అపోలో ఆధ్వర్యంలో సీఎంఈ
-
అపోలో గ్రూప్స్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి
నెల్లూరు(అర్బన్):
అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శనివారం దర్గామిట్టలోని హోటల్ మినర్వా గ్రాండ్‌లో పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజిపై జాతీయ స్థాయి సీఎంఈ (కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ డాఽక్టర్ ప్రీతారెడ్డి మాట్లాడతూ వైద్య రంగంలో క్లినికల్ న్యూరాలజీ సేవలు కీలకమన్నారు. స్ట్రోక్, పక్షవాతం, నరాల సమస్యలు, కేన్సర్ తదితర సమస్యల్లో క్లినికల్ న్యూరాలజీ గ్రూపు సేవలు అవసరమన్నారు. ఈ వైద్య సేవలన్నీ నెల్లూరు నగరంలో అందుబాటులోకి తెచ్చామన్నారు. థ్రాంబోలిసస్ చికిత్స తదితర అంశాల గురించి వివరించారు. ఇక్కడ అపోలో ఆస్పత్రిలో డాక్టర్ బిందు మీనన్ ప్రారంభించిన న్యూరో సైన్సు కోర్సు వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సెమినార్‌కు దేశంలోని పలు ప్రాంతాలనుంచి 180 మంది డాక్టర్లు , 18 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు హాజరయ్యారని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె కోలుకుంటుందని తెలిపారు. కార్యక్రమానికి న్యూరాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ బిందుమీనన్, త్రివేండ్రమ్ నుంచి డాక్టర్ మధుసూదనన్, వైజాగ్ నుంచి డాక్టర్ వెంకటేశ్వర్లు, మధురై నుంచి డాక్టర్ జయకుమార్, చెన్నై నుంచి డాక్టర్ మీనాక్షిసుందరం, నెల్లూరు అపోలో యూనిట్ హెడ్ నవీన్ హాజరయ్యారు.