
రిఫ్రిజిరేటర్లో ప్రతిదీ... తోసేయకండి. సీజన్‌తో పనిలేకుండా అన్నిరకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టేస్తుంటారు కొందరు. అయితే అన్నింటిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. ఐదురకాల ఆహారాలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అవేంటో చూడండి...
ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు..
- సాస్, జామ్, జెల్లీలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టాల్సిన అవసరంలేదు.
- టొమాటోలను ఫ్రిడ్జ్‌లో పెట్టడడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి పోతుంది. వీటిని బయట ఉంచితేనే తాజాగా.. రుచిగా ఉంటాయి.
- అరటి పండ్లు త్వరగా పండిపోతాయని రిఫ్రిజిరేటర్‌లో పెడుతుంటారు. ఇది మంచిది కాదు. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే మంచిది
- మీరు తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి త్వరగా ఎండిపోతాయి. మీరు ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో కొద్దిగా గది-ఉష్ణోగ్రత నీటిలో ఉంచవచ్చు. లేదా వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచవచ్చు.
- కాఫీను, కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే.. అది దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని తీసేసుకుంటుంది.
- పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచాలంటున్నారు నిపుణులు. వాటిని ముక్కలు చేసిన తర్వాతనే ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చని తెలిపారు.
- బ్రెడ్ స్లైసులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి.
- ..పీచ్, ప్లమ్, బ్లాక్‌బెర్రీ, ఆవకాడోలను రిఫ్రిజిరేటర్‌లో కంటే బయటే ఉంచాలి.
(చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment