పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది.
ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్‌తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది.
వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment