
అవి తింటే రెండువారాల్లో ఒత్తిడి మాయం
రోజూవారీ ఆహారంలో తగినన్ని కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా రెండు వారాల్లో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట.
రోజూవారీ ఆహారంలో తగినన్ని కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా రెండు వారాల్లో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చట. కాయగూరలు, పండ్లలో ఉండే ఆరోగ్యకరమైన విటమిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయని ఒటాగో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సైకలాజికల్ గా ఆ వ్యక్తి చాలా ధృడంగా తయారవుతారని తమ పరిశోధనల్లో తేలినట్లు తెలిపారు. అప్పటివరకూ ఉన్న బాధలన్నీ కేవలం రెండే వారాల్లో పూర్తిగా మాయమవుతాయని వెల్లడించారు. 18 నుంచి 25 సంవత్సరాలు వయసున్న 171మందిపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయంపై ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.