![Health Benefits Of Aloo Bukhara Fruit](/styles/webp/s3/article_images/2024/07/2/aloo.jpg.webp?itok=FBtwgF5b)
వర్షాకాలంలో వ్యాధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆహార విషయానికొస్తే తగిన జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. ఈ సీజన్‌లో ఆలూ బుఖారాతో కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం.
ఆలూ బుఖారాలో విటమిన్ సి ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఈ పండు శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్లను కలిగి ఉండటంతోపాటు ఈ వ్యాధులను కూడా నివారిస్తుంది.
ఆలూ బుఖారాతో ప్రయోజనాలు..
ఆలూ బుఖారా జీర్ణవ్యవస్థ సమస్యలను తొలగించడంతోపాటు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే కడుపు నొప్పి సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ పండు తీపిగా ఉన్నప్పటికీ, మధుమేహ రోగులకు ప్రయోజనాన్నిస్తుంది. ఇది పీచు పదర్థంగా ఉంటూ, రక్తంలో అవసరమైనంత చక్కెర స్థాయినిస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా ఆలూ బుఖారాను తక్కువ మోతాదులో తీసుకోవచ్చు.
ఎముకలు దృఢంగా మారడంలో ఆలూ బుకారా ఎంతో ఉపయోగకరం. ఎముకలు దెబ్బతినకుండా, ఎముకల వ్యాధి వంటి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంది.
అధిక రక్తపోటు నుంచి రక్షించడంతోపాటు, దీన్ని తినడంతో బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా అరికడుతుంది.
విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆలూ బుఖారా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచడంలో ఎంతో తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడంతో ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుంది.
(చదవండి: 6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..)
Comments
Please login to add a commentAdd a comment