
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో మంటలు
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మంజు థియేటర్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. థియేటర్ పరిసర ప్రాంతంలో ఉన్న ఓ చెప్పుల షో రూమ్‌లో భారీగా మంటలు ఎగడిపడుతున్నాయి. దీంతో స్థానికులు, చుట్టుపక్కల షాపుల వాళ్లు భయాందోళనతో పరుగులు తీశారు. భవనం మొత్తం మంటల్లో ఉందని కొందరు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.