ఎంతోమందిని వేధించే సమస్య అధిక బరువు. అందంగా, నాజుగ్గా కనిపించాలనుకునే వాళ్లు అధికం. కానీ వారి శరీర బరువు ఆ విధంగా ఉండనివ్వకపోవచ్చు. బరువు తగ్గడం కోసం కఠినమైన డైట్ పాటిస్తూ ఎంతో కాలం శ్రమిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అయితే అతి తక్కువ కాలంలో ఉత్తమ ఫలితం అందే చిట్కా ఉంటే ఇక అంతకంటే మహా భాగ్యం మరోకటి ఉండదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ చిట్కా వారి కోసమే. ఇలా చేయడం వల్ల కేవలం ఏడంటే ఏడు రోజుల్లోనే ఏడు కిలోల బరువు తగ్గవచ్చు. ఇందుకు జీఎమ్ (జనరల్ మోటర్స్) ఏడు రోజుల డైట్‌ను ఫాలో అయితే సరిపోతుంది. అదెలాగో తెలుసుకుందాం.
జనరల్ మోటార్స్ కార్పొరేషన్ మొదట వారి ఉద్యోగులను మంచి ఆరోగ్యంతో ఉంచడానికి ప్రతిపాదించిన ఈ ఆహార నియమం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇలాంటి మెరుగైన ఫలితాలను అందిస్తున్న వారికి అనేక మంది కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
డే 1: ఏడు రోజుల డైట్ నియమాన్ని పాటించే ముందు పండ్లను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో నారింజ, యాపిల్, పుచ్చకాయ, బేబీ కార్న్ వంటి తాజా పండ్లతో రోజును ప్రారంభించాలి. అయితే ఈ పండ్లలో సపోటా,కివీ, సీతాఫలం, ద్రాక్షను మినహాయించాలి. ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు తీసుకోవాలని జీఎమ్ వైబ్‌సైట్ సూచిస్తోంది. అయితే రోజంతా కేవలం పండ్లను మాత్రమే తినడం వల్ల శరీరంలో అలసట, నీరసం, ఆకలి బాధలు వంటివి పెరుగుతాయి. అయినప్పటికీ వాటన్నింటినీ భరించి పోరాటం చేస్తే తప్పకుండా ఉత్తమ ఫలితం అందుతుంది.
డే 2: రెండో రోజు డైట్‌లో భాగంగా ఆహారాన్ని చేర్చవచ్చు. ఈ రోజు కూరగాయలను తీసుకోవచ్చు. ఉదయం పూట చిలకడ దుంపను తీసుకున్న తర్వాత ఆకుకూరలు ఆహారంగా చేర్చుకోవాలి. ఇందులో ఎలాంటి పరిమితి ఉండదు.ఎంతైనా ఉపయోగించవచ్చు.
డే 3: మొదటి, రెండవ రోజు స్వీకరించిన పండ్లు, కూరగాయలు రెండింటినీ తినవలసి ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు పూర్తి స్థాయి ఆహారాన్ని తీసుకునేందుకు సహకరిస్తుంది.
డే 4: ఎనిమిది అరటిపండ్లు, 3 గ్లాసుల విరిగిన పాలు (skimmed milk) తీసుకోవాలి. ఇది నాలుగో రోజులో తీసుకోవాల్సిన నియమాలు.
డే 5: ఇప్పటి వరకు మితపరమైన ఆహారం స్వీకరించిన తరువాత ఇప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. అయిదవ రోజు ఒక పూట అర కిలో చికెన్, మరో పూట 6 టమోటాలను భోజనంగా తీసుకోండి.
డే 6: ఇక ఆరవ రోజు బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్‌తో మరో అర కిలో చికెన్ తీసుకోవాలి. కాని ఈసారి టమోటాలు, బంగాళాదుంపలు ఉపయోగించొద్దు.
డే 7: ఈ రోజు బ్రౌన్ రైస్, పండ్ల రసంతోపాటు ఆకుకూరలు ఆహారంగా తీసుకోవాలి. ఇది చివరి రోజు కాబట్టి శరీరం తేలికగా ఉన్నట్లు, సన్నగా అయినట్లు అనుభూతి చెందుతారు. అంతే ఇక ఇది పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఓవర్‌హైప్డ్ ఫ్యాడ్ డైట్స్‌లా కాకుండా ఇది వాస్తవంగా ఫలితాలను అందిస్తుంది. అంతేగాక చర్మం మరింత మెరుస్తుంది. గట్టిగా తలుచుకుంటే ఏడు రోజుల్లో ఏడు కిలోలు తగ్గడం పెద్ద కష్టంగా అనిపించదు.
అయితే ఈ డైట్ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నియమం ఇలా చేసే క్రమంలో మన ముఖంపై అలసట కనిపిస్తోంది. అలాగే ఈ ఏడు రోజుల వేగవంతంగా బరువు తగ్గడం కోసం మనకు నచ్చిన ఆహారానికి దూరంగా ఉండాలి. శరీరంలో అలసట, నీరసం వంటివి ఏర్పడతాయి. అంతేగాక జీవితమంతా కేవలం పండ్లు, కూరగాయలు, బ్రౌన్ రైస్,చికెన్ మీదే ఆధారపడి జీవించలేము. ఒక వేళ రోజువారీ పాత ఆహారానికి అలవాటు పడితే మన బరువు కూడా తిరిగి వచ్చేస్తుంది.
ఈ నిర్ధిష్ట ఆహారం తీసుకోవడం వల్ల మనం రోజూ పనులు చేయడం కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే అవసరం కంటే తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల జీవక్రియను నెమ్మదిస్తుంది. దీని ఫలితంగా భవిష్యత్తులో బరువు తగ్గడం కష్టమవుతుంది. చివరగా చెప్పే మాట ఏంటంటే అత్యవసర సమయాల్లో ఏదైనా ఫంక్షన్‌లకు హాజరు కావాలనుకున్నప్పుడు ఈ ఏడు రోజుల నియమం పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కానీ ఈ డైట్‌ను ఎల్లవేళలా పాటించడం మాత్రం ఆరోగ్యానికి సరైనది కాదు.
నోట్: జీఎం డైట్ సౌజన్యంతో ..
Comments
Please login to add a commentAdd a comment