vishakapatnam distirict
-
పొత్తులమారి నక్క!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతోపాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. టీడీపీ ఎత్తులను పసిగట్టిన జనసేన తన బలం పెంచుకునేందుకు కొత్త నేతలకు ఆహ్వానం పలుకుతోంది. పెద్దగా ప్రజాబలం లేకున్నా.. గతంలో ఎన్నడో రాజకీయాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పడాల అరుణను చేర్చుకుంది. తాజాగా అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఆహా్వనిస్తోంది. తమ వద్ద బలమైన నేతలు ఉన్నారని చూపించుకునేందుకు తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ‘సీట్ల ముడి’ అంత సులువుగా వీడేలా కనిపించడం లేదు. నాలుగు జిల్లాల్లో జనసేనకు ‘సున్న’ం! ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ ఆరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో విశాఖ జిల్లాలో రెండు సీట్లు, అనకాపల్లి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేనకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అంటే నాలుగు జిల్లాల్లో జనసేనకు మొండిచేయి చూపనుందన్నమాట. దీంతో జనసేన నేతలు రగిలిపోతున్నారు. వీరందరికీ మొండిచేయేనా..! ♦ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి విశ్వక్సేన్, పాతపట్నం నుంచి గేదెల చైతన్య జనసేన తరఫున సీట్లను ఆశిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ♦ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ జనసేన తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు. ♦ పార్వతీపురం జిల్లాలో సాలూరు సీటును తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు. ♦అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ♦ విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణంలో ఏదో ఒక సీటును జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తుండగా.. పెందుర్తి సీటు తనదే అన్న రీతిలో పంచకర్ల రమేష్ బాబు మొన్నటివరకు కార్యక్రమాలు చేశారు. గట్టి హామీ లేకపోవడంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు. ♦ యలమంచిలి నుంచి జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ పోటీకి యత్నింస్తున్నారు. అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్‌రావు రేసులో ఉన్నారు. విశాఖ దక్షిణం నుంచి కందుల నాగరాజు, సాదీక్‌లు, విశాఖ ఉత్తరం నుంచి ఉషాకిరణ్, భీమిలిలో పంచకర్ల సందీప్ జనసేన తరఫున సీటు కోసం యత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు తమకు కచ్చితంగా సీటు వస్తుందని బలంగా నమ్ముతున్న నేతలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ♦ కొత్తగా చేరుతున్న కొణతాల రామకృష్ణ తనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని చెబుతున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. -
విశాఖ అన్ని విధాలుగా రాజధానికి అనుకూలం : ప్రొ.జీఎన్ రాజు
-
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
-
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలో మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. నెల్లూరు: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. -
Fire Accident: నోటిలో డీజిల్ పోసుకొని ఫైర్ చేస్తుండగా ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని యలమంచిలిలో నేలవేషాల కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. యలమంచిలి మున్సిపాలిటీలో నాగుల చవితి సందర్బంగా నేలవేషాల కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో సంతోష్ అనే వ్యక్తి నోటిలో డీజిల్ పోసుకొని ఫైర్ చేస్తుండగా.. అది కాస్త రివర్స్ కావటంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. సంతోష్‌కు గాయాలు కావటంలో అతన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విశాఖ జిల్లా ఆనందపురం ఎంపీపీగా డెంటల్ డాక్టర్
-
దేవుడు బాబు: మరుగునపడిన స్వాతంత్య్రయోధుడు
మహాత్మాగాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ హటావో, ఖాదీ ఉద్యమం తదితర ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొని, జైలుకి వెళ్లి, లాఠీ దెబ్బలు కూడా తిన్న ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు చరిత్రలో కనుమరుగయ్యారు. అలాంటి వారిలో పూడిపెద్ది సుందరరామయ్య ఒకరు. ఆయన 12–8–1912న విశాఖపట్నంలో జన్మిం చారు. 1982 సెప్టెంబర్ 23న, తన 70వ ఏట కన్నుమూశారు. 1929లో గాంధీగారి పిలుపుమేరకు, న్యాయశాస్త్రంలో పట్టా కోసం జరిగే పరీక్షలను సైతం వదులుకుని, అతి పిన్న వయసులోనే, అనగా తన 17వ ఏటనే, స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా పేరు గడించారు. తొలుత హార్బర్లో టైం ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన గడియారం పెట్టుకుని పని చేయాలని, ఒక బ్రిటిష్ అధికారి చెప్పడంతో, అది నచ్చక తొలి రోజే రాజీనామా చేసేశారు. వీరు చేసిన పలు సేవా కార్యక్రమాలు: పేదవారైన స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టినప్పుడు కుల, మతాలకు అతీతంగా, వారివారి కుటుంబ సభ్యులందరికీ, మూడుపూటలా, ఇంట్లో వండించి క్యారేజీలు పంపించేవారు, మందులు, బట్టలు, డబ్బు కూడా పంపించేవారు. గర్భిణీ స్త్రీలకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్ని ఇచ్చి, వాళ్ళని హాస్పిటల్లో దింపించేవారు. స్టోన్ హౌస్ అనే ఇల్లు కట్టించి, అందులో, 105 మంది పేద పిల్లలకి పెళ్లిళ్లు చేయించారని చెబుతుం టారు. ఎలాంటి ధనాశా లేకుండా, తన ఇంటి పక్క ఖాళీ స్థలం, ఉచి తంగా పేదవారికి ఇచ్చారు, నూకరాజు కార్ల రిపేర్ షెడ్, దేవుడమ్మ టీ దుకాణం పెట్టుకుని ఇలాగే జీవనోపాధిని పొందారు. విశాఖలో పూడిపెద్ది సుందరరామయ్యను ‘దేవుడు బాబు’ అని పిలిచేవారు. – ఉగాది వసంత, పూర్వ మేనేజర్,వైజాగ్ స్టీల్ ప్లాంట్ ‘ 98494 55367 (నేడు పూడిపెద్ది సుందరరామయ్య వర్థంతి) -
Visakhapatnam: అలా నడిచేద్దాం.. మీన ప్రపంచంలోకి
సాక్షి, విశాఖపట్నం: చిన్న అక్వేరియంలో అందమైన చేపల కదలికలను చూస్తేనే మనకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే పెద్ద అక్వేరియంలోకి నడుచుకుంటూ వెళ్లి భారీ జలచరాల మొదలు చిన్న చిన్న జీవులను సమీపం నుంచి చూస్తే మనసు ఎంత పులకరిస్తుందో కదా! ఓ టన్నెల్ లాంటి అక్వేరియంలో జలచరాలను చూస్తూ అక్కడే విందు ఆరగిస్తుంటే మజా వస్తుంది కదా! అద్దాల అక్వేరియంలో ఇలాంటివన్నీ ఆస్వాదించడానికి ఇప్పుడు విదేశాలకు వెళ్లనక్కర్లేదు. మన రాష్ట్రంలో కూడా అలాంటి అద్దాల అక్వేరియంను నిర్మించడానికి ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిదైన టన్నెల్ అక్వేరియంను సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.163 కోట్లతో విశాఖపట్నంలో పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్వేరియం నిర్మాణానికి విశాఖలోని రుషికొండ, తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. అక్వేరియంకు ఎక్కువ సముద్రపు నీరు కావాల్సిన నేపథ్యంలో.. తొట్లకొండ ప్రాంతం అనువుగా ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. అద్భుత ప్రపంచం.. అక్వేరియం ఓ భారీ సొరంగం మాదిరిగా ఉంటే.. అందులో దాదాపు సముద్రంలో ఉండే జీవుల్నీ పెంచితే.. దాన్నే టన్నెల్ అక్వేరియం అంటారు. ఓసినేరియం మాదిరిగా ఇది ఓ అద్భుత ప్రపంచంలా ఉంటుంది. సముద్రలోతుల్లోకి వెళ్లి.. జలచరాల్ని సమీపం నుంచి చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. గుహలా ఉండే ఈ నిర్మాణంలోకి అడుగుపెట్టగానే.. జలచరాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్ మన మీదకు వచ్చేసినట్లే ఉంటుంది. షార్క్‌ల దంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆక్టోపస్‌ల జిత్తులు, సముద్రపు రొయ్యల దాగుడు మూతలు, భారంగా ఈదుతున్న తాబేళ్లు.. ఇలా పలు రకాల జలజీవాలను అత్యంత పారదర్శకమైన గాజు నిర్మాణంలోంచి 360 డిగ్రీల కోణంలోనూ చూడవచ్చు. విశాఖలో నిర్మించే అక్వేరియంలో ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో కనిపించే 20 వేల రకాల సముద్ర జీవులు ఉండనున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్ దేశాలకు చెందిన నిపుణులు దీనిని డిజైన్ చేయనున్నారు. సుమారు 3 వేల మంది ఒకేసారి సాగర ప్రపంచాన్ని తిలకించేలా ఐదు అంతస్తుల్లో నిర్మాణం జరగనుంది. కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా.. వైజ్ఞానిక, పరిశోధన క్షేత్రంగానూ ఉపయోగపడేలా దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. విశాఖలో ఇవీ థీమ్స్.. ► ఓషన్ థీమ్స్: హిందూ, పసిఫిక్ మహా సముద్రాల్లో మత్స్య సంపద, సుడిగుండాలు, ఉప్పెనల వల్ల సముద్రాలు ఎలా ప్రభావితమవుతాయి. స్థానిక వాతావరణం కారణంగా ఎలాంటి మార్పులు సంభవిస్తాయనే విషయాలు పర్యాటకులకు వివరించనున్నారు. ► ఓడలు ఎలా మునిగిపోయాయి?: ప్రపంచంలో పలు సముద్రాల్లో భారీ ఓడలు ఎలా మునిగిపోయాయి. ఎలా ధ్వంసమయ్యాయో పర్యాటకులకు షిప్‌రెక్ థీమ్‌లో వివరించేలా నిర్మాణం జరగనుంది. ► భారతదేశ నదుల థీమ్: మనదేశంలో ఉన్న నదులు ఎక్కడ పుట్టాయి. ఎటు ప్రవహిస్తున్నాయి. సముద్రంలో ఎక్కడ కలుస్తాయన్నది ఇక్కడ చూపించనున్నారు. ► టన్నెల్ రీఫ్ రెస్టారెంట్: టన్నెల్ అక్వేరియంలో సముద్ర జీవులను చూస్తూ.. హాయిగా భోజనం చేసేలా టన్నెల్ రీఫ్రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ► షార్క్ ల్యాబ్: షార్క్(సొర) చేపల జీవన చక్రం, మానవ చర్యల కారణంగా అవి ఎలా అంతరించిపోతున్నాయన్నది ఈ ల్యాబ్‌లో చూపించనున్నారు. ► మెడిటరేనియన్ కేవ్స్: అలల తాకిడికి సముద్రంలో శిలాతోరణాలు ఎలా ఏర్పడతాయో వివరించేలా నిర్మాణం జరగనుంది. అద్భుతాల నిలయం.. విశాఖ అక్వేరియం సింగపూర్‌లోని మెరైన్ లైఫ్పార్క్, ఇంగ్లండ్‌లోని బౌర్న్మౌత్, లాస్ ఏంజిల్స్‌లోని సీవరల్డ్ తరహా టన్నెల్ అక్వేరియం విశాఖలో నిర్మించాలని భావిస్తున్నాం. టూరిజం పాలసీ 2020–2025ని అనుసరించి పీపీపీ విధానంలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించాం. అద్భుతాలకు నిలయంగా ఇది రూపుదిద్దుకోనుంది. విభిన్న థీమ్స్‌తో పాటు గ్రీన్ ఫోటో ఫెసిలిటీ, సావనీర్ షాప్స్, ఫుడ్ కోర్టులు, అనేక సరికొత్త అందాలు టన్నెల్ అక్వేరియంలో మిళితమై ఉంటాయి. – రజత్ భార్గవ, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
Photo Feature: గ్రీన్ బ్యూటీ.. ‘స్నో’యగాలు
సాక్షి, అరకులోయ/ పాడేరు: అందాల అరకు వర్షాకాలంలో చూపే హొయలు అంతా ఇంతా కాదు. ఏ వైపు చూసినా ఆకుపచ్చని చీర ధరించిన ప్రకృతి కాంత అద్భుతంగా మారి కనువిందు చేస్తుంటుంది. ఉన్నత పర్వత శ్రేణులు ఒక వైపు, పచ్చని పంట భూములు మరోవైపు.. వానా కాలంలోనూ ప్రభాత వేళ దర్శనమిచ్చే మంచు తెరలతో వన సీమ మనోజ్ఞరూపం నేత్రపర్వం చేస్తోంది. పాడేరు ఘాట్‌లో ఒక వైపు వర్షం కురుస్తుండగా మరో వైపు కొండల నిండా మంచు తెరల నడుమ మేఘాలు కమ్ముకోవటంతో అమ్మవారి పాదాల నుంచి వంట్లమామిడి ప్రాంతం దిగువుకు మబ్బులు దారిపొడవునా ఆహ్లాదపరిచాయి. -
‘సంధ్యారాణిని వెంటనే డిశ్చార్జ్ చేయండి’
అల్లిపురం(విశాఖ దక్షిణ): రక్షణ కల్పించాలని ఆశ్రయించిన ఓ వివాహితపై పెందుర్తి పోలీసులు మానసిక రోగిగా ముద్రవేసి అక్రమంగా మెంటల్ హాస్పిటల్‌కు తరలించారని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ ఆరోపించారు. బాధితురాలిని తక్షణమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన మోసూరి సంధ్యారాణి.. తన భర్త మోసూరి రవికృష్ణ తనను, తన పిల్లలను శారీరకంగాను, మానసికంగానూ వేధిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని ఈ నెల 6న ఎండాడ దిశ పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు, అన్నదమ్ములకు చెప్పినా.. తన భర్తకే వత్తాసు పలుకుతున్నారని వాపోయింది. అదే రోజు ఆమె కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో సంధ్యారాణి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు. మెంటల్ హాస్పిటల్లో బాధితురాలు సంధ్యారాణి 7న పెందుర్తి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. వారు రక్షణ కల్పించాల్సింది పోయి ఆమె భర్త, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేజీçహెచ్‌కు తరలించారు. అక్కడ నుంచి నేరుగా చినవాల్తేరు మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. రక్షణ కల్పించాలని కోరిన ఆరోగ్యవంతురాలైన సంధ్యారాణిని మెంటల్ హెల్త్ చట్టం 1987(రద్దయిన చట్టం)ను షాకుగా చూపి మెంటల్ హాస్పిటల్‌కు తరలించడం ఆమె హక్కులను ఉల్లంఘించటమేనని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తక్షణమే బాధితురాలిని విడుదల చేసి, ఇచ్చిన ట్రీట్మెంట్ను బహిర్గతం చేయాలని కత్తి పద్మ డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన పెందుర్తి పోలీసులపై చర్యలు తీసుకుని, సంధ్యారాణికి వసతి, రక్షణ కల్పించాలని మహిళా సంఘాల నేతలు కోరారు. మేలు చేయాలన్నదే పోలీసుల ప్రయత్నం పెందుర్తి: స్థానిక సుజాతనగర్‌కు చెందిన మోసురి సంధ్యారాణి, ఆమె పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే పెందుర్తి పోలీసులు పనిచేశారని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. ఆమెకు మేలు చేయాలన్నదే తమ ప్రయత్నమన్నారు. తమకు సంధ్యారాణి తల్లిదండ్రులు, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్‌కు పంపించామన్నారు. ఆమె మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ప్రకారం నిపుణులైన వైద్యుల నివేదిక మేరకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకే సంధ్యారాణిని సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఈ కేసులో పోలీసులు కేవలం మానవతా దృక్పథంతోనే ఆలోచించారే తప్ప మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ కేసులో తాము పూర్తిగా న్యాయబద్ధంగా.. పారదర్శకంగా వ్యవహరించామని పేర్కొన్నారు. -
విశాఖ జిల్లాలో రోడ్డెక్కనున్న 100 ఎలక్ట్రికల్ బస్సులు
-
విశాఖలో 33 రైతు బజార్లు ఏర్పాటు
-
విశాఖ అరకులో హిందూధర్మ ప్రచార యాత్ర ప్రారంభం
-
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తడిసి ముద్దయిన బెజవాడ: ఆదివారం కురిసిన వర్షాలకు విజయవాడ తడిసి ముద్దయింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లా అంతటా సాయంత్రం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడగా.. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. పల్నాడులో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. -
రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి
తగరపువలస(భీమిలి): అంగరంగ వైభవంగా జరుగుతున్న భీమిలి ఉత్సవాలను చూస్తుంటే రెండు నెలల ముందే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి వచ్చినట్టుందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన తగరపువలసలో జ్యోతి ప్రజ్వలన చేసి బెలూన్లు ఎగురవేసి భీమిలి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అదికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మనస్పూర్తిగా జరుపుతున్న ఉత్సవాలు ఇవి అని అన్నారు. విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హయాంలో భీమిలి అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం పట్టణాల మద్య ఉన్న భీమిలిలో అతి పురాతన ఆలయాలతో బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతమన్నారు. జిల్లాలో టూరిస్ట్‌లపై అరాచకాలు తగ్గించడానికి గాను టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించాలని సీపీ ఆర్కే మీనా, కలెక్టరు వినయ్‌చంద్‌లను కోరారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రెండో మున్సిపాల్టీ అయిన భీమిలిలో జిల్లా అవసరాలకు కావలసిన ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కంకణబద్ధులై ఉన్నారన్నారు. అధికారభాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతినెలా రాష్ట్రంలో కొండవీటి, విజయవాడ వంటి ఉత్సవాలు చేయాలని సూచిస్తే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందుగా భీమిలి ప్రజలకు అవకాశం కలి్పంచారన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ అత్యంత సుందరమైన భీమిలికి పండగ వచ్చిందన్నారు. పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో తూర్పుగోదావరిపులసకు, నెల్లూరు ఫ్లెమింగ్ పక్షలకు, ఒంగోలు గిత్తలకు, కాకినాడ కాజాకు, అరకు కాఫీ, నర్సాపూర్ లేస్‌లు ఇలా కలంకారి, సిల్‌్క, కూచిపూడి వంటివి ప్రఖ్యాతమైనవి ఉన్నాయన్నారు. కలెక్టరు విజయ్‌చంద్ మాట్లాడుతూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి ఉత్సవాల మాదిరిగానే రానున్న 6,7 నెలల్లో అరకు, విశాఖ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. వేడుకలలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అనకాపల్లి, విజయనగరం ఎంపీలు భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల, గజపతినగరం ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, రాష్ట్ర నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, రొంగలి జగన్నాథం, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో ప్రభుత్వం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్
-
వలలోకి దించుతాయ్.. ఈ వెబ్సైట్లతో జాగ్రత్త!!
సాక్షి, అల్లిపురం(విశాఖ దక్షిణం): తియ్యటి మాటలతో యువకులను వలలో వేసుకుంటున్న వెబ్సైట్ నిర్వాహకులు కోలకతాలో కుప్పలు తెప్పలుగా ఉన్నారని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపారు. శనివారం ఆయన కోల్‌కతాలో ఒక కాల్‌సెంటర్‌పై దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సోమవారం నగరానికి చేరుకున్న సీఐ వి. గోపీనాథ్ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపం అనే వ్యక్తి ఈ తరహా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న వీటిపై కోల్‌కతా పోలీసులకు అవగాహన లేదన్నారు. విశాఖ పోలీసుల చొరవతోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఆరు నెలల క్రితం బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాము గతంలో రెండుసార్లు కోల్‌కతా వెళ్లి ప్రయత్నించినా ఆచూకీ తెలియరాలేదన్నారు. స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, గుర్తింపుకార్డులు మూడవసారి పకడ్బందీగా ప్రయత్నం చేయటంతో గుర్తించగలిగామని సీఐ గోపీనాథ్ వివరించారు. ఇందులో యువతులను కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించుకుంటున్నారని, తరువాత వారిని తమకు అనుకూలంగా మార్చి ఈ తరహా మోసాలకు గురి చేస్తున్నారని, అందుకు టార్గెట్లు, కమిషన్లు, బహుమతులు ఎరచూపి యువతులను వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. కాల్‌సెంటర్‌పై దాడి చేసి నప్పుడు 23 మంది యువతులతో పాటు, ఒక హెచ్ఆర్, ఆఫీస్ బాయ్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని అలిపూర్లో ని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారి దగ్గర నుంచి 40 వరకు బేసిక్ ఫోన్లు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రూటర్, హార్డ్ డిస్కు, కొన్ని సిమ్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులు డిసెంబర్ 6న నగరంలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. వెబ్సైట్లతో జాగ్రత్త.. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా పీపుల్ ఫ్రెండ్స్, కిన్ కీ, హానీ పికప్, ఫ్యాషన్, హాట్ టెంప్టేషన్ వంటి వెబ్సైట్లు ఉన్నాయన్నారు. చాలా వరకు తాము చేసిన దాడులతో వాటిని నియంత్రించగలిగామని తెలిపారు. ముఖ్యంగా వీరి వలలో నగరానికి చెందిన కొన్ని విభాగాల్లో ఉన్నతాధికారులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన వివరించారు. యువత, ఉత్సాహవంతులు ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తేనెలా మాట్లాడుతూ నెమ్మదిగా తమ వలలోకి దించి వారి నుంచి లక్షల్లో డబ్బులు కాజేయటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
జెన్ కో.. దేఖో..!
సాక్షి, సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ ఉత్పత్తిని అందిస్తున్న ఘనత సీలేరు విద్యుత్ కాం ప్లెక్సు సొంతం. రాష్ట్రానికి వెలుగులు నింపడంలో మొదటి స్థానంలో నిలిచి ప్రతి ఏటా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి ఎన్నో అవార్డులు దక్కించుకుంటోంది. అలాగే గోదావరి పంట భూములకు ఏటా 50టీఎంసీల వరకు నీటిని సరఫరా చేసి అన్నదాతలను ఆదుకునే గొప్పగుణమున్న విద్యుత్ కేంద్రంగా ఖ్యాతిని పెంచుకుంటోంది. ఇంతటి పేరున్న విద్యుత్ కేంద్రంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. జెన్కో సంస్థ ఎప్పు డూ ఇక్కడ విద్యుత్ తయారీని అభినందిస్తోందే తప్ప.. ఇక్కడ అధికారుల పనితీరు ఏమిటి? ఇక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి? పనుల నాణ్యత? నిధుల సక్రమ వినియోగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన దాఖ లాలు లేవనే విషయం కొన్ని అంశాల్ని పర్యవేక్షిస్తే స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. ప్రభుత్వానికి శాపంగా మారింది. కోట్లరూపాయల నష్టానికి కారణమవుతోంది. కమీషన్ల కక్కుర్తిలో పడి స్థానిక జెన్కో అధికారులు పనుల్లో నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. పది రోజుల క్రితం డొంకరాయి పవర్ కెనాల్‌కు భారీగా గండి పడిన సంగతి తెలిసిందే. అయితే తుఫాన్ ప్రభావంతో సంఘటన జరిగినప్పటికీ.. గతంలో ఉన్న లోపాల్ని అధికారులు పట్టించుకోకపోవడం కూడా జెన్కో సంస్థకు శాపంగా మారింది. పవర్ కెనాల్‌కు గండి పడడంతో డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 485 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పది రోజులుగా నిలిచిపోయింది. గండిపడి పదిరోజులవుతున్నా ఇప్పటికి నీటిని మళ్లించే పనుల నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల ఖర్చుతో చేపడుతున్న పనులు పూర్తి కాలేదు. ఆ పనులు పూర్తయితే తప్ప గండి పడిన ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు వీలు కుదరదు. అప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించడానికి వీలుకాదు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతున్నా ఇప్పటి వరకు జెన్కోలోని డైరెక్టర్ స్థాయి అధికారులు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నత్తనడకన సాగుతున్న నీటి మళ్లింపు పనులు లీకేజీతో పనులకు ఆటంకం... సీలేరు విద్యుత్ కాంప్లెక్సు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం పైభాగంలో జలాశయానికి ఆనుకుని మూడు గేట్లతో శాడిల్ డ్యాం ఉంది. జలాశయంలో పూర్తిగా నీటిమట్టం చేరి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయని సమయంలో ఈ గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం పవర్ కెనాల్‌కు గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినా శాడిల్ డ్యాం గేట్లు లీకేజీల కారణంగా రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు పవర్ కెనాల్‌కు వస్తోంది. దీంతో ఆ నీటిని తగ్గించేందుకు ఇప్పటికే అండర్ వాటర్ సర్వీస్ ద్వారా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావడం లేదు. శాడిల్ డ్యాం గేట్ల రబ్బర్ సీల్స్ నాణ్యమైనవి కాకపోవడమే దీనికి కారణం. అప్పటి అధికారుల కమీషన్ల కోసం చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఇపుడు అది పెద్ద ప్రమాదంగా మారింది. డైవర్షన్ పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది. లీకవుతున్న నీరు రెండు అడుగుల మేర రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పవర్ కెనాల్ కుడి ఎడమ గట్టు పరిస్థితి ప్రమాదంగా ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఏడాదిన్నర కిందట పవర్ కెనాల్ ఏఈ.. చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టులపై డైరెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, పది రోజులు గడిచినా తాత్కాలికంగా నీటిని మళ్లించే పనులు జరగకపోతే గండి పడిన ప్రదేశాన్ని పూడ్చేందుకు ఎన్నిరోజులు పడుతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం.. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్సులోని పలు శాఖల ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే తాజా ప్రమాదానికి కారణం. పవర్ కెనాల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కుడి, ఎడమల కాలువల మరమ్మతులు చేపట్టారే తప్ప నీరు ప్రవహిస్తున్న 14 కిలోమీటర్ల అడుగుభాగం ఎలా ఉందని ఇప్పటి వరకు స్థానిక అధికారులు పరిశీలించలేదు. అడుగు భాగం 15మీటర్ల వరకు చొచ్చుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రస్తుతం నీటి మళ్లింపు ఖర్చు, పనుల ఖర్చు, గండి పడిన ప్రదేశంలో నిర్మాణం చేపట్టడంతో పాటు గత పదిరోజులుగా రెండు విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల భారీ నష్టం తప్పలేదు. దీనికి స్థానిక అధికారులే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
విశాఖ ఇక.. వెలుగు బాట..!
మోముపై చెరగని చిరునవ్వు.. తెలియని వారికి సైతం ఆత్మీయ పలకరింపు.. పాలనపై పట్టు.. ప్రజా సమస్యలపై అపారమైన అవగాహన.. ఇవన్నీ కలగలిసిన నేత మోపిదేవి వెంకటరమణ. రాష్ట్ర పశుసంవర్థక, మార్కెటింగ్, మత్స్యశాఖల మంత్రిగా ఉన్న ఆయన్ను విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి మోపిదేవిపై తనకున్న నమ్మకాన్ని.. విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధిని పరోక్షంగా చాటారు. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా.. ఆర్థిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖను గత ప్రభుత్వం గానీ.. ఇన్చార్జి మంత్రులుగా ఉన్నవారు గానీ.. పెద్దగా పట్టించుకోలేదు. ఉత్సవాలు, సంబరాలు, సదస్సుల పేరిట నిధుల దుబారా.. అట్టహాసాలు తప్ప విశాఖ జిల్లా అభివృద్ధికి నిర్ధిష్టంగా చేసిన కృషి ఏమీ లేదనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాల్లో సంతోషం నింపుతున్నారు. ఆయన బాటలోనే జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇప్పటికే నిత్యం పర్యటనలు, సమీక్షలతో ప్రజలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇన్చార్జి మంత్రి మోపిదేవి కూడా అనుభవశాలే కావడం విశాఖ ప్రగతికి మేలిమలుపు కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆయన సారథ్యంలో విశాఖ వెలుగులీనడం ఖాయమని అన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే పాలనను పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతోపాటు ప్రజాసంకల్పయాత్రలో తాని చ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజారంజక పాలన సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మరోవైపు విశాఖ జిల్లాలో పాలన పరుగులు పెడుతూ అభివృద్ధిలో దూసుకుపోనుంది. గడిచిన ఐదేళ్ల పాటు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు నిలయంగా మారిన విశాఖ మళ్లీ గాడిలో పడనుంది. ఇప్పటికే జిల్లా సీనియర్ రాజకీయ నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు జిల్లా పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలు కూడా సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పాలనపై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయపరుస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాల వారికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అపారమైన అనుభవశాలి మోపిదేవి ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాకు రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును ఇన్చార్జి మంత్రిగా సీఎం జగన్మోహన్రెడ్డి గురువారం నియమించారు. అత్యంత సీనియర్ మంత్రి అయిన మోపిదేవికి నవ్యాంధ్రలో ఏపీ ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 1989 నుంచి రాజకీయాల్లో ఉన్న మోపిదేవి ఎన్నో కీలక పదవులు చేపట్టారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూచిపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవికి తన కేబినెట్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్స్ నేచురల్ గ్యాస్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక 2009లో రేపల్లె నుంచి గెలుపొందిన మోపిదేవిని వైఎస్సార్ తన కేబినెట్లో లా అండ్ కోర్టులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారు. మహానేత అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య కేబినెట్లో మోపిదేవికి మళ్లీ అవే శాఖలను అప్పగించారు. ఇక ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా దాదాపు పదేళ్ల పాటు అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన మోపిదేవిని విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పాలనాపరమైన వ్యవహారాలను ఇన్చార్జి మంత్రి పర్యవేక్షించనున్నారు. విశాఖను ఆదర్శ జిల్లా చేస్తా: ఇన్చార్జి మంత్రి మోపిదేవి జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. గతంలో మంత్రిగా, వైఎస్సార్సీపీ నేతగా జిల్లాలో చాలాసార్లు పర్యటించా. పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశానని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొనిపోతానన్నారు. అర్ధవంతమైన సమీక్షలతో జిల్లా పాలనను గాడిలో పెట్టడంతోపాటు.. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముకానీయనని మోపిదేవి అన్నారు. రాజధాని అమరావతి తర్వాత అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా తనను నియమించిన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలందరూ తనకు బాగా తెలుసునన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసునని అందర్ని సమన్వయపరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా విశాఖను తీర్చిదిద్దుతానని మంత్రి చెప్పారు. జిల్లాపై పూర్తి అవగాహన రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టింది మొదలు అవంతి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడుతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ జిల్లా పాలనపై పూర్తిస్థాయి పట్టు సాధిస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు. తాజాగా పాలనలో అపారమైన అనుభవం కలిగిన మోపిదేవికి ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించడంతో జిల్లా పాలన మరింత వేగంగా పరుగులు పెట్టనుందని జిల్లా వాసులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ ఎలాంటి సమస్యనైనా సామరస్యంగా పరిష్కరించడంతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయపర్చడంలో మోపిదేవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్సార్సీపీలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెన్నంటి ఉంటూ మత్స్యకార నేతగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ముఖ్యంగా బీసీ అధ్యయన కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలు పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా చేయడంలో మోపిదేవి పాత్ర ఎంతో ఉంది. ఇక విశాఖ జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. మంత్రిగా పనిచేసిన సమయంలో అనేకమార్లు జిల్లాలో పర్యటించడమే కాదు.. జిల్లాలో పలు సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో కృషిచేశారు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటపై టీడీపీ ముష్కరులు దాడి చేసి ఘటనలో పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ చైర్మన్‌గా మోపిదేవి గ్రామంలో పర్యటించి ఇరువర్గాలను సమన్వయపర్చడంలో ప్రత్యేక కృషి చేశారు. అంతేకాదు మత్స్యకారులను ఏస్టీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదుట మత్స్యకారులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన చంద్రబాబు తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున జరిగిన ఆందోళనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇలా గతంలో మంత్రిగా, పార్టీ నేతగా జిల్లాపై మంచి అవగాహన, పట్టు ఉన్న మోపిదేవి వెంకటరమణ తాజాగా ఇన్చార్జి మంత్రి హోదాలో రానున్న ఐదేళ్లు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టించడంలో తనదైన ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు. -
మహిళను మోసగించిన వ్యక్తిని...
సాక్షి, గాజువాక(విశాఖపట్నం) : భర్తలేని ఒక వివాహితను ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిని న్యూపోర్టు పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చోడవరం మండలం అన్నవరం వీధికి చెందిన బద్దిదేవి వరలక్ష్మీ శిరీష గాజువాక ప్రాంతంలో ఒక దినపత్రికలో విలేకరిగా పని చేస్తోంది. స్థానిక పల్లావారి మామిడితోట సమీపంలోని వినాయకనగర్‌లో పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఎనిమిది నెలల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో ఒక ప్రైవేట్ ఛానెల్ విలేకరిగా పని చేస్తున్న నాసన సంతోష్ కుమార్ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ఆమె ఇంటికి వెళ్లి వివాహం చేసుకుంటానని చెప్పాడు. అయితే, తన తల్లి ఈ వివాహానికి ఒప్పుకోవడంలేదని, తరువాత మెల్లగా ఒప్పిస్తానన్నాడు. నుదుటిపై సింధూరం పెట్టి వివాహం చేసేసుకున్నట్టేనని నమ్మించాడు. అప్పట్నుంచి శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి అయిన శిరీషను మగబిడ్డను కని తనకు ఇవ్వాలని కోరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భం దాల్చిన వివాహితపై ఒత్తిడి తెచ్చి మాత్రలతో గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో అతడు ఆమె వద్దే ఉండేవాడు. దీంతో సంతోష్ తల్లి, అక్కలు, బావలు, ఇతర బంధువులు ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవారు. వారి వివాహానికి అంగీకరించి సేవలను చేయించుకొనేవారు. కాగా, శిరీషకు తెలియకుండానే మే 27న వేరే యువతిని వివాహం చేసుకునేందుకు పెళ్లి చూపులకు సంతోష్ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శిరీష అతడిని నిలదీయడంతో అదే నెల 31న గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడిని కలవడానికి వివాహిత ఎన్నిసార్లు ప్రయత్నంచినా సాధ్యం కాలేదు. చివరకు ఈ నెల 20న ఆమెకు ఫోన్ చేసి తనను కలవడానికి ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశాడు. ఆమెను వివాహం చేసుకోనని, ఈ విషయంలో ఒత్తిడి చేస్తే ఆమెను, పిల్లలను చంపేస్తానని, ఆమె బంధువులకు ఫోన్ చేసి అవమానాలకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మోసపోయానని భావించిన శిరీష న్యూపోర్టు పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన సంతోష్ కుమార్‌ను, అతడికి సహకరించిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐ సంజీవరావు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నిలువ నీడ లేక..
సాక్షి, చోడవరం(విశాఖ) : ఒక పక్క ఎండలు..మరో పక్క వర్షాలు...ప్రయాణికులకు మాత్రం అవస్థలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జంక్షన్లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్తితి. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ వారు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. 80 గ్రామాలకు బస్ సౌకర్యం లేదు చోడవరం నియోజకవర్గంలో సుమారు 80 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోగా మిగతా 100 గ్రామాలకు బస్సులు వెళుతున్నా 60 శాతానికి పైగా గ్రామాలకు బస్ షెల్టర్లు లేవు. నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 40 వేలకు మందికి పైగా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రోజువారీ పనులు, ఇతర కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఎండలకు మండుతూ, వర్షాలకు తడుస్తూ ఎప్పుడో వచ్చే బస్సులు, ఆటోల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రూట్లలో సైతం కనిపించని షెల్టర్లు చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, మాడుగుల ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బీఎన్‌రోడ్డు, మాడుగుల రోడ్డు, అనకాపల్లి –బంగారు మెట్ట, తోటకూపాలెం, రావికమతం రోడ్లులో సైతం చాలా గ్రామాల వద్ద బస్ షెల్టరు లేవు. నాలుగైదు గ్రామాల్లో స్థానిక దాతల సాయంతో బస్షెల్టర్లు నిర్మించగా, మరో ఏడు చోట్ల గతంలో పార్లమెంటు సభ్యుల నిధులతో నిర్మించారు. మిగతా గ్రామాల్లో కనీసం నిలబడడానికి నీడ కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం పరుగులు చోడవరం మండలంలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, గంధవరం, లక్కవరం, గాంధీగ్రామం, నర్సయ్యపేట, గౌరీపట్నం జంక్షన్, నర్సాపురం జంక్షన్, రాయపురాజుపేట, శీమునాపల్లి, ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి ఉండడానికి బస్ షెల్టర్లు లేవు. కొన్ని చోట్ల గ్రామాలు దూరంగా ఉండడంతో ఆయా జంక్షన్లలో మరీ దయనీయంగా ఉంది. స్కూళ్లు ప్రారంభం కావడం, వర్షాకాలం వచ్చేయడంతో సాధారణ ప్రయాణికులతోపాటు రోజూ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. షెల్టర్లు లేక వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు ప్రయాణికుల దుస్థితి గమనించి బస్ షెల్టర్లు కట్టించాలని జనం కోరుతున్నారు. ఐదేళ్లుగా నిర్లక్ష్యం గడిచిన ఐదేళ్లలో ఒక్క బస్‌షెల్డర్ కూడా గత ప్రభుత్వం నిర్మించలేదు. అసలే ఎండలు మండిపోవడం, అకాల వర్షాలు కురవడంతో ప్రయాణికులు తలదాచుకోడానికి నిలువు నీడలేకుండా ఉంది. చెట్ల కింద ఉన్నా, కొన్ని గ్రామాలకు జంక్షన్ల వద్ద చెట్లు కూడా లేవు. బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నాం. మా గ్రామం అనకాపల్లి –చోడవరం రోడ్డులో ఉన్నప్పటికీ బస్ షెల్టర్ లేదు. – మొల్లి ప్రసాద్, గంధవరం షెల్టరు నిర్మించాలి మా రూట్లో ఒకటి రెండు బస్సులే నడుస్తున్నాయి. అవికూడా సకాలంలోరావు. ఆ బస్సుకోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. ఎండకి ఎండి, వర్షానికి తడిసి నిలబడాల్సి వస్తుంది. బస్ షెల్టర్ కోసం పలుమార్లు గత ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాం. కానీ ఆయన పట్టించుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకొని మా జంక్షన్ వద్ద బస్‌షెల్టర్ నిర్మించాలని కోరుతున్నాం. –అప్పారావు, వీఆర్‌పేట -
మావారి ఆచూకీ తెలపండి
పాడేరు(విశాఖ పట్టణం) : పిల్లలను పాఠశాలకు పంపేందుకు వచ్చిన తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వెంటనే వారి ఆచూకీ తెలపాలని పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన గిరిజనులు వరద రామ్మూర్తి, పోత్రంగి కనకాలమ్మ, తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎస్పీ రాజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెదబయలు మండలం మారుమూల ఇంజరి గ్రామానికి చెందిన వరద వెంకటేష్ అనే గిరిజనుడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాడేరులో ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నాడన్నారు. గ్రామానికి చెందిన మరో గిరిజనుడు పాత్రోంగి కోటిబాబు కూడా పిల్లలను పాడేరులోని ఓ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్నాడన్నారు. వీరిరువురు ఈ నెల 18న తమ కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలను పాఠశాలలకు పంపేందుకు పాడేరు వచ్చారన్నారు.సినిమాహాల్ సెంటర్లో ఉండగా పోలీసులు వచ్చి తమ వారిని అన్యాయంగా వారి వెంట తీసుకుపోయారన్నారు. తీసుకువెళ్లేముందు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారన్నారు. కానీ నేటికి వారి ఆచూకీ తెలపలేదన్నారు. ఎక్కడ దాచిపెట్టారో, వారిని ఏం చేస్తున్నారో భయంగా ఉందన్నారు. తమ వారికి మావోయిస్టులతో కానీ వారి కార్యకలపాలతో కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. మాపై గిట్టని వారు తమవారి పట్ల పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చునన్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని లేని పక్షంలో బేషరతుగా విడుదల చేయాలని వారు కోరారు. -
జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..
సాక్షి, విజయనగరం : జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఏఈ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్ భరత్ బెదిరింపులకు దిగుతున్నారని నరవ యూజీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జీతాలిప్పించండి మహాప్రభో’ శీర్షికతో ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జీతాలివ్వాల్సిందిపోయి ఉద్యోగాలు తీసేస్తామంటూ కాంట్రాక్టర్ భరత్, ఆయనకు వంతపాడుతూ ఏఈ రాజ్‌కుమార్ బెదిరింపులకు దిగుతున్నారు. ఉద్యోగుల పక్షాన ఉండవలసిన ఏఈ.. కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాంట్రాక్ట్ సమయం ముగిసినా ఇంకా ఇక్కడి ప్లాంట్‌లో చెలామణి చేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నామన్న జాలి కూడా చూపడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులు.. భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం... అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తాం.. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం.. గత పాలకుల భూ కుంభకోణాల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వచ్చింది.. దాన్ని రూపు మాపి జిల్లాను అగ్రపథాన నిలపడానికి మీరు...మేము కలసి పని చేద్దామని అధికారులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిద్దామని చెప్పారు. స్థానిక గవర్నర్ బంగ్లాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో శనివారం పలు ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పనులు, కేటాంపుల్లో అవకతవకలు ఉంటే వెలుగులోకి తేవాలని ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమష్టిగా పని చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేద్దా మన్నారు. ఈ క్రమంలో బాగా పని చేసిన అధికారులకు సీఎం జగన్మోహన్రెడ్డితో సన్మానం చేయిస్తానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీటి, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా తదితర వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎన్ఏడీ ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి ఎన్ఏడీ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ఆ జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తూ పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పర్యాటకులకు దివ్యదామంగా విశాఖను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్నికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీసా ఆన్ ఎరైవల్ విధానాన్ని అములు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అంబాసిడర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 2న0న ఎమ్మెల్యేలతో కలిసి శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా జీవిఎంసీ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించేందుకు 21న సమావేశం నిర్వహిస్తాననని మంత్రి చెప్పారు. భీమిలి నియోజకవర్గంపై సమీక్ష భీమిలి బీచ్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి పనులను ప్రారంభించాలని సూచించారు.మత్స్యకారుల రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టిసారంచాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.చిట్లివలస శ్మశానవాటిక అభివృద్ధికి గతంలో మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు ఉన్నాయని.. దానిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోస్తనీనదిపై కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేసి జూలై 15 నాటికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈను ఆదేశించారు. అదేవిధంగా మధురవాడ, పరదేశిపాలెం బోయిపాలెం తదితర ప్రాంతాల్లో భవన సముదాయాల నిర్మాణానికి నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్–1 పరిధిలోని పలు వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని జీవీఎంసీ అధికారులకు మంత్రి సూచించారు. జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నివాసయోగ్యమైన భవన సముదాయాల్లో ప్రైవేటు పాఠశాలల ఏర్పాటును ఎలా అనుమతిస్తారని, ఆయా పాఠశాలను వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.వనయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం. హరినారాయణన్, వీఎంఆర్డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
స్కూలా.. ఫంక్షన్ హాలా?
సాక్షి,విశాఖపట్నం : ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలను టీడీపీ నేతలు తమ ఆగడాలకు అడ్డాగా మార్చేశారు. తమకు నచ్చి నట్టు పాఠశాలను ఉపయోగించుకుంటున్నారు. బడిని ఫంక్షన్ హాల్‌ను చేసేశారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మత్స్యకార విద్యార్థులకు ఆ మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా పాఠశాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురాగా స్థానిక టీడీపీ నాయకుడు పేర్ల మషేన్, 7వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పోలారావు నిరంకుశంగా వ్యవహరిస్తూ పాఠశాలను తమ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. పాఠశాల పనిదినాల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాల ఆవరణాన్ని యథేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతోంది. శనివారం కూడా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి పాఠశాల ఆవరణాన్ని పెళ్లిమంటపంగా మార్చేశారు. కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన పెళ్లి వేడుక శనివారం రాత్రి జరగనుంది. అయితే మషే న్, పోలారావు ఒక పక్క పాఠశాలలో తరగతులు జరుగుతున్నా ఇక్కడే పెద్ద ఎత్తున షామి యానాలు వేయించారు. అంతేకాదు వంటలను కూడా పాఠశాలలోనే చేయించడం జరిగిం ది. దీంతో తరగతుల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగించింది. ప్రైవేట్ కార్యక్రమాలకు పాఠశాలను వినియోగించడానికి వీల్లేదని స్థానికులు, ఉపాధ్యాయులు గతంలో చెప్పగా మషేన్ వారిపై చిందులు తొక్కాడు. దీంతో ఉపాధ్యాయులు ఏం చేయలేకపోతున్నారు. మిన్నకుండిపోవడం వారి వంతవుతోంది. చేసేది లేక పిల్లలను గదిలో ఒక మూలన కూర్చోబెట్టి పాఠాలు చెప్పాలి వస్తోంది. తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటోం దని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు ఎందుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
ఓర్నీ యాసాలో.. మళ్లీ మొదలెట్టేశార్రో..!
చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా.. ఎన్నో అనుమానాలు, సందేహాల మధ్య.. జీవీఎంసీలో కొందరు అధికారుల ‘పచ్చ’పాత కుట్రలతో ఎన్నికల్లో గట్టెక్కామనిపించుకున్న టీడీపీ నగర ఎమ్మెల్యేలు తమ పాత శైలినే అందిపుచ్చుకుంటున్నారు. తమ ట్రేడ్‌మార్క్ వెర్రివేషాలు, విన్యాసాలు మళ్లీ మొదలెట్టేశారు. అందులోనూ వెలగపూడి, వాసుపల్లిల ఓవర్ యాక్షన్ ఏపాటిదో నగర ప్రజలకు తెలియంది కాదు. ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడే వెలగపూడి..చీప్ ట్రిక్కులు, చిల్లర వేషాలతో వాసుపల్లి చేసే విన్యాసాలు నగర ప్రజలకు కొత్తకాదు. అధికార మదంతో ఇప్పటివరకు విర్రవీగిన వీరిద్దరినీ ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఇక నుంచైనా ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తారని, ప్రజలతో మమేకమవుతారని అందరూ ఆశించారు. కానీ తమ నైజం మారలేదని వారిద్దరు శనివారం నిరూపించారు. ఎన్నికల తర్వాత ఇంతవరకు ప్రజాక్షేత్రంలోకి రాని.. వారి సమస్యలు పట్టని వీరు.. తమ అధినేతను ఎక్కడో ఎయిర్‌పోర్టులో తనిఖీ చేసి అవమానించారంటూ గగ్గోలు పెడుతూ.. వీరావేశంతో చొక్కాలిప్పి గంతులేశారు. సాక్షి, విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే అదేదో మహాఅపరాధంలా టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై విమానాశ్రయాల భద్రత పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్)తోపాటు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెంటనే వివరణ కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్ష నేతలకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండని స్పష్టం చేశారు. పౌర విమానయాన శాఖ గైడ్‌లైన్స్ ప్రకారం విమానాశ్రయాల్లో చెక్ ఇన్ వద్ద తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రముఖుల జాబితా కూడా బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల్లో ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయినా సరే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో చంద్రబాబుకు అన్యాయం, అవమానం జరిగిందంటూ ఊదరగొడుతూ వచ్చాయి. ఇక విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి, వాసుపల్లిలైతే శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఎయిర్పోర్ట్ నిబంధనలు తెలియని పార్టీ శ్రేణులకు సర్దిచెప్పాల్సిన ఎమ్మెల్యేలే చొక్కాలిప్పేసి, గొంతుచించుకుని గగ్గోలు పెట్టారు.జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం చూసి టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ చీప్ ట్రిక్స్ మొదలెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును నిబంధనల మేరకు తనిఖీ చేసి అవమానించారని గొంతు చించుకుంటున్న టీడీపీ నేతలు.. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్జగన్మోహన్రెడ్డి ఈ నిబంధనలను గౌరవించి.. విమానాశ్రయాల్లో తనను తనిఖీ చేసేందుకు సహకరించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ.. టీడీపీ ఎమ్మెల్యేల వెకిలి వేషాలను ఏవగించుకుంటున్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..
సాక్షి, విశాఖపట్నం : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నాలుగు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 10వ తరగతిలో ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ విద్యా సంస్థల్లో రెండేళ్లపాటు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటివి బోధిస్తారు. ఈ రెండేళ్లు చదువును ఇంటర్మీడియెట్‌తో సమానంగా పరిగణించి.. ఆ తర్వాత ఇంటర్లో వచ్చే మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రాతిపదికన ఇంజినీరింగ్‌లో శాఖలను కేటాయించి నాలుగేళ్లపాటు విద్యనందిస్తారు ప్రవేశాల షెడ్యూల్ ఇదే.. ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఈ ఏడాది కొత్తగా 4 వేల మందికి సీట్లు లభించనున్నాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జూలై 1 వరకు ఆఖరు తేదీగా పరిగణించారు. వికలాంగ, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్సీసీ క్రీడా కోటాల వంటి ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీలను జూలై 1లోగా యూనివర్సిటీకి పంపాలి. ఇతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు ప్రింట్ ఔట్ కాపీలు పంపాల్సిన అవసరం లేదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూలై 14, 15వ తేదీల్లో నూజివీడులో నిర్వహిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా ఇతర అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను జూలై 23న ప్రకటిస్తారు. మొదటి విడతలో నూజివీడు, ఇడుపులపాయ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రవేశాలు ఆగస్టు 5, 6వ తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో నిర్వహిస్తారు. ఆగస్టు 7, 8వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ధ్రువపత్రాల పరిశీల న ఉంటుంది. ట్రిపుల్ ఐటీలలో వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ క్రీడల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల జాబితా జూలై 20న ప్రకటిస్తారు. వీరికి జూలై 24, 25, 26, 27వ తేదీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువపత్రాల పరిశీలన , ప్రవేశాలు క ల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్టు 9 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయి. ప్రవేశ విధానం ఇలా.. 2019 పదో తరగతిలో సాధించిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతి మండలానికి చెందిన విద్యార్థులకు ఈ ట్రిపుల్ ఐటీలలో అవకాశం కల్పిస్తారు. ఇడుపులపాయ, నూజి వీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో ఒక్కొక్క దానిలో 1000 మంది చొప్పున 4 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 85 శాతం సీట్లను ఆయా విశ్వవిద్యాలయాలు ట్రిపుల్ ఐటీల పరిధిలోని జిల్లాకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లలో ప్రతిభ ఆధారంగా ఏపీ, టీఎస్ రాష్ట్రాలకు చెంది న విద్యార్థులను ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు పంపాలి 2019లో ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో http://www.rgukt.in/ వెబ్సైట్లో జూలై 1లోగా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్లో 10వ తరగతి హాల్ టికెట్, మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి తల్లిదండ్రుల ఫొటోలను సమర్పించాలి. వికలాంగులు, సైనికుల పిల్లలు, ఎన్సీసీ, క్రీడ కోటా కింద ఎంపికైన వారు సంబంధిత అధికారులు ఇచ్చే ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు దరఖాస్తు ప్రింట్ ఔట్ కాపీలు, ఏపీ ఆన్లైన్ రసీదు, పైన పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలన్నింటినీ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ వారే గుంటూరు జిల్లా తాడేపల్లెలోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయానికి దరఖాస్తు ప్రింట్ పత్రాలు పంపాలి. వికలాంగులు, ఎన్సీసీ, సైనికుల పిల్లలు, క్రీడా కోటా కింద దరఖాస్తు చేస్తున్న వారు ఆన్లైన్లో దరఖాస్తులను ద కన్వీనర్, యూజీ అడ్మిషన్స్, 2019 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి, టెక్నాలజీస్, ప్లాట్ నంబర్ 202, సెకండ్ ఫ్లోర్, ఎన్ఆర్ఐ బ్లాక్ సి, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లె, గుంటూరు జిల్లా 522501, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు జూలై 1లోగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ఆన్లైన్లో పంపే దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకొని వారిని ప్రవేశాలకు ఎంపిక చేస్తారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఒకే దరఖాస్తు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు అభ్యర్థులు ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు, ఫీజు, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 150, ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు రూ.100, అదనంగా రూ.25 ప్రాసెసింగ్ ఫీజు చెల్లిం చాలి. నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రాధాన్యతను చూపుతూ ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ వారు మాత్రమే తమ రిజర్వేషన్ ప్రింట్ ఔట్లు, ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ చేసి వాటిపై విద్యార్థి సంతకంతో పంపాలి. దరఖాస్తులో మొదటి, రెండు, మూడు, నాలుగు ప్రాధాన్యాలను వెల్లడి చేస్తూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ట్రిపుల్ ఐటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్థులకు ఈ–మెయిల్, సెల్ఫోన్లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టల్ ద్వారా కూడా ఉత్తరం పంపుతారు. విద్యార్హతలు 2019లో పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 31 డిసెంబర్ 2019 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 21 ఏళ్లు. -
అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు
తగరపువలస ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేటు మార్కెట్ ఇది. కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రోజూ రూ.5 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఆశీలు రూపంలో నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ ఉండరు. సాయంత్రం ఆరు.. ఏడు గంటల తరువాత వ్యాపారులంతా దుకాణాలు కట్టేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆకతాయిలు చొరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తరువాత పెద్ద ఎత్తున అగ్నికీలలు చుట్టిముట్టి సర్వం బూడిదైంది. సాక్షి, తగరపువలస (భీమిలి) : ఇక్కడి ప్రైవేట్ మార్కెట్ గురువారం అర్ధరాత్రి తరువాత అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో 73 దుకాణాలు కాలి బూడిదైనట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం రూ. 47.29 లక్షల ఆస్తి నష్టం నష్టం సంభంవించినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో కాలిపోయిన వస్తువుల విలువే రూ.27.29 లక్షలు, షెడ్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో మొదలైన మంటలు తెల్లవారు జామున నాలుగు గంటల వరకు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ముందుగా మెయిన్ రోడ్డుకు చేరువలో ఉన్న తట్టలు, చాపలు అంటుకుని ఆరు లైన్లలో ఉన్న దుకాణాలను చుట్టుముట్టడంతో అగ్నికీలలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో కాయగూరలు, ఉల్లి, ఫ్యాన్సీ, గాజులు, అరటిపండ్లు, కోడిగుడ్లు, నూనె, కిరాణా, మిర్చి, పసుపు, కుంకుమ, చీపుళ్ల దుకాణాలు కాలిపోయాయి. ఒక్కో వ్యాపారి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేసిన పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఫైరింజన్లు శ్రమించినా.. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ సిబ్బంది తాళ్లవలస అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే నీరు అయిపోవడంతో నగరం నుంచి మరో ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. సమయానికి నీరు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కెట్‌ను మిర్చి, మసాలా కాలిన ఘాటు పొగతో నిండిపోయింది. దీంతో రెండు బాబ్కాట్లు, జేసీబీతో మార్కెట్లో బూడిద తరలించడానికి అంతరాయం ఏర్పడింది. తరచూ అగ్ని ప్రమాదాలు.. మార్కెట్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. వ్యాపారులకు సరైన గిడ్డంగి వసతులు లేకపోవడంతో దుకాణాల్లోనే సామగ్రి భద్రపరచుకుని వెళ్లిపోతుంటారు. ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న ఈ మార్కెట్‌కు ఆశీళ్ల రూపంలో రోజుకు రూ.40 వేలు, ఆదివారం సంత సమయంలో రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ప్రతిరోజు రూ.2 కోట్ల విలువైన వస్తువులు ఉంటున్నా ప్రయివేట్ యాజమాన్యం కాపలాదారులను ఉంచకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు రాత్రి 8 దాటితే మార్కెట్లో దుకాణాలను బార్లుగా మార్చేస్తుంటారు. తిని తాగి దుకాణాలపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా మందుబాబులే కారకులై ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
ఉత్సాహంగా ఎమ్మెల్యేల ప్రమాణం
సాక్షి,విశాఖపట్నం : నవ్యాంధ్ర రెండో శాసనసభ కొలువు తీరింది. బుధవారం నుంచి ప్రారంభమైన తొలి అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోడియం ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ సభ్యులు గెలుపొందగా.. మిగిలిన 11 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో ఆరుగురు తొలిసారి సభలో అడుగుపెట్టగా..ఒకరు మూడోసారి అడుగుపెట్టారు. మిగిలిన నలుగురు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇరువురు నాలుగోసారి సభలో అడుగుపెట్టగా, మిగిలిన ఇరువురు మూడోసారి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆపై అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. తొలిసారి సభలో అడుగుపెట్టిన వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సభలో అడుగు పెట్టగానే తొలుత ముఖ్యమంత్రిని, ఆ తర్వాత మంత్రులను,సహచర ఎమ్మెల్యేలను పలుకరిస్తూ అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించారు. వీరంతా తొలుత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే సమయంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సభలో తొలిసారి అడుగుపెట్టిన వారిలో నాగిరెడ్డి మినహా మిగిలిన వారంతా పిన్న వయస్కులే. ఇప్పటి వరకు బయట నుంచి చూసిన శాసనసభలో నేడు తాము సభ్యులు కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరంతా తమ కుటుంబ సభ్యులతో సభకు చేరుకున్నారు. వారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా విజిటర్స్గ్యాలరీ నుంచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఒకింత ఉద్విగ్నానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ ముగియగానే కుటుంబ సభ్యులతో ఆనందపరవశులయ్యారు. -
స్విమ్మింగ్ పూల్‌లో మునిగి బాలుడి మృతి
సాక్షి, అరకులోయ (విశాఖపట్నం) : విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. టూరిజంశాఖకు చెందిన స్థానిక హరితవేలి రిసార్ట్స్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు దిగిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగింది. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు, అతని భార్య,నాలుగేళ్ల కుమారుడు విహారయాత్రకు వచ్చి,మంగళవారం హరితవేలి రిసార్ట్స్‌లో బస చేశారు. మధ్యాహ్నం భోజన విరామంలో ఈనాలుగేళ్ల బాలుడు గది నుంచి బయటకు వచ్చి ఒంటరిగానే స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాడు. ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ వద్దకు తల్లిదండ్రులు వచ్చారు. ఈతకొడుతునే ఈ బాలుడు ఒక్కసారిగా నీట మునిగాడు.ఆ సమయంలో పర్యాటక సిబ్బంది,ఇతర అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఈ బాలుడు క్షణాల్లోనే మునిగిపోయాడు.తల్లిదండ్రులు చూస్తుండగానే ఈబాలుడు నీటమునిగి చనిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్విమ్మింగ్‌పూల్ నుంచి బాలుడిని బయటకు తీసి,స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ సంఘటనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు బాలుడు మృతదేహాన్ని ఓ ఆటోలో తరలించారు. స్థానిక పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయలేదు.హరితవేలి రిసార్ట్స్ మేనేజర్ అప్పలనాయుడు కూడా మృతిచెందిన బాలుడి వివరాలను బయటకు చెప్పడం లేదు. శ్రీకాకుళానికి చెందిన శంకరరావు పేరున రిసార్ట్స్‌లో ఓ గది బుక్ అయ్యింది.మిగతా వివరాలను టూరిజం అధికారులు గోప్యంగానే ఉంచారు. -
ఆ నాలుగూ అలా కొట్టేశారా ?
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రమంతటా కనీవినీ ఎరుగని రీతిలో వీచిన ఫ్యాన్ గాలికి బలమైన టీడీపీ కోటలన్నీ తుత్తునీయలయ్యాయి. విశాఖ జిల్లాలోనూ అదే ఉద్ధృతి.. మొత్తం గ్రామీణ జిల్లాతోపాటు విశాఖ శివారులోని మూడు నియోజకవర్గాల్లోనూ చతికిలపడిపోయిన అధికార టీడీపీ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం ఎలా నెగ్గుకురాగలిగిందన్న ఆశ్చర్యం, అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. మంత్రి హోదాలో ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు కేవలం 1800 ఓట్లతో బయటపడటం, దక్షిణంలోనూ 3893 ఓట్ల తేడాతో వాసుపల్లి గణేష్‌కుమార్ గట్టెక్కగా మిగిలిన పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నెగ్గుకురావడానికి కారణాలేమిటి?.. తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పటికీ సాగుతోంది.దీని వెనుక పెద్ద కుట్రే జరిగిందన్న వాదనలు తాజాగా బయటకొస్తున్నాయి. ఇందులో జీవీఎంసీ అధికారుల పాత్రపై బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఒకే ఒక్కడిపై ఇవన్నీ కేంద్రీకృతమవుతున్నాయి. జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు అధికారులు ఇళ్ల లబ్ధిదారులను దాదాపు బ్లాక్మెయిల్ చేసి టీడీపీకి ఓట్లు వేయించారని.. ఈ తతంగాన్ని సదరు ప్రాజెక్టు ముఖ్య అధికారి అంతా తానై నడిపించారని అంటున్నారు.ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని తలా రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టిన నగరంలోని సుమారు 40వేల కుటుంబాలను.. టీడీపీని గెలిపిస్తేనే ఇళ్లు వస్తాయని, లేదంటే మీరు కట్టిన డబ్బులు కూడా పోతాయని యూసీడీ అధికారులే బెదిరించి వారి చేత బలవంతంగా టీడీపీకి ఓట్లు వేయించినట్లు తెలుస్తోంది. ఇదే నగరంలో ఆ నలుగురు టీడీపీ అభ్యర్థులను ఓటమి నుంచి బయటపడేసిందంటున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నగరంలో టీడీపీకి మద్దతుగా జీవిఎంసీ యూసీడీ(అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్) ప్రాజెక్ట్ ముఖ్య అధికారి ఆధ్వర్యంలో పెద్ద తతంగమే నడిచిందని యూసీడీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. సదరు అధికారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్లకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సెలవులో వెళ్లిన ఆ అధికారి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆగమేఘాలపై రంగంలోకి దిగాడు. ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరితో మాట్లాడాడు. మీకు ఇళ్లు రావాలంటే టీడీపీకి ఓటు వేయాల్సిందేనని నిస్సిగ్గుగా ప్రచారం చేశాడు. ఒక విధంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి నుంచి అతగాడిది ‘పచ్చ’పాతమే టీడీపీ మాదే.. అని భావించే సామాజికవర్గానికి చెందిన ఆ అధికారి సోషల్ వెల్ఫేర్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 2016 నుంచి ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా పనిచేశారు. 2018లో బదిలీ అయినా ఇక్కడే కొనసాగుతూ వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూపుల రుణాలు, పింఛన్లు, ఇళ్ల మంజూరుతో పాటు కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. ఏడాది క్రితం ఈయన ఆధ్వర్యంలోనే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది. ఇదే అదునుగా ఎన్నికల ముందు నుంచి అప్పటి నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, గంటా శ్రీనివాసరావు, గణబాబులతో అతి సన్నితంగా ఉండేవారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వ్యూహం ప్రకారం నగరంలోని సుమారు 40 వేల మంది ఇళ్ల దరఖాస్తుదారుల చేత రూ.25 వేలు చొప్పున డీడీలు కట్టించేసుకున్నారు. ఆనక టీడీపీకి ఓటు వేస్తేనే ఇళ్లు ఇస్తామని.. లేదంటే మీ డీడీలు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగారు. తనకు తోడుగా మరో అధికారిని కూడా తెచ్చుకున్నారు. గతంలో జోన్–3 ,5లలో జోనల్ కమీషనర్‌గా పనిచేసిన ఆ అధికారి.. ఎన్నికలకు కొంతకాలం ముందు తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా నియమితలయ్యారు. అయితే యూసీడీ ముఖ్య అధికారి ఇక్కడ లేని పోస్టు సృష్టించి.. ఆ అధికారిని డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి హౌసింగ్ స్ఫెషల్ అధికారిగా నియమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినట్టల్లా అడుతూ దరఖాస్తుదారులను తీవ్రంగా ప్రభావితం చేసి ఓట్లు దండుకున్నారు. ఫలితాల అనంతరం బదిలీ తీరా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడంతో వారిలో భయం ఆవహించింది. నగరంలో తాము అనుకున్నది సాధించగలిగినా అధికారం టీడీపీ చేజారడంతో ఇక్కడే ఉంటే తమ బండారం బయట పడుతుందనే భయంతో సదరు యూసీడీ ముఖ్య అధికారి పలాయనం చిత్తగించారు. ఉన్న పళంగా బదిలీ చేయించుకుని మే 31న సాంఘిక సంక్షేమ శాఖకు వెళ్లిపోయారు. ఇదంతా జీవీఎంసీ ఉన్నతాధికారుల కనుసన్నుల్లోనే జరిగిందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. -
థాంక్యూ సీఎం సార్..
సాక్షి, సీతమ్మధార (విశాఖపట్నం) : మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆశ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలకు రూ.3 వేలు నుంచి రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఊహించలేదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 60 మంది ఆశ కార్యకర్తలు సోమవారం సీతమ్మధారలోని మళ్ల విజయప్రసాద్ క్యాంపు కార్యాలయంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఏ మేరకు హామీలు ఇచ్చారో హామీలు నేరవేరుస్తారనన్నారు. రానున్న వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు సోకే అవకాశాలున్న దృష్ట్యా ఆశ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్నారు. -
మన్యంలో కొండెక్కని అక్షరం!
సాక్షి, విశాఖపట్నం : మన్యంలో బడి ముఖం చూడని చిన్నారులు వందల సంఖ్యలో దర్శనమిస్తున్నారు. అక్షరం అక్కడ మచ్చుకైనా కనిపించదు. చిట్టిచేతులతో అక్షరాలు దిద్దాల్సిన పిల్లలు అడవి బాటపడుతున్నారు. గత సర్కార్ పాలనలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోవడంతో పిల్లలు అక్షర జ్ఞానానికి నోచుకోలేదు. బడి ముఖం చూడని చిన్నారుల మాదిరిగానే మధ్యలో బడి మానేసినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటప్పుడు, సెలవులకు ముందు మాత్రం డ్రాపౌట్లపై సిబ్బంది సర్వే చేసి అధికారులకు నివేదికలు ఇస్తారు. తరువాత ఆ విషయాన్ని మరచిపోతున్నారు. మళ్లీ అదే సర్వేలు.. అవే నివేదికలు. వారిని పాఠశాలకు తీసుకువచ్చే పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు లేని గ్రామాలు కొన్నింటిని ఎంపిక చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్‌ఆర్‌ఎస్‌టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చిలో మూసేస్తున్నారు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో నేటికీ చాలామంది చదువుకు దూరంగానే ఉన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మూడు సంవత్సరాల కిందట విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో మన్యంలో అసలు బడిముఖం చూడని పిల్లలు ఏడు వేలు దాటి ఉన్నట్టు తేలింది. అయితే వారిని బడిలో చేర్పించడం ఎలా అనేది మాత్రం అధికారులు తేల్చలేకపోయారు. చిన్నపిల్లలను గ్రామాలకు దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. అడవిలో కట్టెలు ఏరుతున్న డ్రాపౌటు పిల్లలు దీంతో బడికి వెళ్లాల్సిన చిన్నారులు తల్లిదండ్రులతో అడవికి వెళ్లడం, వ్యవసాయం చేయడం, పశువుల కాపర్లుగా మారిపోతున్నారు. కొన్ని చిన్న గ్రామాలుగా ఉంటే మరికొన్ని పెద్ద గ్రామాలుగా ఉన్నాయి. పెద్ద గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలు 15 మంది వరకు ఉంటున్నారు. వారిని దూరంగా ఉన్న ప్రాంతాలకు బడికి పంపడం లేదు. ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి చేర్చుకుంటున్నారు. అయితే ఒకటి రెండు తరగతులు చదివేందుకు వీలులేకుండా పోయింది. ఆ ఒకటి రెండు తరగతులు చదివేందుకు ఉపాధ్యాయులను వేయాలని కోరుతోన్నా స్పందించడంలేదు. ఏటా ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు నెలల తరువాత వాటిని ఎత్తేస్తున్నారు. ఆ పాఠశాలలు నడిపే సమయంలో విద్యార్థులకు భోజనం పెట్టడం లేదు. విద్యార్థులపై వివక్ష మారుమూల ప్రాంతాల్లో అధికంగా జీపీఎస్ (టీడబ్ల్యూ) మండల పరిషత్ ప్రాథమికక పాఠశాలలుంటాయి. రెండింటిలోను చదివేది గిరిజన విద్యార్థులే. అయినా అధికారులు మండల పరిషత్ పాఠశాలపై వివక్షత చూపుతున్నారనే విమర్శలున్నాయి. జీపీఎస్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్‌లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అందజేస్తున్నారు. మండల పరిషత్ విద్యార్థులకు అలాంటివి ఏమి అందించడం లేదు. దీనిపై అధికారులు చెప్పే సమాధానం విచిత్రంగా ఉంటుంది. జీపీఎస్ పాఠశాలలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయని, మండల పరిషత్ పాఠశాలలు వారికి సంబంధం లేదంటున్నారు. కాని చదివేది పేద విద్యార్థులన్న వాస్తవాన్ని విద్యాశాఖాధికారులు మరచిపోతున్నారు. గడచిన రెండేళ్లుగా ఈ వివక్ష కొనసాగుతోంది. -
హాట్ కేకుల్లా ఐపీఎల్ టిక్కెట్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ లీగ్ దశ పోటీలు ముగిశాయి. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు ఆతిథ్యమిచ్చిన వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఈసారి ఐపీఎల్ తుదిపోరుకు అర్హత సాధించే జట్టు ఎంపికకు వేదిక కానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్ల హోమ్ గ్రౌండ్లలోనే మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, ఎన్నికల కారణంగా వైఎస్సార్ స్టేడియంను ఆపద్ధర్మంగా నాకౌట్, క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విశాఖను వేదికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్ కూడా విశాఖలో జరగనున్నాయి. తొలిసారిగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన వైఎస్సార్ స్టేడియంలో మ్యాచ్‌లు రాత్రి ఏడున్నరకే ప్రారంభం కానున్నాయి. ఎలిమినేషన్ మ్యాచ్ 8న, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ 10న ఇక్కడ జరగనున్నాయి. ఫైనల్స్ జట్లను తేల్చేది ఇక్కడే 12వ సీజన్ ఐపీఎల్ టోర్నీ నాకౌట్ పోటీలు ఖరారయ్యాయి. తొలి క్వాలిఫయింగ్ రౌండ్ ఏడో తేదీన చెన్నైలో జరగనుంది. ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనున్నాయి. ఫైనల్ పోరు హైదరాబాద్‌లో జరగనుంది. ఐపీఎల్లో ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడిన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు పధ్నాలుగు మ్యాచ్‌లను లీగ్ దశలో ఆడింది. లీగ్ దశ శనివారంతో ముగిసింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లేఆఫ్‌కు చేరి నాకౌట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు చెన్నైలో జరిగే తొలి క్వాలిఫయింగ్ రౌండ్లో ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేషన్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ విశాఖలో జరగనుంది. లీగ్ చివర్లో సీఎస్కే, ఎంఐ జట్లు అంచనాలు తారుమారు చేశాయి. నిరుటి రన్నర్సప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పడిలేస్తూ నాలుగోస్థానంలో నిలిచేందుకు తంటాలు పడుతోంది. మరో జట్టు ఓటమి చెందితేనే ప్లేఆఫ్ ఆడే స్థాయిలో ఉంది. ఇక రెండో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో మొదటి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో ఎలిమినేషన్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆడనుంది. ఆ మ్యాచ్‌కూ విశాఖే ఆతిధ్యమివ్వనుంది. -
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
-
‘బాబు ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారు’
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు తన హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని, తన ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా.. అంగీకరించక చంద్రబాబు మరోచోట ప్రమాణం చేసేటట్లున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ ద్వారా డేటా చోరి జరిగిందన్న అంశం నిర్ధారణకు వచ్చిందని, దేశభద్రతకు నష్టం కలిగించేలా డేటా చోరీ జరిగిందన్నారు. ఇందులో టీడీపీ నేత ప్రమేయాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ గ్రిడ్స్-టీడీపీ మధ్య వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. ఆధార్ సంస్థ ఇప్పుడు అన్ని అంశాలు వెల్లడించిందని, ఐటీ మంత్రి లోకేష్ డేటా చోరికి పాల్పడ్డారని, తండ్రీకొడుకులు ఇద్దరు దేశద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ సంస్థను అప్రతిష్టపాలు చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేం లేదన్నారు. ఈవీఎంల విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేసేలా మాట్లాడుతున్న చంద్రబాబు.. ఇవే ఈవీఎంలతో 2014లో గెలవలేదా? అప్పుడు చంద్రబాబు ట్యాంపరింగ్ చేశారా? అని ప్రశ్నించారు. 2018లో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్ గెలిచిందని, మరి అక్కడ ట్యాంపరింగ్ ఎవరు చేశారన్నారు. నిరాదారమైన ఆరోపణలు చేస్తూ చంద్రబాబు.. ఓటమికి సాకులు ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. -
భీమిలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాస్ విస్తృత ప్రచారం
-
ప్రేమికుడే చంపేశాడు..!
సాక్షి,చోడవరం(విశాఖపట్టణం): మండలంలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని పద్మావతి(17) హత్య కేసులో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, జువైనల్‌హోంకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ కేవీ రమణ మీడియాకు తెలిపారు. ప్రియుడు రాజాప్రసన్నకుమార్ తన స్నేహితులు శ్రీనివాస్, సాయిశంకర్లతో కలసి పథకం ప్రకారం ఈ హత్య చేశాడని ఆయన చెప్పారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. పద్మావతి, ఆమె ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజా ప్రసన్నకుమార్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు గర్భవతి అయిన విషయం తెలుసుకున్న రాజాప్రసన్నకుమార్ అబార్షన్ చేయించుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి పద్మావతి నిరాకరించడంతో ప్రియుడు రాజాప్రసన్నకుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల సహకారంతో చోడవరం శివారులోని ఫారెస్టు డిపో సమీపంలోకి పద్మావతిని తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి, గొంతు నులిమి చంపాడు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 201,376,379, నిర్భయ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. -
శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడులు..
సాక్షి, విశాఖపట్నం : శీతల పానీయాల తయారీ కేంద్రంపై(ఖార్కాన్) బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అంతేకాక డ్రింక్స్ తయారీలో నాణ్యత పాటించలేదని అధికారులు గుర్తించారు. దీంతో కూల్ పాయింట్ నిర్వహకులపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివి.. జీవీఎంసీ పాయి మాధవ నగర్ పరిధిలో కృప ఏజెన్సీస్ పేరుతో పిల్లా శ్రీనివాస్ కూల్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. వివిధ రకాల డ్రింక్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. నాణ్యత ప్రమాణాలకు పాటించకుండా.. హానికరమైన రసాయనాలు వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. కూల్ పాయింట్లో శాంపిల్స్‌ను కూడా అధికారులు సేకరించారు. కూల్ డ్రింక్స్ తయారీలో నాణ్యత ప్రమాణాలను పాటించడంలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉంది, అయితే అతను నేరుగా బోర్ నీటిని వినియోగిస్తున్నాడని అధికారుల చెప్పారు. అలాగే ప్రజలకు హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్.. కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలిపి ఈ పానీయాలను తయారు చేస్తున్నట్టు ఈ దాడుల్లో బయటపడ్డాయి. ఏ విధమైన ఫిల్టరైజేషన్ నీరు వాడకుండా కలుషితమైన దోమలు, ఈగలు వాలిని నీటిని వాడుతూ కూల్ డ్రింక్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారని అధికారులు తెలిపారు. శీతల పానీయాలు తయారీ కేంద్రం నుంచి సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ రేటరీ పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుటామని అధికారులు చెప్పారు. కూల్ పాయింట్ నిర్వహకుడు పిల్లా శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ సీఎం నాయుడు తెలిపారు. -
పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర షెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతి పల్లె పల్లెకూ బస్సు యాత్ర షెడ్యూలును జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా కపాసా కుర్థిలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ పాదయాత్ర ప్రారభిస్తారని, తర్వాత 11 గంటలకు ఇచ్చాపురం పట్టణానికి ఆయన చేరుకుంటారని తెలిపారు. అనంతరం అక్కడ స్వేచ్చావర్తి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని, 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని వర్గాల ప్రజలతో స్వేచ్చావర్తి ఆలయం నుంచి సురంగి రాజా వారి గ్రౌండ్స్ వరకు పవన్ కళ్యాణ్ నిరసన కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం సురంగి రాజావారి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని తెలిపారు. -
‘బాబు పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు’
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఆయన పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ పట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్రలో ఆయన మాట్లాడారు. ‘సంఘీభావ యాత్రలో సమస్యలన్నింటిపై ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి, పార్టీ దృష్టికి తీసుకువస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా భాగస్వామ్యులై, చేస్తున్న అక్రమాలు, అన్యాయాల పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల రూపాయిలు అవినీతికి పాల్పడ్డారు. అన్ని ప్రభుత్వ పనుల్లో, ప్రాజెక్టుల్లో ధనార్జనే ధ్యేయంగా సాగించిన ముఖ్యమంత్రి, నాలుగేళ్ళు బీజేపీతో జతకట్టారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకుని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, వైఎస్సార్సీపీ బీజేపీ తో జతకట్టిందని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు, ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి, స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు. ఇటువంటి వ్యక్తి, ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా, నేను బీజేపీతో పోరాడుతా, యుద్ధం చేస్తా, మీరంతా కలసి రండంటూ మభ్యపెట్టి, బీజేపీపై బురద జల్లుతూ, తన వైఫల్యాలను ఇతర పార్టీల మీద వేస్తున్నాడు. బీజేపీతో పొత్తు లేదు.. ప్రత్యేక హోదో ఎవరిస్తే.. వైస్సార్సీపీతో జత కట్టమని బీజేపీ అధికారప్రతినిధే స్పష్టం చేశారు. వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు సైతం ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలిపారు. మా సిద్దాంతం ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వారితో కలిసి పనిచేస్తాం అని చెప్పాం. చంద్రబాబు ఒక దొంగ. మూడు లక్షల కోట్ల రూపాయిలు ప్రజాసొమ్మును దోచుకున్న వ్యక్తి, దొంగకాక ఏమవుతాడు. దొంగ ఎక్కడ దాక్కున్నా, దొంగ దొంగే. చట్టానికి లోబడి, చట్టపరిధిలోకి తీసుకువచ్చి శిక్షించాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాలకు తరలించిన మూడు లక్షల కోట్ల రూపాయలు, తిరిగి తీసుకువచ్చి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి. ఆ సొమ్ము తో అద్భుతమైన రాజధాని కట్టుకోవచ్చు. అవినీతికి పాల్పడి, బీజేపీకి భయపడి, ప్రజలను సాగిలపడి వేడుకునే పరిస్థితి చంద్రబాబుది. ఈ పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో, ప్రజలంతా ఎన్నికలు ఎపుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. తగిన బుద్దిచెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈ నెల 22న విశాఖ లో ధర్మపోరాట దీక్ష అట. ఎవరి మీద పోరాటంచేస్తాడు. ఇది ధర్మ పోరాటం కాదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇతర పార్టీలపై నింద వేయడానికే ఈ సభలు పెడుతున్నారు. రాష్ట్రంలో ని 13జిల్లాల్లో ఎక్కడ నిర్వహించినా, జన సమీకరణ చేసి, అధికార దుర్వినియోగం చేసి ప్రజలను తీసుకువస్తున్నాడే తప్పా, స్వచ్చందంగా చంద్రబాబు సభలకు వచ్చే పరిస్థితులు లేదన్నది స్పష్టం.’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ కారును నడిపిన విశాఖ కలెక్టర్
-
ఎలక్ట్రిక్ కారును నడిపిన తొలి కలెక్టర్
సాక్షి, విశాఖ : దేశంలోనే ప్రథమంగా ఎలక్ట్రికల్ కారును విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినియోగించారు. బుధవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి స్వయంగా కారు నడుపుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. -
వైజాగ్, విజయవాడలో ఏసీబీ సోదాలు
-
వైజాగ్, విజయవాడలో ఏసీబీ సోదాలు
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం సోదాలు చేసింది. విశాఖపట్టణం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎన్ వీ రఘు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము రంగంలోకి దిగినట్లు అధికారులు చెబుతున్నారు. రఘు బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళగిరి, విజయవాడ, షిర్డీ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్టణం, రాజానగరం(తూ.గో.) ఇలా ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద మొత్తంలోనే రఘు ఆస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో కూడా... విజయవాడలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపరిండెంట్ నల్లూరి వెంకటశివప్రసాద్ నివాసంలో సోమవారం ఉదయం ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడతోపాటు గన్నవరంలోగల ఆయన ఇళ్లలో కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా కోట్లు విలువ చేసే ఆస్తులను ఆయన కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ తెలిపింది. -
మంత్రి కార్యాలయం ముట్టడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పుట్ పాత్లపై వ్యాపారుల తోపుడు బళ్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని కోరుతూ ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా అధికారులు బళ్లను తొలగించారని వారు మండిపడ్డారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యాపారులకు సూచించారు.