మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్ | Eating grapes reduces knee pain | Sakshi
Sakshi News home page

మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్

May 10 2014 1:50 PM | Updated on Sep 2 2017 7:11 AM

మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్

మోకాలి నొప్పికి ద్రాక్షతో చెక్

మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజూ మీరు తీసుకునే ఆహారంలో ద్రాక్ష పళ్లను తీసుకోండి. మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది.

న్యూయార్క్: మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజూ మీరు తీసుకునే ఆహారంలో ద్రాక్ష పళ్లను తీసుకోండి. మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ప్రతి రోజూ ద్రాక్ష తినడం వల్ల నరాలు, కీళ్లలో పటుత్వం పెరిగి మోకాలి నొప్పిని తగ్గడానికి ఉపయోగపడుతుందని ఓ పరిశోధనలో తేలింది. ద్రాక్షలో పోలీపినాల్స్ ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల కీళ్లలో పటుత్వం పెరగడంతో పాటు మోకాలి నొప్పిని తగ్గిస్తుందని అమెరికాలోని టెక్సాస్ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షానిల్ జుమా తెలిపారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న 72 మంది పురుషులు, మహిళలపై పరిశోధనలు నిర్వహించినట్టు వివరించారు. రోజూ ద్రాక్ష తినడం వల్ల వారి సమస్యలు నయమైనట్టు గుర్తించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement