రైతు బజార్‌లో తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు | fruits and vegetables rates decrease in rythubazar | Sakshi
Sakshi News home page

రైతు బజార్‌లో తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

Published Fri, Nov 18 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

రైతు బజార్‌లో తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

రైతు బజార్‌లో తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు

అనంతపురం అగ్రికల్చర్‌ : ఆంజనేయ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ప్రజల సదుపాయం కోసం రైతుబజార్‌లో పండ్లు, కూరగాయలు తక్కువ ధరకే అందుబాటులో ఉంచామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు సీహెచ్‌ శివసత్యనారాయణ తెలిపారు. బహిరంగ మార్కెట్, మాల్స్‌లో అమ్మేదాని కన్నా ఇక్కడ తక్కువకే విక్రయిస్తున్నందున వినియోగించుకోవాలన్నారు. ప్రధానంగా శని, ఆదివారం రోజుల్లో అన్ని రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల స్పందనను బట్టి భవిష్యత్తులో మరింత తక్కువగా, మరిన్ని ఉత్పత్తులు అందుబాటులో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పండ్లు, కూరగాయల ధరలు కిలో ఒక్కంటికి ఇలా ఉన్నాయన్నారు.
 
సరుకు            రైతుబజార్‌    బహిరంగమార్కెట్‌    మాల్స్‌    
––––––––––––––––––––––––––––––––––
ఉల్లి            6        10            16
టమాట            3.50        6            5
పచ్చిమిరప        10        15            30
ఎండుమిర్చి        80        150            120
బెండ            10        15            15
అనప            25        40            ––
రేగు            20        40            ––
దానిమ్మ            80        100            150
వేరుశనగ విత్తనాలు    85        100            100
––––––––––––––––––––––––––––––––––

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement