Elon Musk or Musk Melon: Desi Woman Teacher Mispronouncing Elon Musk Name As Musk Melon, Video Goes Viral- Sakshi
Sakshi News home page

వైరల్‌: ఎలాన్‌ మస్కా.. మస్క్‌ మెలానా?

Published Wed, Mar 24 2021 11:32 AM | Last Updated on Wed, Mar 24 2021 5:30 PM

Desi Teacher Pronunciation of Tesla CEO Elon Musk As Musk Melon - Sakshi

టెస్లా కంపెనీ ఫౌండర్‌, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా 2020 ప్రపంచ కుబేరుల టాప్‌ టెన్‌ జాబితాలో చేరాడు ఎలాన్‌ మస్క్‌. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. తన పేరుకు సంబధించిన వీడియో ఇది. ఎలాన్‌ మస్క్‌ పేరు ఎంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉందో.. దాన్ని పలకడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో వెల్లడించారు ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌. ఎలాన్‌ మస్క్‌ పేరును మస్క్‌ మెలాన్‌ అని పలికి దానికి అర్థం ఖర్బుజా అని చెప్పి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయ్యేవారికి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొనౌన్సియేషన్‌ రాజేశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గౌరవ్‌ గేర్‌ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి ఇళ్లల్లో పనిచేస్తుండే వారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన టిక్‌టాక్‌‌ రాంగ్‌ ప్రొనౌన్సియేషన్‌ చాలెంజ్‌ ద్వారా పాపులర్‌ అయ్యారు రాజేశ్వరి. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే ఓ ఆంగ్ల పదాన్ని బోర్డు మీద రాస్తారు. దాన్ని అక్షరం అక్షరం విడివిడిగా పలుకుతారు. చివరకు అన్ని కలిపి ఓ కొత్త పదాన్ని క్రియేట్‌ చేస్తారు. దీనిలో భాగంగానే గతంలో రాజేశ్వరి తాబేలు పేరును ఇంగ్లీష్‌లో రాసి.. అక్షరం అక్షరం పలుకుతూ.. చివరకు ‘టుర్టలే’ అని చెప్పి తాబేలు అని అర్థం వివరించారు. 

ఈ క్రమంలోనే రాజేశ్వరి ఎలాన్‌ మస్క్‌ పేరును బోర్డు మీద రాశారు. అక్షరం అక్షరం పలుకుతు చివరకు అన్నింటిని కలిపి ఎలాన్‌ మస్క్‌కు బదులు మస్క్‌ మెలాన్‌ అని పలికారు. పైగా దాని అర్థం ఖర్బుజా అని వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులంతా పడి పడి నవ్వుతున్నారు. ‘‘దీన్ని ఎవరైనా ఎలాన్‌ మస్క్‌ దృష్టికి తీసుకెళ్తే పాపం ఎలా ఫీలవుతాడో’’ అని కామెంట్‌ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘దేశీ ఇంగ్లీష్‌ టీచరా మజాకా’’ అని కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: రుజువైతే ..టెస్లా కంపెనీ మూసివేత..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement