కీళ్ల వ్యాధులపై అవగాహన ర్యాలీ
నెల్లూరు(అర్బన్): ఈ నెల 12న వరల్డ్ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని అపోలో స్పెషాల్టీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎముకల వ్యాధులు, రుమాటిక్, కండరాలకు సంబంధించిన కీళ్ల వ్యాధులపై అవగాహన కల్పిస్తూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడారు. ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల కీళ్ల నొప్పుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఇలాంటి వ్యా«ధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఆస్పత్రి ప్రముఖ సీనియర్ ఎముకల వ్యాధి నిపుణుడు మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో కీళ్లనొప్పులు తగ్గక అనేక మంది పడరాని కష్టాలు పడేవారని, ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఎలాంటి కీళ్లనొప్పులనైనా అ«ధునాతన వైద్యం ద్వారా నయం చేస్తున్నామన్నారు. డాక్టర్లు వివేకానందరెడ్డి, మీరావలి, యూనిట్ హెడ్ నవీన్, లయన్స్, రోటరీ క్లబ్, షార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, జైన్ హబ్ అసోసియేషన్, చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.