మంత్రి కార్యాలయం ముట్టడి | minister office rounded by small merchants in vishakapatnam | Sakshi
Sakshi News home page

మంత్రి కార్యాలయం ముట్టడి

Published Fri, Feb 6 2015 1:23 PM | Last Updated on Fri, Oct 5 2018 8:51 PM

మంత్రి కార్యాలయం ముట్టడి - Sakshi

మంత్రి కార్యాలయం ముట్టడి

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ  ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. 

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా  అధికారులు బళ్లను తొలగించారని  వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.  ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement