్యంత సాధారణ అంశాల గురించి కూడా అవగాహన లేదని తేలిందట. అత్యంత విచిత్రం ఏమిటంటే... ప్రతి పదిమందిలో ఒకరికి కోడిగుడ్డు ఎలా వస్తుందో కూడా తెలియదట. కొందరైతే ‘ఎగ్ గోధుమగడ్డికి కాస్తుంది కదా?’ అని ఎదురు ప్రశ్నించారట! ‘వెన్న’ గురించి అడిగితే... 24 శాతంమంది తమకు తెలియదని స్పష్టం చేశారట! కిచెన్‌లోకి చికెన్ ఎలా వస్తోందంటే... 15 శాతం మంది తమకు అవగాహన లేదన్నారట! రోజూ ఆహారంలో వాడే అంశాల గురించి నగర యువతకు ఉన్న అవగాహన ఇది!