sunscreen
-
స్టైల్‌గా హోలీ!
బ్యూటిప్స్ ఏడురంగులు.. ఏ రంగు ఎటువైపుగా మన మేనిని తడుముతుందో తెలియదు. కానీ, తెలుపు రంగు దుస్తులను ధరిస్తే ఊహించనన్ని రంగులు డిజైన్లు డిజైన్లుగా ఆనందపు కెరటాల్లా అంటుకుపోతాయి. అందుకని తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అవ్వాల్సిందే! కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తా ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్: హోలీ ఆడటానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్‌ను మేనికి రాసుకోండి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు. హెయిర్ స్టైల్: జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు. జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను వాడచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే ఆ తర్వాత పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీనివల్ల వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు. -
'బ్యూ'టిప్స్
సమ్మర్ కేర్ బయటికెళ్లేటప్పుడు తలకు హ్యాట్ కాని క్యాప్కాని పెట్టుకుంటే కొంతలో కొంత రక్షణ ఉంటుంది.సమ్మర్లో పాదాలకు, వేళ్లకు గాలి తగిలే పాదరక్షలనే వాడాలి. ఫంక్షన్లకు వెళ్లేటప్పడు పాదం మొత్తాన్ని కవర్ చేసే ఫ్యాన్సీ శాండల్స్, షూస్ వేసుకోవాలంటే... వేళ్ల మధ్య టాల్కమ్ పౌడర్ చల్లాలి.ఎండ నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ వాడేవాళ్లకు కళ్ల చుట్టూ మినహా మిగిలిన ముఖమంతా ట్యాన్తో ప్యాచ్‌లా ఉంటుంది. కాబట్టి సన్‌గ్లాసెస్ ధరించడంతోపాటు ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సమ్మర్ మేకప్‌లో ఐ లైనర్ పెన్సిల్ కలర్ కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేకప్ హెవీ కాకుండా ముఖం తీరుగా కనిపింపచేయడంలో గ్రే, చాకొలేట్, నేవీ షేడ్లు ముఖ్యమైనవి.సాయంత్రం పార్టీలకు లూస్ షిమ్మర్ పౌడర్ వేసుకుని పెదవులకు లేత రంగు లిప్‌గ్లాస్ వేస్తే బాగుంటుంది.తప్పని సరిగా ఫౌండేషన్ వేసుకోవాలనుకుంటే... అందులో కొంచెం లూజ్ పౌడర్ కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం జిడ్డుబారదు. రోజంతా తాజాగా కనిపించవచ్చు. -
మేని మెరుపులకు...
చర్మసౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు చాలా మంది. అయితే కొన్ని సార్లు చర్మాన్ని మెరుగు పెట్టే సౌందర్య ఉత్పాదనలు, ఇంట్లో చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల కూడా హాని జరుగుతుంటుంది. అవగాహన లేమి దీనికి ప్రధాన కారణం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఏమేం చేయకూడదంటే... Right: చర్మం తెల్లగా అవ్వాలని, మృదువుగా అవ్వాలని స్క్రబ్(మార్కెట్లో రకరకాల స్క్రబ్‌లు అందుబాటులో ఉన్నాయి) తో అతిగా రుద్దుతుంటారు. దీని వల్ల చర్మం ఎర్రబడడమే కాకుండా పొడిబారుతుంది. మొటిమలు ఉంటే సమస్య మరింతగా పెరుగుతుంది. Wrong: రెండు వారాలకు ఒకసారి చర్మతత్త్వానికి సరిపడే స్క్రబ్ (మార్కెట్లో లభిస్తుంది) తో 2-3 నిమిషాలు మృదువుగా రుద్ది, శుభ్రపరుచుకోవాలి. మెటిమలు ఎక్కువగా ఉంటే స్క్రబ్ వాడకూడదు. వేపాకులను రుబ్బి, ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరచాలి. Right: చాలామంది తమ చర్మతత్వానికి సరిపడిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్లు ఎంచుకోరు. దీని వల్ల సేదగ్రంథులు మూసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు, పొక్కులు రావడం జరుగుతుంటాయి. Wrong: ఏదైనా కొత్త సౌందర్య ఉత్పత్తిని చర్మానికి ఉపయోగించే ముందు మోచేతిపై లేదా చెవి వెనకాల కొద్దిగా రాసి, 2-3 గంటల సేపు అలాగే ఉంచాలి. ఎరుపు దనం, దద్దుర్లు లేవని నిర్ధారించుకున్నాకే ఆ ఉత్పత్తిని వాడుకోవాలి. అలాగే, మాయిశ్చరైజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ చర్మానికి రాసిన 60 సెకండ్లలో ఇంకిపోతుంది. ఆ తర్వాత ఫౌండేషన్‌ను వాడవచ్చు. మొటిమలను గిల్లడం, లోపలి పస్(చీము) తీయడం వంటివి చేస్తే ఆ ప్రాంతంలో మచ్చలు పడే అవకాశం ఉంది. Right: జిడ్డు చర్మం గలవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీరు రోజులో 2-3 సార్లు ఫేస్‌వాష్‌తో శుభ్రపరుచుకోవడం, నిమ్మ గుణాలున్న పేస్ప్యాక్లు వేసుకోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉండి మొటిమల సమస్య తగ్గుతుంది. Wrong: చాలామంది దుస్తులు ధరించిన తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటారు. దుస్తుల మీద స్ప్రే చేయడం వల్ల అందులోని ఫైబర్ లక్షణాలతో కలిసి పెర్ఫ్యూమ్ సువాసన మారే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ తరహా ప్రయోగాలు చర్మానికి హాని కలిగించవచ్చు. Right: వస్త్రధారణకు ముందు దూది ఉండకు స్ప్రే చేసి గొంతు, ముంజేతులు, భుజాల కింద... పెర్ఫ్యూమ్ను అద్దాలి. దీని వల్ల చర్మానికి హాని కలగదు.