హెల్దీ హార్ట్ బీ(బి)ట్స్
రోజూ తాజా పండ్లు తింటే వాటిల్లోని పోషకాలతో గుండెకు సంబంధించిన జబ్బులు దూరం. తాజా పళ్లు, కూరగాయల్లో దొరికే యాంటీ ఆక్సిడెంట్లు... ఫ్రీ రాడికల్స్‌కూ, శరీరంలోని విషపదార్థాలకు వ్యతిరేకంగా పనిచేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
⇔ మధ్యధరా ప్రాంతం వారి ఆహార రహస్యం ఏమిటంటే... వాళ్లు తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆలీవ్ నూనె ఎక్కువ. దాంతోపాటు వాళ్ల రోజువారీ కార్యక్రమాల రూపంలో శ్రమ ఎక్కువ చేస్తారు. ఒత్తిడికి దూరంగా ఉంటారు.
⇔ సమతుల ఆహారం తీసుకోండి. ఆకలిగా ఉన్నప్పుడే భోజనం చేయండి. శ్నాక్స్ అంటూ తరచూ ఏదో ఒకటి పంటికింద నములుతూ ఉండకండి.
⇔ ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ పెనంలో వేయకండి.
⇔ మీ కొలెస్ట్రాల్ పాళ్లు కొద్దిపాటి ఎక్కువగా ఉంటే మరీ విచారించవద్దు. కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కంటే పొగతాగడం, ఎక్కువ బరువుండటమే మరింత హానికరం అని గుర్తించండి.
⇔ వెల్లుల్లి, చేపలు, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం... ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆయుధాలని గ్రహించండి.
హెల్త్ క్విజ్
⇔ మన దేహంలో అత్యంత బలమైన కండరం ఏది?
⇔ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
⇔ సగటు ఆయుర్దాయం ఉన్న వ్యక్తి జీవితకాలంలో గుండె ఎన్నిసార్లు స్పందిస్తుంది?
⇔ ఒక వ్యక్తి సగటు జీవితకాలంలో గుండె ఎంత రక్తాన్ని పంప్ చేస్తుంది?
⇔ ఇంతటి బలమైన గుండె ఎందుకు దెబ్బతింటోంది?
⇔ దాన్ని రక్షించుకోడానికి చేయాల్సిందేమిటి?
జవాబులు:
1. గుండె కండరం
2. 72 సార్లు
3. దాదాపు మూడు బిలియన్‌సార్లు
4. దాదాపు మూడులక్షల టన్నులు
5. మన జీవనశైలిలోని మార్పుల వల్ల
6. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని వ్యాయామం.
హెల్తీ హ్యాబిట్స్
⇔ బెడ్‌రూమ్‌లో కంప్యూటర్లను, టీవీని అమర్చుకోకండి.
⇔ పెంపుడు జంతువులు ఉన్నవాళ్లకు గుండె జబ్బులు తక్కువని తేలింది.
⇔ టెలివిజన్‌కు అంటిపెట్టుకోవడం స్థూలకాయానికి ఓ ప్రధాన కారణం.
⇔ సెల్‌ఫోన్స్‌తో స్ట్రెస్ పెరుగుతుంది. మీ మొబైల్ మిమ్మల్ని ఎప్పుడూ (అంటే... టాయ్‌లెట్స్‌లో, మూవీకి వెళ్లినప్పుడూ) అంటిపెట్టుకునే ఉండేలా చూసుకోకండి.
⇔ ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటే గుండెజబ్బుల రిస్క్ తక్కువ.
⇔ ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయని వైజ్ఞానికంగా నిరూపితమయ్యింది. లాఫ్టర్ థెరపీ వల్ల రక్తపోటు, ఒత్తిడి, క్యాన్సర్, గుండెజబ్బుల రిస్క్ తగ్గుతుంది.