వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఆయన పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. విశాఖ పట్టణంలోని దక్షిణ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్రలో ఆయన మాట్లాడారు.
‘సంఘీభావ యాత్రలో సమస్యలన్నింటిపై ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి, పార్టీ దృష్టికి తీసుకువస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా భాగస్వామ్యులై, చేస్తున్న అక్రమాలు, అన్యాయాల పట్ల ప్రజలు కోపంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మూడు లక్షల కోట్ల రూపాయిలు అవినీతికి పాల్పడ్డారు. అన్ని ప్రభుత్వ పనుల్లో, ప్రాజెక్టుల్లో ధనార్జనే ధ్యేయంగా సాగించిన ముఖ్యమంత్రి, నాలుగేళ్ళు బీజేపీతో జతకట్టారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకుని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, వైఎస్సార్‌సీపీ బీజేపీ తో జతకట్టిందని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు, ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి, స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నారు. ఇటువంటి వ్యక్తి, ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా, నేను బీజేపీతో పోరాడుతా, యుద్ధం చేస్తా, మీరంతా కలసి రండంటూ మభ్యపెట్టి, బీజేపీపై బురద జల్లుతూ, తన వైఫల్యాలను ఇతర పార్టీల మీద వేస్తున్నాడు.
బీజేపీతో పొత్తు లేదు.. ప్రత్యేక హోదో ఎవరిస్తే..
వైస్సార్‌సీపీతో జత కట్టమని బీజేపీ అధికారప్రతినిధే స్పష్టం చేశారు. వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు సైతం ఏ పార్టీతో పొత్తు ఉండదని తెలిపారు. మా సిద్దాంతం ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వారితో కలిసి పనిచేస్తాం అని చెప్పాం. చంద్రబాబు ఒక దొంగ. మూడు లక్షల కోట్ల రూపాయిలు ప్రజాసొమ్మును దోచుకున్న వ్యక్తి, దొంగకాక ఏమవుతాడు. దొంగ ఎక్కడ దాక్కున్నా, దొంగ దొంగే. చట్టానికి లోబడి, చట్టపరిధిలోకి తీసుకువచ్చి శిక్షించాలని చట్టం స్పష్టంగా చెబుతోంది. కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాలకు తరలించిన మూడు లక్షల కోట్ల రూపాయలు, తిరిగి తీసుకువచ్చి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి. ఆ సొమ్ము తో అద్భుతమైన రాజధాని కట్టుకోవచ్చు. అవినీతికి పాల్పడి, బీజేపీకి భయపడి, ప్రజలను సాగిలపడి వేడుకునే పరిస్థితి చంద్రబాబుది. ఈ పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో, ప్రజలంతా ఎన్నికలు ఎపుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. తగిన బుద్దిచెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈ నెల 22న విశాఖ లో ధర్మపోరాట దీక్ష అట. ఎవరి మీద పోరాటంచేస్తాడు. ఇది ధర్మ పోరాటం కాదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇతర పార్టీలపై నింద వేయడానికే ఈ సభలు పెడుతున్నారు. రాష్ట్రంలో ని 13జిల్లాల్లో ఎక్కడ నిర్వహించినా, జన సమీకరణ చేసి, అధికార దుర్వినియోగం చేసి ప్రజలను తీసుకువస్తున్నాడే తప్పా, స్వచ్చందంగా చంద్రబాబు సభలకు వచ్చే పరిస్థితులు లేదన్నది స్పష్టం.’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment