thati munjelu
-
సమ్మర్ యాపిల్.. గిరాకీ సూపర్!
ప్రకాశం (కొనకనమిట్ల) : సమ్మర్ యాపిల్‌గా పేరొందిన తాటి ముంజల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొనకనమిట్ల మండలం గొట్లగట్టు, హనుమంతునిపాడు, జె.పంగులూరు, కొత్తపట్నం మండలం ఈతముక్కల తదితర ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న తాటి తోపులు వందలాది కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టు, బ్రాహ్మణపల్లి, నాయుడుపేట, చినమనగుండం, వింజవర్తిపాడు, దాసరపల్లి, సలనూతల, మర్రిపాలెం తదితర గ్రామాలకు చెందినవారు తాటి ముంజలు సేకరిస్తూ హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గొట్లగట్టు కేంద్రంగా సుమారు 300 కుటుంబాలు ఉపాధి పొందుతుండగా, బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రతి కుటుంబం తాటి ముంజలు సేకరించి విక్రయించడం విశేషం. ఈ గ్రామంలో 14 ఏళ్లలోపు పిల్లలు కూడా హుషారుగా తాటి చెట్లు ఎక్కి అవలీలగా కాయలు దించేయడంలో దిట్టలు. కాయల నుంచి ముంజలు తీస్తూ.. మూడు నెలలే ఉపాధి తాటి ముంజల సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అలవాటైన పని కావడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పెద్దగా ఇబ్బందేమీ లేదని ముంజల సేకరించేవారు చెబుతున్నారు. వేసవిలో మూడు నెలలపాటు సాగే తాటి ముంజల వ్యాపారంలో ఒక్కో కుటుంబం నెలకు రమారమీ రూ.40 వేలు సంపాదిస్తోంది. తెల్లవారుజామునే తాటి తోపులకు వెళ్లి కాయలు సేకరించడం.. గ్రామాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం ముంజల వ్యాపారుల దినచర్య. ప్రస్తుతం వీరంతా హోల్‌సేల్‌గా కాయలు విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. గొట్లగట్టు బస్టాండ్‌లో ముంజల వ్యాపారం కొందరు చిరు వ్యాపారులు మాత్రం ముంజలు తీసి వినియోగదారులకు అమ్ముతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, పోరుమామిళ్ల, మార్కాపురం, ఒంగోలు, కొమరోలు, గిద్దలూరు, దొనకొండ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు గొట్లగట్టు పరిసర ప్రాంతాల్లో ముంజలు హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా నుంచి 20 మంది వ్యాపారులు గొట్లగట్టు నుంచి ముంజలు తీసుకెళ్లి పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరులో విక్రయిస్తున్నారు.కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి తాటి ముంజల వ్యాపారం ఆటోలు, మోటార్ సైకిళ్లపైనే సాగుతోంది. తాటి చెట్టుకు విరగకాసిన కాయలు ఉపయోగాలివే.. ► వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహార్తి తీరక త్వరగా అలసిపోయేవారు తాటి ముంజలు తినడం ద్వారా చలాకీగా ఉంటారు. ► ఎక్కువగా ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముంజలు ఎంతగానో ఉపకరిస్తాయి. ► అజీర్తి సమస్యతో బాధపడేవారు లేత ముంజలు తింటే ఎసిడిటీ దూరమవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ► తాటిముంజల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ► ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. -
Summer Drinks: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
Summer Drinks- Thati Munjala Smoothie: ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి. అనారోగ్యాలను దరిచేరనియ్యవు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. మండే ఎండల్లో ముంజల స్మూతీ తాగితే వడదెబ్బకు గురికారు. చురుక్కుమనే ఎండల వల్ల చర్మం పై ఏర్పడే చెమటకాయలు, దద్దుర్లు రావు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. పాలిచ్చే తల్లులుకు దీనిని తాగితే పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఫలితంగా తల్లిపాల నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ జ్యూస్‌లోని పుష్కలమైన ఖనిజ పోషకాలు, విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ముంజల స్మూతీ తయారీకి కావలసినవి తాటి ముంజలు – ఆరు, కాచిన చల్లటి చిక్కటి పాలు – రెండు కప్పులు, పంచదార – మూడు టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జాగింజలు – టేబుల్ స్పూను. తయారీ: ►ముందుగా తాటిముంజలను తొక్కలు లేకుండా శుభ్రం చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ►మిక్సీజార్‌లో పాలు, పంచదార వేసి నిమిషం పాటు గ్రైండ్ చేయాలి ►ఇప్పుడు పాలమిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకున్న తాటిముంజల మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో సబ్జాగింజలు వేసి చక్కగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾 Muskmelon Mojito Health Benefits: కొవ్వులు తక్కువ.. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చాలా మంచిది! Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
వేసవిలో మాత్రమే కనిపించే సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. ఇవి చూసేందుకు చిన్నవైనా పోషకాల్లో మెండు. మండుతున్న ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే దివ్య ఔషధం. ప్రకృతి వరప్రసాదంగా మారి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఎండలు మండుతుండడంతో ప్రజలు పండ్లు, పానీయాలు సేవిస్తుంటారు. కానీ వేసవిలో మాత్రమే లభించే ముంజలు తప్పక తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా మామిడి, పుచ్చకాయ, జామ, ఖర్బూజా ఇలా అనేక రకాల పండ్లు, పానీయాలు తీసుకుంటుంటారు. కానీ వీటిని మించి పోషకాలు ముంజల్లో ఉంటుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి ఉంటుండడంతో వీటిని పట్టణాలకు తరలించి పలువురు ఉపాధి పొందుతున్నారు. నగరంలో వ్యాపారం గ్రామాల్లో తాటి ముంజల ఉపాధి మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రధాన రహదారుల వెంట తాటి ముంజలు కనిపించని చోటు లేదు. ఆటోల్లో నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. పలువురు వ్యాపారులు నగరం నుంచి వచ్చి పల్లెల్లో గీత కార్మికుల వద్ద ముంజలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. వీటి ధర సుమారు రూ.100 నుంచి 150 వరకు ఉంది. చాలా మంది గీత కార్మికులు, ముదిరాజ్ కులస్తులు కుటుంబ సభ్యులు నగరంలో జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. చదవండి👉🏾 Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే పోషకగని తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బీ, సీతో పాటు ఐరన్, జింక్ , పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపుతాయి. దీంతో శరీరం శుభ్రమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటడంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండ వలన కలిగ ఆలసట నీరసాన్ని దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పని చేస్తాయి. వీటిని తరుచుగా తినడం వలన జీర్ణక్రీయ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు. మొటిమలను తగ్గించడంలోను మంజలు పని చేస్తాయి. వీటిని గర్భిణులు ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. -
Photo Feature: వీటిని తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: ఐస్ యాపిల్‌గా పేరుగాంచిన తాటి ముంజల సీజన్ మొదలైంది. కూడళ్లలో ముంజల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎర్రటి ఎండలో ముంజల్ని ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉండే ద్రవ పదార్థాన్ని ఇష్టంగా లాగించేస్తున్నారు. లేత ముంజలకు రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. నగరంలోని జీటీరోడ్లో విక్రయాల్ని చిత్రాల్లో చూడొచ్చు. చదవండి: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! వేసవి వరం.. ♦తాటిముంజలు వేసవి వరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు. అజీర్తిని తగ్గించే గుణందీని సొంతం. ♦బరువు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది. ♦లేతముంజల్ని తింటే ఉపయోగం. ♦డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది. ♦బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్ వంటివి రాకుండా కాపాడుతుంది. -
వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం
నిప్పుల కొలిమి పక్కనే ఉన్నట్లు భగభగ మంటున్న ఎండ వేడిమి నుంచి తాటిముంజలు ఉపశమనమిస్తున్నాయని అంటున్నారు ఈ యువకులు. కళాశాలకు సెలవులు కావడంతో ఆత్మకూరులోని కొందరు యువకులు గ్రామ సమీపంలోని తాటితోపులోకి చేరుకుని తాటి ముంజలుతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. - ఆత్మకూరు