సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: ఐస్ యాపిల్‌గా పేరుగాంచిన తాటి ముంజల సీజన్ మొదలైంది. కూడళ్లలో ముంజల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎర్రటి ఎండలో ముంజల్ని ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉండే ద్రవ పదార్థాన్ని ఇష్టంగా లాగించేస్తున్నారు. లేత ముంజలకు రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. నగరంలోని జీటీరోడ్‌లో విక్రయాల్ని చిత్రాల్లో చూడొచ్చు.
చదవండి: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో!
వేసవి వరం..
♦తాటిముంజలు వేసవి వరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు.
అజీర్తిని తగ్గించే గుణందీని సొంతం.
♦బరువు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది.
♦లేతముంజల్ని తింటే ఉపయోగం.
♦డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది.
♦బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్ వంటివి రాకుండా కాపాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment