సిడ్నీ: ఫైబర్ ఎక్కువ గా ఉండే ధాన్యాలు, పండ్లు రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. సిడ్నీలోని భారత సంతతికి చెందిన బామినీ గోపినాథ్ ఆధ్వర్యంలోని బృందం 50 ఏళ్లకు పైబడిన 1600 మందిపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాలు వెల్లడించారు.
ఫైబర్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవని, వయసుతోపాటు వచ్చే నిసృ్పహ భావాలు, శ్వాస, హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే వీరు పదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని, దీనికి కారణం వారిలో రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండడమేనన్నారు. బామినీ గోపినాథ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ‘వెస్ట్‌మెడ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్’లో అసోసియేటివ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వృద్ధాప్యాన్ని ఇలా జయించవచ్చు!
Published Fri, Jun 3 2016 1:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM
Advertisement