Sara Ali Khan Reveals Her Surprising Natural Beauty Secrets In Telugu - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే

Published Tue, Jan 31 2023 2:23 PM | Last Updated on Tue, Jan 31 2023 4:54 PM

Sara Ali Khan Reveals Her Surprising NAtural Beauty Secrets - Sakshi

Sara Ali Khan Beauty Tips: నవాబుల వారసురాలు.. పటౌడి పరగణా యువరాణి.. ఒకప్పటి బీ-టౌన్‌ జోడీ సైఫ్‌ అలీఖాన్‌- అమృతా సింగ్‌ కుమార్తె.. అలనాటి హీరోయిన్‌ షర్మిలా ఠాగోర్‌ మనుమరాలు.. ఇన్ని ట్యాగ్‌లు ఉన్నప్పటికీ.. హీరోయిన్‌ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి ఎంతో కఠినంగా శ్రమించింది సారా అలీఖాన్‌.

అధిక బరువు కారణంగా ఆరంభంలో ఇబ్బందులు పడ్డ ఆమె.. పట్టుదలతో సమస్య నుంచి విముక్తి పొందింది.  కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తనదైన అందం, అభినయంతో యువకుల ఆరాధ్య దేవతగా మారిపోయింది.

కాగా బాల్యంలోనే పీసీఓడీ బారిన పడిన కారణంగా సారా చదువుకునే రోజుల్లో దాదాపు 96 కిలోల బరువుతో బొద్దుగా ఉండేది. అయితే, బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేసి.. ప్రస్తుత శరీరాకృతిని పొందింది. అయితే.. తన కాంతులీనే ముఖసౌందర్యానికి కారణం మాత్రం అమ్మ చెప్పిన చిట్కానే అంటోంది ఈ బ్యూటీ. సారా పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. 

పండ్ల తొక్క కూడా వదలను
‘నా బ్యూటీ సీక్రెట్‌ తాజా పండ్లు.. బాదం పప్పు. సీజన్‌లో దొరికే పండ్లను వదిలిపెట్టను. వాటి తొక్కను కూడా. పండ్లను తింటాను.. తొక్కతో మొహానికి మసాజ్‌ చేసుకుంటా. బాదం పప్పుతో ఫేస్‌ప్యాక్‌ వేస్తా.

ఒక టీ స్పూన్‌ బాదం పప్పు పౌడర్‌లో ఒక టీ స్పూన్‌ శనగపిండి, రెండు టీ స్పూన్ల పాలు, కొన్ని రోజ్‌ వాటర్‌ చుక్కలు కలిపి మొహానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తా. ఇది గనుక రెగ్యులర్‌గా చేస్తే ఇంకే కాస్మెటిక్స్‌ అవసరం లేదు.. రాదు. మా అమ్మ చెప్పిన చిట్కానా మజాకా మరి!’’ అంటోది సారా అలీ ఖాన్‌.

చదవండి: Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్‌ ధర?
Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement