child abuse case
-
బాలిక మా ఇంట్లో చోరీ చేసింది
-
బిహార్ షెల్టర్ హోమ్స్ అన్నిటిపైనా సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలలపై లైంగిక, శారీరక వేధింపుల ఘటనలపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. రాష్ట్రంలోని శరణాల యాల్లోని బాలలపై శారీరక, లైంగిక వేధింపు లకు సంబంధించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ముజఫర్‌పూర్ శరణాలయంతోపాటు మిగతా 16 వసతి గృహాల్లోనూ బాలలపై వేధింపులు సాగుతున్నా యని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ పేర్కొంది. అందుకే తప్పనిసరిగా వాటి పైనా సీబీఐ విచారణ జరపాలి’ అని స్పష్టం చేసింది. అయితే, సీబీఐలో అంతర్గత వివాదా నికి సంబంధించిన కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుండటంతో పాటు కీలక విధాన నిర్ణయాలు తీసుకోరా దంటూ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావుపై ఆంక్షలు ఉండ టాన్ని సీబీఐ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. బెంచ్ స్పందిస్తూ.. ప్రస్తుత విచారణ నిలిపివే యాలనేది ఆ ఉత్తర్వులకు అర్థం కాదంటూ దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమేనా అని సీబీఐని ప్రశ్నించింది. విచారణకు తాము సిద్ధమేననీ, అవసరమైన అధికారుల బృందాన్ని ప్రభుత్వం సమకూ ర్చాల్సి ఉంటుందని సీబీఐ తెలిపింది. దీంతో ధర్మాసనం బిహార్‌కు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అనాథ శరణాలయాల్లో వేధింపులపై పోలీసు శాఖ యథాతథ దర్యాప్తు నివేదిక సమర్పించేందుకు వారం గడువు కావాలన్న ప్రభుత్వ వినతిని తోసిపుచ్చుతూ, వెంటనే విచారణ బాధ్యతలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. -
కుటుంబ సాయంతో మైనర్‌పై లైంగిక దాడి
కాన్పూర్: అత్యాచార ఘటనలపై ఉక్కుపాదం మోపేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్షను విధించేలా కేంద్రం పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టానికి సవరణలు చేసి వారమైనా కాకముందే ఉత్తరప్రదేశ్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ తన తల్లిదండ్రులు, సోదరి ఎదుటే బాలిక(13)పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ దెహాత్ జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివలీ ప్రాంతంలో నివాసముండే 16 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులు, సోదరి మద్ధతుతో ఆదివారం 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసించాడనీ.. లైంగిక దాడి గురించి బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని దెహాత్ జిల్లా డీఐజీ రతన్‌కాంత్ పాండే తెలిపారు. ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ముందుగా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ నుంచి లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివలీ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మైనర్, అతని తల్లిదండ్రులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని.. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేస్తామని డీఐజీ చెప్పారు. -
ఒక్క క్లిక్ చాలు..
కాజీపేట: అభం, శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నట్లు ఓ సర్వే ద్వారా జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం గుర్తించింది. బాధిత కుటుంబాలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఓ ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్‌ను ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి వాస్తవికతను బహిర్గతం చేయడం కోసం ఉద్దేశించిన పోస్కో ఈ–బాక్స్ వివరాలు తెలుసుకుందాం.. పోస్కో ఈ–బాక్స్ అంటే .. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిందే ఈ–బాక్స్. ఇది నేషనల్ కమిషన్ ఆన్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. పోస్కో చట్టం కింద నేరస్తులకు సకాలంలో శిక్షలు పడేలా సంస్థ వ్యవహరిస్తుంది. ఫిర్యాదులను గోప్యంగా విచారణ చేస్తారు. యానిమేషన్ చిత్రం గల విండో పేజీకి నావిగేట్ ద్వారా ఒక క్లిక్‌తో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను నమోదు చేసుకుని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి బాలలకు న్యాయం చేస్తుంది. 16 ఏళ్లలోపు వారంతా బాలలుగా పేర్కొంది. ఫిర్యాదు చేద్దామిలా... నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్‌రైట్స్ అధికారిక వెబ్సైట్ లాగిన్ అవ్వాలి. ఠీఠీఠీ.nఛిpఛిట.జౌఠి.జీn ఈ సైట్లో లాగిన్ అయిన తర్వాత ముఖ చిత్రం కింది భాగంలో పోస్కో ఈ–బాక్స్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయగానే ఫిర్యాదు ఎలా చేయాలో ఓ వీడియో ప్రదర్శితమవుతుంది. ఆ విండో కింది భాగంలో ఉన్న ప్రెస్ హియర్ను క్లిక్ చేయగానే ఫిర్యాదు చిత్ర రూపాలు ఆరు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి ఆ కింది భాగంలో పేరు, ఫోన్ నంబర్, ఉంటే ఈమెయిల్ ఐడీ పేర్కొనాలి. ఈ ఫిర్యాదు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు వెళ్తుంది. విచారణ గోప్యంగా చేస్తారు. విచారణలో వేధింపులు నిజమని నిర్ధారణ అయితే నిందితులకు శిక్షపడేలా ఆదేశాలు జారీ చేస్తారు. రహస్య విచారణ వ్యవస్థకు శ్రీకారం.. బాలలపై లైంగిక వేధింపులు జరిగితే కొంతమంది మాత్రమే కొన్నింటిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుడో లేదా దగ్గరి బంధువు, పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా బాలలు లైంగిక వేధింపుల బారిన పడినప్పుడు చాలా సందర్భాల్లో ఫిర్యాదులు చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఓ రహస్య విచారణ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు పోస్కో ఈ–బాక్స్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించింది. బాధితుల వివరాలు గోప్యం.. చిన్నారులపై లైంగిక వేధింపులపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాం. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల నుంచి ఎక్కువగా ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితలకు పోస్కో చట్టంలో రక్షణ, ప్రభుత్వ చేయూత, విద్య, వృత్తి విద్యాల్లో శిక్షణ, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. – డాక్టర్ కె.అనితారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ -
‘భార్యే అలా చేస్తే ఆ బాధ చెప్పలేం..’
బెంగళూరు: ఫ్రాన్స్‌కు చెందిన రాయబారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఐదేళ్ల పోరాటం తర్వాత తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవాలు అని బెంగళూరు కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన ఊపరిపీల్చుకున్నాడు. సుదీర్ఘపోరాట ఫలితంగా తనకు న్యాయం జరిగిందంటూ ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పాస్కల్ మజురియర్ అనే ఫ్రాన్స్ రాయబారిపై ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. 2012లో ఆయనపై ఈ మేరకు ఆరోపణలు నమోదయ్యాయి. బెంగళూరులోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో పాస్కల్ డిప్యూటీ చీఫ్‌గా పనిచేసేవాడు. అయితే నాలుగేళ్ల తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన భార్య స్వయంగా కేసు పెట్టింది. దీంతో ఆయనను పోలీసులు 2012లో జూన్ 19న అరెస్టు చేశారు. అనంతరం నాలుగు నెలలపాటు జైలులో ఉన్న పాస్కల్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం తన పిల్లలను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రి మనవళ్లను, మనవాలిని చూసేందుకు వెళుతున్నా అవకాశం ఇవ్వడం లేదని తీవ్రంగా పోరాటం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తన భార్య అనవసరం తనపై ఆరోపణలు చేసిందని, కావాలనే తనను నిందించిందంటూ వాపోయాడు. తాను ఏ తప్పు చేయలేదంటూ పలుమార్లు మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశాడు. ఈ కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలని మోదీకి విజ్ఞప్తి కూడా చేశారు. కోర్టు తీర్పు అనంతరం పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఇది నేను చేసిన సుదీర్ఘ పోరాటం. చివరికి న్యాయం జరిగినందున చాలా సంతోషంగా ఉంది. కట్టుకున్న భార్యే నిన్ను చులకన చేసి బయటేసిందని అర్థమైనప్పుడు అది ఎంత తీవ్రమైన గాయమో చెప్పలేం. కానీ, దేవుడు నాకు పోరాడేందుకు కావాల్సిన శక్తినిచ్చాడు. ఇలాంటి ఆరోపణల వచ్చినప్పుడు చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అసలు ప్రస్తుతం నా నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న నా భార్యే అసలైన నేరస్ధురాలు’ అని చెప్పారు.