కాజీపేట: అభం, శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నట్లు ఓ సర్వే ద్వారా జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం గుర్తించింది. బాధిత కుటుంబాలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఓ ఆన్‌లైన్ ఫిర్యాదు బాక్స్‌ను ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి వాస్తవికతను బహిర్గతం చేయడం కోసం ఉద్దేశించిన పోస్కో ఈ–బాక్స్ వివరాలు తెలుసుకుందాం..
పోస్కో ఈ–బాక్స్ అంటే ..
లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఈ–బాక్స్.
ఇది నేషనల్ కమిషన్ ఆన్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పని చేస్తుంది.
పోస్కో చట్టం కింద నేరస్తులకు సకాలంలో శిక్షలు పడేలా సంస్థ వ్యవహరిస్తుంది.
ఫిర్యాదులను గోప్యంగా విచారణ చేస్తారు.
యానిమేషన్ చిత్రం గల విండో పేజీకి నావిగేట్ ద్వారా ఒక క్లిక్‌తో ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదులను నమోదు చేసుకుని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి బాలలకు న్యాయం చేస్తుంది.
16 ఏళ్లలోపు వారంతా బాలలుగా పేర్కొంది.
ఫిర్యాదు చేద్దామిలా...
నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌రైట్స్ అధికారిక వెబ్‌సైట్ లాగిన్ అవ్వాలి. ఠీఠీఠీ.nఛిpఛిట.జౌఠి.జీn ఈ సైట్‌లో లాగిన్ అయిన తర్వాత ముఖ చిత్రం కింది భాగంలో పోస్కో ఈ–బాక్స్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఫిర్యాదు ఎలా చేయాలో ఓ వీడియో ప్రదర్శితమవుతుంది. ఆ విండో కింది భాగంలో ఉన్న ప్రెస్ హియర్‌ను క్లిక్ చేయగానే ఫిర్యాదు చిత్ర రూపాలు ఆరు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి ఆ కింది భాగంలో పేరు, ఫోన్ నంబర్, ఉంటే ఈమెయిల్ ఐడీ పేర్కొనాలి. ఈ ఫిర్యాదు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు వెళ్తుంది. విచారణ గోప్యంగా చేస్తారు. విచారణలో వేధింపులు నిజమని నిర్ధారణ అయితే నిందితులకు శిక్షపడేలా ఆదేశాలు జారీ చేస్తారు.
రహస్య విచారణ వ్యవస్థకు శ్రీకారం..
బాలలపై లైంగిక వేధింపులు జరిగితే కొంతమంది మాత్రమే కొన్నింటిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడో లేదా దగ్గరి బంధువు, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా బాలలు లైంగిక వేధింపుల బారిన పడినప్పుడు చాలా సందర్భాల్లో ఫిర్యాదులు చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఓ రహస్య విచారణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు పోస్కో ఈ–బాక్స్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించింది.
బాధితుల వివరాలు గోప్యం..
చిన్నారులపై లైంగిక వేధింపులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి ఎక్కువగా ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితలకు పోస్కో చట్టంలో రక్షణ, ప్రభుత్వ చేయూత, విద్య, వృత్తి విద్యాల్లో శిక్షణ, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– డాక్టర్ కె.అనితారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment