రీల్స్ తో ట్రెండింగ్‌లో నిలుస్తున్న జంట
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’.
సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.
అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన‍్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment