Addepalli Sridhar
-
మౌనం ఎందుకు చంద్రబాబు..? అద్దేపల్లి శ్రీధర్ కామెంట్స్
-
జనసేనకు భారీ షాక్
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, జనసేన కోశాధికారిగా పనిచేస్తున్న మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం పవన్ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీడీపీతో జనసేన రహస్య సంబంధాలు నచ్చకే పార్టీని రాఘవయ్య వీడినట్టు జనసేనలో ప్రచారం జరుగుతోంది. రాఘవయ్యతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు రాక మునుపే నాయకుల వరుస రాజీనామాలు జనసేన పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిని పట్టించుకోకుండా, కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడం వల్లే సీనియర్ నేతలు వెళ్లిపోవడానికి కారణమన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. తనను పట్టించుకోకపోవడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. -
పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర షెడ్యూల్
సాక్షి, విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రతి పల్లె పల్లెకూ బస్సు యాత్ర షెడ్యూలును జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా కపాసా కుర్థిలో గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ పాదయాత్ర ప్రారభిస్తారని, తర్వాత 11 గంటలకు ఇచ్చాపురం పట్టణానికి ఆయన చేరుకుంటారని తెలిపారు. అనంతరం అక్కడ స్వేచ్చావర్తి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని, 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్ని వర్గాల ప్రజలతో స్వేచ్చావర్తి ఆలయం నుంచి సురంగి రాజా వారి గ్రౌండ్స్ వరకు పవన్ కళ్యాణ్ నిరసన కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం సురంగి రాజావారి గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని తెలిపారు. -
లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి
-
లోకేశ్‌పై మరో బాంబు పేల్చిన జనసేన
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై జనసేన మరో బాంబు పేల్చింది. మంత్రి లోకేశ్ అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం లోకేశ్ అవినీతికి సంబంధించి తనకు అన్ని వ్యవహారాలు తెలుసునని, ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్ అవినీతి భాగోతం తమకు తెలుసునంటూ జనసేన నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి.