ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు | RTC bus fell under the Youth serious injuries | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

Published Tue, Mar 3 2015 2:49 AM | Last Updated on Fri, Oct 5 2018 8:51 PM

ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు - Sakshi

ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడికి తీవ్రగాయాలు

చేవెళ్ల ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సంఘటన
చేవెళ్ల రూరల్: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం అలంపల్లి గ్రామానికి చెందిన పి.యాదగిరి అనే యువకుడు ఆటో నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ఓ పని నిమిత్తం నగరానికి వెళ్లేందుకు వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఎక్కాడు. కాగా బస్సు సాయంత్రం చేవెళ్ల బస్‌స్టేషన్‌కు చేరుకుంది.

చేవెళ్లలో బస్ దిగేసమయంలో ఫుట్‌బోర్డుకు దగ్గరలో ఉన్న ఆ యువకుడు కిందికి దిగి మళ్లీ బస్సు ఎక్కుతున్న సమయంలో అతడి చెప్పు ఊడిపోయి కిందపడిపోయింది. దీంతో చెప్పును తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా.. అప్పటికే కదిలిన బస్సు ముందు టైరు కింద పడిపోయాడు. దీన్ని గమనించని డ్రైవర్ బస్సును వెనక్కి తీయటంతో ఆ యువకుడి పైకి ఎక్కింది. దీంతో త్రీవంగా గాయపడిన యువకుడిని 108లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement