
వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం
నిప్పుల కొలిమి పక్కనే ఉన్నట్లు భగభగ మంటున్న ఎండ వేడిమి నుంచి తాటిముంజలు ఉపశమనమిస్తున్నాయని అంటున్నారు ఈ యువకులు. కళాశాలకు సెలవులు కావడంతో ఆత్మకూరులోని కొందరు యువకులు గ్రామ సమీపంలోని తాటితోపులోకి చేరుకుని తాటి ముంజలుతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.
- ఆత్మకూరు