
వీటిని తిన్న వెంటనే అస్సలు నీళ్లు తాగొద్దు! ఎందుకంటే..
కొందరు వైద్యులు మంచినీళ్లు బాగా తాగమని చెబుతుంటారు. ఇంకొందరు అంత ఎక్కువగా తాగవద్దని చెబుతారు. అయితే కొన్ని పదార్థాలు తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని పెద్దవాళ్లు చెబుతుంటారు. దీని వెనుక మనలో చాలా మందికి తెలియని కారణం ఉంది. ఇంతకీ మనం ఏయే పదార్థాలు తీసుకున్న తర్వాత నీరు తాగకుండా ఉండాలో తెలుసా మరి?
►అరటిపండు.. ఆయుర్వేదం ప్రకారం, పండ్లను తీసుకున్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తుంది. మరి అరటిపండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీళ్లు తాగకపోవడానికి ఇదే కారణం.
►పుచ్చకాయ: నీటిశాతం అధికంగా ఉండే వాటిలో పుచ్చకాయదే ప్రముఖ స్థానం. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగడం ద్వారా సహజంగా ఊరే జీర్ణరసాలు పలుచన అవుతాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరంగా మారుతుంది. కడుపు నొప్పి లేదా అజీర్ణంతో బాధపడ వలసి వస్తుంది.
►పాలు: పాలు తాగిన తర్వాత నీళ్లు తినకూడదు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కూడా దారి తీస్తుంది.
►సిట్రస్ జాతి ఫలాలు తిన్న తర్వాత... నారింజ, ఉసిరి, సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ నుండి యాసిడ్ బయటకు వస్తుంది. ఈ పండ్లను తిన్న తర్వాత మనం నీరు తాగితే, పిహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందుకే సిట్రస్ పండ్లు తిన్న తర్వాత మనం నీరు తాగకూడదు.
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే.
చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా..
Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!