heavy heat
-
తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన..ఫోటోలు
-
గిరిపై ఉక్కిరిబిక్కిరి
అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఆలయ ప్రాంగణం సత్తెన్న భక్తులకు ఎండదెబ్బ అరకొర ఏర్పాట్లతో ఇబ్బందిపడుతున్న భక్తులు ప్రహసనంగా మజ్జిగ పంపిణీ పనిచేయని వాటర్ కూలర్లు అన్నవరం : రత్నగిరి సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వివాహాల సీజ¯¯ŒS, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రత్నగిరిపై 40 డిగ్రీలకు పైబడి కాస్తున్న ఎండలకు భక్తులు తట్టుకోలేక పోతున్నారు. దేవస్థానంలో కొన్ని చోట్ల చలువ పందిళ్లు వేశారు. వ్రతమండపాల వద్ద మాత్రం వేయలేదు. అక్కడక్కడా షామియానాలు వేసేందుకు ఇనుప గొట్టాలు పాతి వదిలేశారు. దీంతో మధ్యాహ్నమైతే చాలు భక్తులు ఆలయప్రాంగణంలో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ‘‘తెల్లపెయింట్ వేశాం. దానిపై భక్తులు నడిస్తే కాళ్లు కాలవు’’ అని అధికారులు చెబుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు. రావిచెట్టు నీడలోనే సేదతీరుతున్నారు. ప్రహసనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం రత్నగిరిపై భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ ప్రహసనంగా మారింది. మజ్జిగ పంపిణీకి ఎంచుకున్న స్థలం, సమయం పరిశీలిస్తే అధికారుల చిత్తశుద్ధి బయటపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రోజుకు కేవలం 50 లీటర్లు పాలు మాత్రమే ఇందుకు కేటాయించారు. దీంతో వచ్చే మజ్జిగ మాత్రమే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. రోజూ పదివేలకు పైగా భక్తులు రత్నగిరికి వస్తుంటే , కనీసం వేయి మందికి కూడా ఈ మజ్జిగ సరిపోవడం లేదు. మొక్కుబడిగా నిర్వహణ.. సత్యదేవుని నిత్యాన్నదాన పథకం నుంచే ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నిత్యాన్నదానపథకానికి భక్తులు నిత్యం వేలాది రూపాయలు విరాళాలుగా సమర్పిస్తున్నా.. అధికారులు మజ్జిగ పంపిణీని మొక్కుబడిగా నిర్వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ మజ్జిగ పంపిణీని రోశయ్య మండపానికి ఎదురుగా నిర్వహించారు. ఈ సారి సర్కులర్ మండపంలో చివరన నిర్వహిస్తున్నారు. అలంకారప్రాయంగా కూలింగ్ వాటర్ పాయింట్ దేవస్థానంలో చాలా చోట్ల ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ పాయింట్లు పనిచేయడం లేదు. అయినా అధికారులు వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దేవస్థానం ఈఓ కార్యాలయం వెలుపల గల కూలింగ్వాటర్ పాయింట్ పనిచేయకుండా పోయి సుమారు ఆరునెలలైనా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భక్తులు చల్లని నీటి కోసం ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం
నిప్పుల కొలిమి పక్కనే ఉన్నట్లు భగభగ మంటున్న ఎండ వేడిమి నుంచి తాటిముంజలు ఉపశమనమిస్తున్నాయని అంటున్నారు ఈ యువకులు. కళాశాలకు సెలవులు కావడంతో ఆత్మకూరులోని కొందరు యువకులు గ్రామ సమీపంలోని తాటితోపులోకి చేరుకుని తాటి ముంజలుతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. - ఆత్మకూరు -
భానుడు భగభగ
సాక్షి, విశాఖపట్నం/ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. వేడి గాలులకుతోడు, కోస్తా జిల్లాల్లో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కబోతతో సతమతమవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు వడగాల్పులకు అలమటిం చిపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో 48.4డిగ్రీలు, పాల్వంచలో 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గుంటూరు జిల్లా రెంటచింతలలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 5 డిగ్రీలు వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో వేడి గాలులతోపాటు, అధిక పీడన ప్రభావం కూడా ఉన్నట్టు తెలిపింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని, ఎండలు పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వీలైనంత వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి... పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బు బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితోపాటు, బీపీ మాత్రలు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. వేడివల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటకు బయటకు వెళతాయి. డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండడం కోసం ఉప్పు కలిపిన నీరు మధ్య మధ్యలో తాగాలి. శక్తికోసం పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎండ సమయాల్లో బయటకు వెళ్లేప్పుడు సాధ్యమైనంతవరకూ తలకు, ముఖానికి వేడి తగలకుండా లేతరంగు వస్త్రాలు కట్టుకోవడం, గొడుగు వాడడం మంచింది. వేడిని ఆకర్షించని లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. తలనొప్పి, వాంతులు, వళ్లు నొప్పులు, తీవ్ర నీరసం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేసి, తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.