డ్యునెడిన్ (యూనివర్సిటీ ఓవల్)
నగరానికి పేరు తెచ్చిన ఒటాగో యూనివర్సిటీలో ఈ స్టేడియం ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు దీని సొంతం. ఈ స్టేడియం అభిమానులకు చాలా అనుకూలంగా ఉంటుంది. సుందరమైన పచ్చిక బయళ్లు, అద్భుతమైన దృశ్యాలు, నాణ్యమైన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. 2000కు ముందు ఈ స్టేడియాన్ని గణనీయంగా మెరుగుపర్చారు. క్రికెట్‌ను ఆస్వాదించడానికి ఈ స్టేడియం చాలా అద్భుతంగా ఉంటుంది.
సెంట్రల్ ఈస్ట్రన్ ఒటాగోలో ఈ నగరం ఉంది. ఈ నగరం చుట్టూ లోయలు, కొండలు, గుహలు ఉంటాయి. పసిఫిక్ సముద్రానికి దగ్గరగా ఉండటంతో అందమైన బీచ్‌లు ఉన్నాయి. స్కాట్లాండ్ నుంచి వలసదారులు దీన్ని గోల్డెన్ మైనింగ్ ప్రాంతంగా మార్చారు. డునెడిన్‌లో ఉన్న ఒటాగో యూనివర్సిటీ కివీస్‌లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి (1869)విశ్వవిద్యాలయం. ఈ స్టేడియం సామర్థ్యం 6 వేలు.