పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర  షెడ్యూల్‌ | Janasena Pawan Kalyan Bus Yatra Schedule | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర  షెడ్యూల్‌

Published Sat, May 19 2018 4:54 PM | Last Updated on Sat, May 19 2018 6:11 PM

Janasena Pawan Kalyan Bus Yatra Schedule - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతి పల్లె పల్లెకూ బస్సు యాత్ర షెడ్యూలును జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా కపాసా కుర్థిలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్‌ పాదయాత్ర ప్రారభిస్తారని, తర్వాత 11 గంటలకు ఇచ్చాపురం పట్టణానికి ఆయన చేరుకుంటారని తెలిపారు.

అనంతరం అక్కడ స్వేచ్చావర్తి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని, 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని వర్గాల ప్రజలతో స్వేచ్చావర్తి ఆలయం నుంచి సురంగి రాజా వారి గ్రౌండ్స్‌ వరకు పవన్‌ కళ్యాణ్‌ నిరసన కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం సురంగి రాజావారి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement