వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
* జిల్లాలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
* పేదలకు పండ్లు, రొట్టెలు పంపిణీ
* విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల వితరణ
ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారుు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవాలయాలు, చర్చిల్లో నాయకులు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. నర్సాపురం పట్టణంలోను, మొగల్తూరు గ్రామంలోను మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకి రామ్, కొత్తపల్లి నానిల ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
పట్టణంలో రుస్తుంబాద నుంచి స్టీమర్‌రోడ్ వరకు 200 మోటార్ బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. స్టీమర్ రోడ్ జంక్షన్‌లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి, పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు రొట్టెలను నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తానేటి ప్రసాద్, సాయినాధ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ హనుమాన్‌నగర్‌లో లెప్రసీ కాలనీలో కేక్‌ను కోసి, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, దిరిశాల వరప్రసాద్‌రావు, కార్పొరేటర్ బండారు కిరణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
నగరంలో పేదలకు పలువురు నేతలు బియ్యం పంపిణీ చేశారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో పార్టీ సామాన్య కార్యకర్త విజయ పిల్లలకు కేక్‌క ట్ చేసి జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పెంటపాడు మండలంలో మల్లిపూడి జాయ్‌బాబు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఉంగుటూరులో గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ముప్పన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 200 పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో నియోజకవర్గ కన్వీనర్ చీర్లరాధయ్య ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు.
పార్టీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రేమాన్విత మానసిక వికలాంగుల పాఠశాలలో పార్టీ నాయకులు కేక్‌కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఆచంట టౌన్‌లో జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. నాయకులు ైవె ట్ల కిషోర్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ ముప్పాల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. కొవ్వూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత కేక్‌కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రిలోని బాలింతలు, రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.
గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పార్టీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా ఏఎంసీ మాజీ చైర్మన్‌లు కేవీవీకె దుర్గారావు, ఎం.రాజేంద్రబాబు, ఎంపీటీసీ గన్నమని జనార్ధనరావులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం చర్చిలో నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొయ్యలగూడెం సర్పంచ్ గంజిమాలదేవి, నాయకులు తాడికొండ మురళీ, జి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. చింతలపూడి, ప్రగడవరం, వెలగలపల్లి గ్రామాల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ మారిశెట్టి జగన్, మాజీ ఏఎంసీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావులు కేక్‌కట్ చేశారు.
జగన్‌కు వెన్నుదన్నుగా నిలవాలి
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన ఒంటరిగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయనకు ప్రజలు సహకారమందించాలని, వెన్నుదన్నుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక రెస్ట్‌హౌస్‌రోడ్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. పేద మహిళలకు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. నాయకులు గ్రంధి వెంకటేశ్వరరావు, రాయప్రోలుశ్రీనివాసమూర్తి, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, కోడే యుగంధర్ పాల్గొన్నారు.